Vote for notes
-
రాప్తాడులో 'కట్ట'ల పాములు
అనంతపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులను ఓటర్లకు ఎరగా వేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డబ్బులను ఇప్పటి నుంచే సర్దుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాప్తాడు నియోజవకవర్గం చెన్నేకొత్తపల్లిలో పోలీసుల తనిఖీల్లో రూ.1.27 కోట్లు పట్టుబడడం అద్దం పడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టడడం కలకలం సృష్టించింది. పరిటాల శ్రీరామ్ సన్నిహితులే.. శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేస్తుండగా తెలంగాణా రిజిస్ట్రేషన్‌తో వచ్చిన కారులో రూ. 1.27 కోట్లు పట్టుబడ్డాయి. అయితే ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళుతున్నారు. ఎందుకు తీసుకెళుతున్నారనే పోలీసుల ప్రశ్నలకు కారులో ఉండే వ్యక్తులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులు కారును, అందులోని వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కారులో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ మండలంలో పనిచేస్తున్న వీఆర్వో ఉండడం గమనార్హం. తెలంగాణ వాసులతో పాటు రాప్తాడుకు చెందిన ఐదారుగురు ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. వీరంతా మంత్రి పరిటాల నునీత కుమారుడు శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది. పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత డబ్బు సర్దుబాటు వ్యవహారం కొత్త తలనొప్పులకు కారణమవుతుందని భావించిన అధికార టీడీపీ నాయకులు ఆ మేరకు ఇప్పటి నుంచే అక్రమాలకు తెరలేపారు. నగదు సర్దుబాటులో భాగంగానే రాప్తాడు నియోజకవర్గంలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రూ.1.27 కోట్లు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును అత్యంత గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంగా ఇప్పటికే సదరు పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. పట్టుబడిన సొమ్మును రియల్‌వ్యాపారానికి ముడిపెట్టి కేసును మూతవేయించే దిశగా పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ కారులో లేవు. రామగిరి: చెన్నేకొత్తపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.1.27 కోట్లను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చెన్నేకొత్తపల్లి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భూమి కొనుగోలు విషయమై బెంగుళూరుకి తరలిస్తున్న రూ.1.27 కోట్లు తమ తనిఖీలో పట్టు పడినట్లు పేర్కొన్నారు. అయితే ఇందుకు సరైన ఆధారాలు, పత్రాలు చూపకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రవివర్మ, అతని స్నేహితుడు రామకృష్ణరాజు, డ్రైవర్ భాస్కర్‌కుమార్, చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ అహమ్మద్, రామగిరి మండలం కుంటిమద్ది నివాసి సానిపల్లి అక్కులప్పను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నగదు, సంబంధిత వ్యక్తులు ఉపయోగించిన వాహనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. -
ఓటుకు నోటుపై వినూత్న సమరం
నేతల తలరాతను, ప్రభుత్వాల మనుగడను శాసించే ఓటుకు ఇటీవలి కాలంలో విలువ కడుతున్నారు. ప్రజాస్వామ్యానికి.. తద్వారా సమాజానికి చేటు చేసే ఈ దుస్సంప్రదాయాన్ని రాజకీయ నేతల నుంచి ప్రజలు కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఎవరు ఎక్కువిస్తే వారికే ఓటు వేస్తామన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడేలా పౌరులను చైతన్యపరచడమే లక్ష్యంగా విశాఖ నగరానికి చెందిన ఓ సామాన్యుడు.. అసామాన్య ప్రయత్నం చేపట్టాడు. ‘ఓటుకు నోటు వద్దు’ అన్న నినాదంతో గురువారం రాష్ట్రవ్యాప్త సైకిల్ యాత్ర ప్రారంభించాడు. విశాఖసిటీ: భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోంది. అవినీతి మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థను డబ్బు శాసిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డబ్బును వెదజల్లి.. మళ్లీ ఆ డబ్బు సంపాదనకు రాజకీయం ఆసరాగా మారి.. మొత్తానికి వ్యవస్థ భ్రష్టు పడుతోంది. ఎవరు ఎక్కువ మొత్తం ముట్టజెప్పితే.. వారికే ఓటు అనే రాజకీయ పాచికలాటలో సామాన్యుడి ఓటు నగదు నోటులా రూపాంతరం చెందుతోంది. దాంతో రాజకీయం నోట్ల కట్టల మీద నిలబడింది. సామాన్యుడి ఘోష అరణ్య రోదన అవుతోంది. ఇలా ఎన్నేళ్లు? ఇలా ఎన్నాళ్లు? ఈ ప్రశ్న ఆ యువకుడిని వెంటాడింది. ఈ దురవస్థను అంతం చేసేందుకు ప్రజలను చైతన్యపరచాలన్న బాధ్యత అతడి మనసులో మెదిలింది. నోటు తీసుకోకుండా జనం ఓటు వేసినప్పుడే ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ అవుతారన్న విషయం అతడికి అవగతమైంది. ఈ విషయాన్ని పదిమందికీ తెలియజెప్పి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు సామాన్యుడి వాహనమైన సైకిల్ శరణ్యమన్న ఆలోచన అతడి మదిలో కదిలింది. దాంతో ఓటుకు నోటు వైపరీత్యానికి వ్యతిరేకంగా వినూత్నంగా సైకిల్ యాత్ర ప్రారంభమైంది. అవినీతి రాజకీయాలకు చరమ గీతం పాడేలా.. నోటుకు ఓటు అమ్మవద్దని ప్రచారం చేస్తూ ఆరిలోవకు చెందిన చింతకాయల శ్రీను అనే యువకుడి సైకిల్ యాత్ర గురువారం నగరం నుంచి ప్రారంభమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర 13 జిల్లాల్లో కొనసాగనుంది. పీపుల్స్ ఫోరం ఫర్ ఇండియా వైస్ చైర్మన్ బీఎల్ నారాయణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా యాత్రను ప్రారంభించానని చెప్పారు. అవినీతి రాజకీయాలకు అంతా స్వస్తి చెప్పి.. కొత్త శకానికి నాంది పలికేలా నడుం బిగించాలని పిలు పునిచ్చారు. ‘‘ఓటుకు నోటు వద్దు’’ అనే నినాదంతో నెల పాటు సాగే సైకిల్ యాత్ర కర్నూలులో ముగియనుందని చింతకాయల శ్రీను తెలిపారు. యాత్ర ప్రారంభంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, యూఎస్‌ఎన్ రాజు, సురేష్, గణేష్‌లు పాల్గొని మద్దతు పలికారు. -
ఓటుకు రూ.10 వేలు!
