Wage employment
-
ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి కూలీలకు నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ కడుపుకొడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ కూలీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర రాకపోవడం, కొనేవారు లేకపోవడంతో మిర్చి పంటను రైతులు కాల్చివేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం బాధాకరమని విమర్శించారు. -
హిల్.. కిల్
{పాణాలు తీస్తున్న కొండలు పాలకులు, ల్యాండ్ మాఫియాతో అనర్ధాలు కొండవాలు ప్రాంతాల్లో 25 వేల కుటుంబాలు విశాఖపట్నం : విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా. ప్రమాదమని తెలిసినా తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. హూద్హూద్ తుఫాను సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు. ల్యాండ్ మాఫియా నిర్వాకం ల్యాండ్ మాఫియా రంగంలోకి దిగి కొండలను ఆక్రమిస్తోంది. ప్రజాప్రతినిధుల అండతో కొందరు గ్రూపులుగా ఏర్పడి కొండ ప్రాంతాలలో హద్దులు నిర్ణయిస్తున్నారు. 30 నుంచి వంద గజాల స్థలాలు చదును చేసి బహిరంగంగా అమ్మేస్తున్నారు. ముందుగా అక్కడి చెట్లకు నిప్పు పెట్టి స్థలాలను చదును చేస్తున్నారు. తర్వాత చిన్నపాక వేసి దానిని రేకుల షెడ్డుగా, భవనంగా మారుస్తున్నారు. అనంతరం ఇళ్లు లేని వారికి వాటిని విక్రయిస్తున్నారు. ప్రమాదంలో జీవనం విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు కోసం చాలా మంది వలస వస్తుంటారు. కొమ్మాది, ఆరిలోవ, మధురవాడ, తాడిచెట్లపాలెం, మాధవధార, సీతమ్మధార, వెంకోజిపాలెం, హనుమంతవాక, కప్పరాడ, మురళీనగర్, సింహిద్రిపురం, వరాహగిరి కాలనీ, గాజువాక, మల్కాపురం, కస్తూరినగర్, రాంజీఎస్టేట్, సంజీవయ్యాకాలనీ, తిక్కవానిపాలెంకాలనీ, బాపూజీనగర్, శివలింగపురం, అరుంధతినగర్, అంబేద్కర్ ఎస్టేట్, జైభారత్నగర్, బర్మానగర్, శ్రీనివాసనగర్, మధుసూధన నగర్, సురేష్రాంనగర్, సూరిబాబునగర్, శాంతినగర్ కొండలపై ఇలా వేలాది నివాసాలు వెలిశాయి. కనీస వసతులు కరువు కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు. -
ఉపాధి కూలీ రూ. 20
దొరవారిసత్రం: సాధారణంగా రూ. 130 నుంచి 160 వరకూ చెల్లించాల్సిన ఉపాధికూలీ కేవలం రూ. 20 మాత్రమే చెల్లిస్తుండటంతో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండల పరిషత్తు కార్యాలయం వద్ద దర్శనమిచ్చింది. మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది కార్మికులు పరిషత్తు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పూర్తిగా కూలీ చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు. -
‘ఉపాధి’కీ తప్పని కాక
సాక్షి, రాజమండ్రి : అటు మండుతున్న ఎండలు, ఇటు కొత్త సర్కారు యోచన.. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కుంటుపడ్డాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పని దినాలు భారీగా తగ్గాయి. ఈ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగిస్తుందన్న వార్తలతో వారిలో నెలకొన్న అభద్రత కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రరూపంలో కొనసాగుతున్న వాతావరణమే ఈ పథకం పనులు తగ్గడానికి కారణమని అధికారులు అంటున్నారు. జూన్ ఒకటి నుంచి ఏడవ తేదీతో ముగిసిన మొదటి వారంలో జిల్లాలోని 58 మండలాల్లో 1.90 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. అంతకు ముందు మే 25 నుంచి 31 తో ముగిసిన వారంలో 1.81 లక్షల మంది పనులకు హాజరయ్యారు. కానీ జూన్ ఎనిమిది నుంచి 14తో ముగిసిన రెండో వారంలో కేవలం 75,766 మందికి మాత్రమే పనులు కల్పించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంతో పోలిస్తే లక్ష మందికి పైగానే కూలీలకు ఉపాధి పనులకు దూరంగా ఉన్నారు. పలు మండలాల్లో తగ్గిన హాజరు జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. ఈనెల మొదటి వారం కపిలేశ్వరపురం మండలంలో 3,800 మంది ఉపాధి పనులకు హాజరవగా రెండో వారంలో కేవలం 81 మంది మాత్రమే హాజరయ్యారు. శంఖవరం మండలంలో మొదటి వారంలో 1,250 మంది ఉపాధి పనులు చేయగా రెండో వారంలో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగిలో జూన్ తొలి వారంలో సుమారు 6,500 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో 1,008 మంది మాత్రమే పనులు చేశారని లెక్కలు చెబుతున్నాయి. కొత్తపేట మండలంలో తొలి వారంలో 6,150 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో పనులకు హాజరైన వారి సంఖ్య 1,650 మాత్రమే. జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్న మొత్తం 1,012 గ్రామ పంచాయతీల్లో 515 పంచాయతీల్లో రూపాయి కూడా చెల్లింపులు జరగలేదు. మొత్తం 2,450 జనావాసాలకు 1,725 జనావాసాల్లో పనులు జరగలేదు. ఈ నెల ఆరంభం నుంచి ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. మే నెలలో సైతం కాయని ఎండలు జూన్ రెండో వారంలో కాశాయి. ఈ వారంలో గరిష్టంగా 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పనులకు హాజరయ్యేందుకు కూలీలు భయపడ్డారని అధికారులంటున్నారు. మరో వంక తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఫీల్డు అసిస్టెంట్లలో నిస్పృహ, కలవరం నెలకొని, ఆ ప్రభావం కొంతమేరకు పనులపై పడింది.