vykunta ekadasi
-
రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
వైకుంఠ ఏకాదశినాడు తిరువీధిలో ఉత్సవం
-
ఏపీలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
-
తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిట
-
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..
-
స్వర్ణరథంపై తిరుమలేశుని విహారం
-
ముక్కోటి ఏకాదశి.. భక్తకోటి పరవశించి!
తిరుమల/ సింహాచలం (విశాఖపట్నం)/ శ్రీశైలం(కర్నూలు)/ కదిరి(అనంతపురం)/ నెల్లిమర్ల రూరల్ (విజయనగరం)/ మంగళగిరి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తకోటి పరవశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. తిరుమలలో వైకుంఠ మహాద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమాడ వీధుల్లో, నారాయణగిరి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా క్యూల్లోనూ, తాత్కాలిక షెడ్లలోనూ చలి తీవ్రత తట్టుకొనేందు దుప్పట్లను పంపిణీ చేశారు. ఒకసారి 80 వేల మందికిపైగా అన్న పానీయాలు వితరణ చేసేలా టీటీడీ అన్నదాన విభాగం కృషి చేసింది. వీఐపీలు తరలి వచ్చారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో భారీగా వచ్చిన దరఖాస్తులను కుదించి 3,500 టికెట్లు జారీ చేశారు. వారికి 1.30 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించి ముగించేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. సప్తగిరీశుడు స్వర్ణ రథంపై ఊరేగింపు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగంలో రాజాధిరాజులకు కూడా రాజును తానే అంటూ భక్తులకు తెలియచెప్పడానికి స్వర్ణరథంపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగారు. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో సోమవారం మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ప్రాతఃకాల పూజలనంతరం స్వామివార్ల గర్భాలయ ఉత్తరద్వారంలో ఉత్సవమూర్తులను వేంచేయింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న ఆర్జిత కల్యాణాలు రద్దు కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆర్జిత, శాశ్వత కల్యాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. పోటెత్తిన కదిరి అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తమ ఇలవేల్పు దేవుడు లక్ష్మీ నారసింహుని ఉత్తర గోపురం ద్వారా దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక సిరి.. రామగిరి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి ఉత్తర ద్వారదర్శనం, గిరి ప్రదక్షిణలకు ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు పోటెత్తారు. మంగళగిరిలో పోటెత్తిన భక్తులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం దాదాపు లక్ష మందికి పైగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, శివక్షేత్ర శివస్వామి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సింహగిరిపై ముక్కోటి ఏకాదశి సింహాచలంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఘనంగా జరిగింది. సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.45 గంటల నుంచి ఉదయం 11.15 గంటల వరకు ఉత్తరద్వారంలో స్వామివారి దర్శనం కల్పించారు. సింహాచలం క్షేత్రం మహా పుణ్యక్షేత్రమని, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే.మహేశ్వరి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. చెంగాళమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సూళ్లూరుపేట: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దంపతులు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జీవీ కృష్ణయ్య, హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఎస్‌వీఎస్‌ఆర్ మూర్తి సోమవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
నేడే వైకుంఠ ఏకాదశి
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమలకు వస్తున్న భక్తుల కోసం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం తిరుమలలో పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి చేసిన ఏర్పాట్లు బాగున్నా యని అధికారులను ప్రశంసించారు. నారా యణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు పంపిణీ చేస్తున్న ఉప్మాను రుచి చూసి భేషుగ్గా ఉందని చెప్పారు. నారాయణగిరి ఉద్యాన వనాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగు దొడ్ల వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన షెడ్లను గవర్నర్ పరిశీలించి అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తప్పకుండా వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుందని, తమ వంతు వచ్చే వరకు భక్తులు ఓర్పుతో ఉండి టీటీడీకి సహకరించాలని సూచించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. -
తెప్పోత్సవానికి పెథాయ్ దెబ్బ