సాక్షి, చెన్నై : ప్రభుత్వాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉప ఎన్నికలను సవాల్‌గా తీసుకుందని, ఓటుకు రూ.పది వేలు పంపిణీకి సిద్ధం అవుతోందని అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఆరోపించారు. ఇందుకోసం రూ.ఐదు వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తేని జిల్లా ఆండిపట్టిలో ఆదివారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. 18 మంది మీద అనర్హత వేటు వేసిన అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ఇప్పుడు భయంతో వణికిపోతోందని «ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళన వారిలో బయలుదేరిందని పేర్కొన్నారు. ఈ 18తో పాటు తిరుప్పరంగుండ్రం వారి ఖాతా నుంచి చేజారడం ఖాయం అన్న విషయాన్ని గ్రహించారన్నారు. ఈ స్థానాలన్నీ చేజారిన పక్షంలో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అన్నారు. ఇదే అదనపుగా తమ నేత దినకరన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి , ప్రభుత్వ మార్పు మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలో ఆ సమన్వయ కమిటీ ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న సంకల్పంతో ఆ కమిటీ ఉందన్నారు. పదే పదే సమావేశాలు నిర్వహిస్తోందని, శనివారం సాగిన సమావేశంలో చర్చకు వచ్చిన రహస్య సమాచారాలు తమ దృష్టికి చేరాయన్నారు. ఓటుకు పది వేలు పంపిణీకి పాలకులు సిద్ధం అయ్యారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును, ప్రభుత్వ పథకాల కోసం కేటాయించిన నిధుల్ని దారి మళ్లించి 19 స్థానాల్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగానే వ్యూహాల్ని రచించారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.పది వేలు అందించేందుకు సిద్ధం అయ్యారని, ఇందుకోసం ఇన్‌చార్జ్‌ల్ని రంగంలోకి దించారని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవరా>్గనికి రూ.200 కోట్లు చొప్పున ఖాళీగా ఉన్న 20 నియోజకవర్గాలకు కేవలం ఓటర్లను కొనుగోలు చేయడం కోసం రూ.4 వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం అందిందన్నారు. అలాగే, మరో వెయ్యి కోట్లు ఇతర ఖర్చులకు కేటాయించి ఉండడాన్ని బట్టి చూస్తే, ఏమేరకు ఈ పాలకులు దోపిడీలకు పాల్ప డి ఉంటారో అనేది స్పష్టం అవుతోందన్నారు. -
సీఎం కన్నా ఊసరవెల్లి నయం
ఆళ్లగడ్డ: పూటకో మాట మార్చుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ఊసరవెల్లి నయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఆయన అసమర్థతతోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. దోచుకునేందుకే ప్యాకేజీ ఒప్పకున్నారని ఆరోపించారు. అదే ఏపీకి హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి చిత్తశుద్ధిని నిరుపించుకోవాలన్నారు. -
మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది
♦ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పాం ♦ అయినా ప్రయోజనం లేకపోయింది ♦ అది మాకు ఇబ్బందికర పరిస్థితి ♦ ఓటుకు కోట్లు కేసులో హైకోర్టుకు టీ ఏసీబీ న్యాయవాది నివేదన ♦ నేడు ఉండవల్లి వాదనలు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయవాది వి.రవికిరణ్‌రావు తెలిపారు. ఇది తమకు ఇబ్బందికర పరిస్థితని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము మెమో ద్వారా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామని, అయినా ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అంతేకాక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసేలా సీఆర్పీసీ సెక్షన్ 210 కింద ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరితే ప్రత్యేక కోర్టు మాత్రం సెక్షన్ 156(3) కింద ఇచ్చిందన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఆదేశాలివ్వడం ఒకే రోజు చేసిందన్నారు. ఈ వాదనలతో ఈ కేసులో ఏసీబీ వాదనలు ముగిసినట్లయింది. బుధవారం ఈ కేసులో తన వాదనలు వినాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించనున్నారు. ఆ తరువాత ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏసీబీ వాదనలకు తిరుగు సమాధానం ఇవ్వనున్నారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై 4 వారా ల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏసీబీ తరఫున రవికిరణ్‌రావు సోమవారం నాటి తన వాదనలను మంగళవారం కూడా కొనసాగించారు.