walk the talk
-
బాబుగారూ.. బడాయితనం
► హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ ► నా జీవితం ప్రజల కోసం త్యాగం చేశా ► అప్పుడు నేను సంపదను సృష్టించింది నేనే ► ఎన్నికల్లో చేసిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నా ► తెలంగాణలో నా జనం ఉంటారు.. కానీ నేనక్కడికి వెళ్లలేను ► టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు ► ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చిద్విలాసంగా చెప్పుకున్న గొప్పలివి! నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్‌హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన మాటలు.. చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్, ట్విటర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఆయన వ్యాఖ్యలను జోక్‌లుగా అభివర్ణిస్తూ సెటైర్లు వినవస్తున్నాయి. ఇంటర్వ్యూలో శేఖర్‌గుప్తా అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తూ చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... సాక్షి, హైదరాబాద్ : ‘‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాను. హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్‌లకు నేను సైబరాబాద్‌ను చేర్చాను. నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్‌ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా. ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం. దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ మైనస్‌లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను. నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం. నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 44 లక్షల పెన్షన్లు ఇస్తున్నా. ఇంటికి పంపిస్తున్నా. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్‌లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’ -
ఇక వారం వారం ‘జాతిహితం’
దేశంలోని అత్యుత్తమ శ్రేణి పాత్రికేయుల్లో ఒకరిగా లబ్ధప్రతిష్టుడైన శేఖర్‌గుప్తా ఇకపై ప్రతి శనివారం వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై ‘సాక్షి’ పాఠకులతో తన ఆలోచనలనూ, అభిప్రాయాలనూ పంచుకుంటారు. శేఖర్‌గుప్తా పందొమ్మిదేళ్లపాటు జాతీయ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించి, ప్రస్తుతం ‘ఇండియా టుడే’ గ్రూప్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి వారం ఎన్డీటీవీలో ‘వాక్ ది టాక్’ పేరిట విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత శేఖర్‌గుప్తా కాలమ్ ‘జాతిహితం’ -
రాస్తే పే రాణిగిరి
ఆమె అడుగు బయటపెడితే.. మగదొరలు అడ్డు తొలగి దారి వదలాలి. ఈవ్ టీజర్లు అదృశ్యం కావాలి. చేయి ఎత్తితే ఆర్టీసీ బస్సు ఆగాలి. ఆటోవాలాలు వంకర మాటలు మానాలి. కాలిబాట ఆమెకు రాచబాటవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రహదారిపై ఆమె ‘రాణి’గిరి చేయాలి. ఇలా జరగాలంటే.. మహిళ కోసం ఒక రోజు కాదు ప్రతి రోజూ ప్రత్యేకించాల్సిందే. ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాల్సిందే. ఇదే సందేశాన్ని మోసుకొస్తోంది ఈ వారం రాహ్‌గిరి. ఎస్.సత్యబాబు ‘రణగొణ ధ్వనుల నిలయమో, కాలుష్యపు విష వలయమో’ మాత్రమే కాదు రహదారి అంటే చక్కని విందు వినోదాల సందడికి వేదిక కూడా అని నిరూపిస్తోంది రాహ్‌గిరి. వినూత్న తరహాలో మొదలైన రాహ్‌గిరి వారాంతపు ‘వీధుల్ని’ సరికొత్తగా అలంకరిస్తున్న సంగతి తెల్సిందే. సైబరాబాద్‌లో ఒక సంప్రదాయంలా స్థిరపడుతున్న రాహ్‌గిరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆడతనాన్ని’ సింగారించుకుని మరింత కొత్తగా జరగనుంది. ఆకర్షణలెన్నో.. ‘స్ట్రాంగ్ విమెన్-స్ట్రాంగ్ నేషన్’ పేరుతో టీఏఎఫ్ సైకిల్ రైడ్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్/ షి టీమ్స్ ఆధ్వర్యంలో ‘వాక్ ది టాక్’, మాస్టర్ చెఫ్ పునీత్ మెహతాతో ‘క్యాచ్ హిమ్ లైవ్’, మాన్సి, సిద్ధిల ఆధ్వర్యంలో పాట్ డెకరేషన్, లివ్ లైఫ్ ఫౌండేషన్ సారథ్యంలో ‘నుక్కడ్ నాటక్’, సుహానీ నిర్వహణలో క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్.. వంటి కార్యక్రమాలు హైలెట్స్‌గా నిలవనున్నాయి. అంతేకాకుండా చెరిషింగ్ విమెన్హుడ్ మరో ప్రత్యేక ఆకర్షణ. మదర్‌హుడ్ ఇండియా హాస్పిటల్ ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా విమెన్ సేఫ్టీ పెయింటింగ్ ఎక్స్పో నిర్వహిస్తోంది. దీనిలోనే లైవ్ పెయింటింగ్ కూడా ఉండడం విశేషం. వీటితో పాటు ప్రతి వారంలాగే గల్లీ ఫుట్‌బాల్, యోగా-జుంబా సెషన్స్, ఫ్యాషన్ రీల్స్ ఫొటోగ్రఫీ వర్క్‌షాప్, అసెండాస్ అందించే కైట్ ఫ్లైయింగ్, డి-కెమ్లెన్ స్కేటింగ్ వర్క్‌షాప్‌లు యధావిధిగా ఉంటాయి. సకుటుంబ సపరివార సమేతం.. రహదారులు మహిళకు రాచబాటలు కావాలని, రక్షణ కవచాలవ్వాలని కోరుకునే వారెవరైనా ఆదివారం జరిగే ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మహిళల భద్రత అనేది స్లోగన్‌లా మిగలకూడదని ప్రతి ఒక్కరికీ కమిట్మెంట్ కావాలనే సందేశంతో దీనిని నిర్వహిస్తున్నామంటున్నారు. మహిళాదినోత్సవం నేపథ్యంలో ఈ రాహ్‌గిరి మహిళలకు ప్రత్యేకమైనా.. కుటుంబ సమేతంగా కూడా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. వేదిక.. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్క్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ దాకా ఈ రాహ్‌గిరి నిర్వహిస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నాస్కామ్, హైసీ, టై, టీఎస్ఐఐసీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎంబార్క్ ఇండియాల సంయుక్త నిర్వహణలో ఇది జరుగనుంది. వంటింటికి పరిమితం కాకుండా ప్రపంచాన్నే తన ఇంటిగా మార్చుకునే దిశగా వనితల ప్రయాణానికి అడ్డంకులు తొలగిద్దాం. ఆమె గెలుపు అందరి గెలుపనే జ్ఞాన దీపాల్ని నలుదిశలా వెలిగిద్దాం. భద్రత ప్రధాన హక్కు.. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో విభిన్న రకాలుగా భాగస్వాములవుతున్నారు. ఇలాంటి సమయంలో అన్నింటికన్నా మహిళల భధ్రత అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. భద్రత తమ హక్కు అని నినదిస్తున్న భారతీయ మహిళ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలి. రాహ్‌గిరి ఈ విషయంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించనుంది. - విశాలరెడ్డి, నిర్వాహక సంస్థ ప్రతినిధి