భద్రాచలంటౌన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం ముందు రోజున పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించేందుకు జిల్లా అధికారులు సోమవారం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే పెథాయ్ తుపాను ప్రభావంతో సీతారాముల జలవిహారానికి అంతరాయం ఏర్పడింది. తీరంలోనే హంసవాహనాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. భద్రాచలం రామాలయం చరిత్రలో ఇలా ఆటంకం ఏర్పడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. అయితే స్వామి, అమ్మవార్లను గర్భగుడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ గోదావరి తీరానికి తీసుకొచ్చి, హంసవాహనంపై కూర్చుండబెట్టారు. అంతకుముందు పుణ్య జలాలతో హంస వాహనాన్ని సంప్రోక్షణ చేసిన అర్చకులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు ఆలయ ఈఓ రమేశ్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చ తుర్వేదాలు, నాళాయిర దివ్యప్రబంధం, పం చసూత్రాలు పఠించారు. అనంతరం మంగళహారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. హంస వాహనంలో ఆశీనులైన సీతారాములను చూసి భక్తులు పులకించిపోయారు. కాగా, స్వామివారు గోదావరిలో విహరించకపోవడంతో భక్తులు కొంతమేర అసంతృప్తికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రా«ధిక, సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
కొత్తచెరువు : ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం చెన్నకేశవపురం వేలాదిమంది భక్తులతో కిటకిలలాడంది. జయ జయ ధ్వానాలు.. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ధర్మకర్తలు ఉషారాణి, చన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మండలంలోని చెన్నకేశవపురంలో మూడురోజులుగా బ్రహ్మోత్సవాలు వేదపండితులచే నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ధర్మకర్తలు వైకుంఠ ముఖద్వారంలో ప్రవేశించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన కల్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం ధర్మకర్తల ఇంటి నుంచి మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. 11 గంటల వరకు వేదపండితుడు గురురాజప్రసాద్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంఽగా కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి వేడుకలను తిలకించారు. సాయంత్రం స్వామివారికి చక్రస్నానం ధ్వజారోహణ చేశారు. అనంతరం శ్రీవారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు లక్ష్మీచెన్నకేశవ ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖుల హాజరు వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నేత డాక్టర్ హరికృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, స్నేహలత నర్సింగ్‌హోం అధినేత మల్లికార్జునరెడ్డి, డాక్టర్ గోపాల్‌రెడ్డి, కొండసాని సురేష్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, అవుటాల రçమణరెడ్డి, సర్పంచ్‌లు అలివేలమ్మ, శ్యాంసుందర్‌రెడ్డి, పుట్టపర్తి టౌన్ కన్వీనర్ మాధవరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, రెడ్డప్పరెడ్డి, ప్రశాంతి గ్యాస్ అధినేత పీవీ సూర్యనారయణ, డీఎస్పీ వేణుగోపాల్, సీఐ శ్రీధర్ పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలతో అలరించిన శోభారాజు కొత్తచెరువు : అన్నమయ్య కీర్తనలతో భక్తులు పులంకించారు. తన గాత్రంతో భక్తులను మైమరంపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శోభారాజును ధర్మకర్తలు సన్మానించారు. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.
-
సింహాచలంకు పోటెత్తిన భక్తులు
-
’సామాన్యులకే అధిక ప్రాధాన్యం ’
-
భక్త వైకుంఠం
-
వైకుంఠ ఏకాదశికి సిద్ధమైన తిరుమల
-
వైష్ణవ ఆలయాల్లో ఉత్సవంలా వైకుంఠ ఏకాదశి
-
ఉత్తర ద్వార దర్శనం చేస్తే..వైకుంఠ ప్రాప్తి..!
-
'వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి'
-
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: జేఈవో
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు పూర్తయ్యయని తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి రోజున స్వర్ణరథం, ద్వాదశికి శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులే అధిక ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 48 గంటలపాటు వైకుంఠద్వారం తెరిచే ఉంటుందన్నారు. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సామాన్య భక్తులను ఆదివారం(రేపు) ఉదయం 11 గంటలకు కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామన్నారు. ఏకాదశి రోజున ఒంటిగంటలకు వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని జేఈఓ చెప్పారు. వీఐపీతో పాటు ముగ్గురికి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి లభిస్తుందని తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా క్యూలెన్‌లో ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామరాజు, సీతా నిలయంలో వీఐపీలకు దర్శన వసతి ఏర్పాట్లు చేయనున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.