Water issues
-
అధికారం 'టీడీపీ'దే నని పచ్చ పత్రికల్లో రాతలు : ఎమ్మెల్యే అనంత
అనంతపురం: జిల్లాకు కృష్ణా జలాల రాక ఆలస్యం కావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. హంద్రీ–నీవా గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1985లో హంద్రీ–నీవాకు ఓడీసీ వద్ద ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే.. 1995లో చంద్రబాబు ఉరవకొండలో 40 టీఎంసీలుగా శంకుస్థాపన చేసి నాలుగేళ్లు ఏమీ చేయకుండా 1999లో దాన్ని 5 టీఎంసీలకు కుదించారని, అప్పట్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఫౌండేషన్ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర బాబుదని ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హంద్రీ–నీవా పనులు వేగవంతం చేశారన్నారు. అప్పట్లో తాను ఎంపీగా ఉన్నానని, 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి నీరు తీసుకువచ్చామన్నారు. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయని, అది మహానేత వైఎస్సార్ చలవేనన్నారు. హంద్రీ–నీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6వేలకు పెంచుతామని చెప్పి కనీసం గంపెడు మట్టి తీయని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ పాలనలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరువు విలయతాండవం ఆడడంతో వలసలు పెరిగాయన్నారు. రెయిన్గన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారన్నారు. 2019లో ఉమ్మడి అనంతపురంలో రెండు సీట్లు టీడీపీకి వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వస్తుందని పచ్చ పత్రికల్లో రాతలు రాసుకుని భ్రమల్లో బతుకుతున్నారన్నారు. ఇవి చదవండి: విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి: సుప్రీంకోర్టు -
తప్పుకోమనడానికి కారణాలేంటి: హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తనను తప్పుకోవాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించడంపై జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా విచారణ నుంచి తప్పుకోవాలనడం ఫోరం హంటింగ్ (అనుకూలమైన న్యాయమూర్తులు) చేయడమేనని మండిపడింది. ఇటువంటి పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను అక్కడికి పంపాలని ఏజీ కోరారు. అయితే ఈ పిటిషన్‌ను తామే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఇప్పుడే తమకు సమాచారం ఇచ్చారని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు తెలిపారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించిన తీరుపై తమకు అభ్యంతరం ఉందని, ఈ నేపథ్యంలో విచారణ నుంచి మీకు మీరుగా తప్పుకోవాలని ప్రసాద్ మళ్లీ కోరారు. ‘విచారణ నుంచి ఎందుకు తప్పుకోవాలి. ఏజీస్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి అసమంజసమైన అభ్యర్థన రావడం సరికాదు. సహేతుకమైన కారణాలు లేకుండా ఇటువంటి అభ్యర్థన చేయడం ధర్మాసనంపై దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో కోరారు. కనీసం నేను కేసుకు సంబంధించిన పేపర్లను కూడా చూడలేదు, మా ముందు ఉంచనూ లేదు. భోజనం విరామం తర్వాత విచారణ చేస్తామని స్పష్టం చేశాం. తర్వాత ఈ కేసుకు సంబంధించిన పేపర్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు రిజిస్ట్రీ అధికారులు ఉంచారు. మా ధర్మాసనాన్ని విచారించాలని సీజే సూచించారు. తమకు అనుకూలమైన ధర్మాసనం కోసం తెలంగాణ ప్రభుత్వం (ఫోరం హంటింగ్) ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏజీ కార్యాలయం ఇటువంటి ట్యాక్టిక్స్ కోసం పాకులాడదని భావిస్తున్నాం. నన్ను తప్పుకోవాలనేందుకు సరైన కారణాలు చూపనందున ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. పిటిషన్‌ను విచారిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఏజీ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ.. జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోర్టు ప్రారంభ సమయంలో అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఈ తరహా పిటిషన్లను విచారించాల్సి ఉందని, ఈ ధర్మాసనం విచారించడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు ప్రతివాదులుగా ఉన్న పిటిషన్లను విచారించే పరిధి ఈ ధర్మాసనానికి మాత్రమే ఉందని వెంకటరమణ నివేదించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారిస్తామని, అభ్యంతరాలుంటే అప్పుడు తెలియజేయాలని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు స్పష్టం చేశారు. దీంతో వెంటనే జె.రామచందర్‌రావు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుల విచారణ రోస్టర్‌కు విరుద్ధంగా జస్టిస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ఓ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారించేందుకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుత కేసుల విచారణ రోస్టర్ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఆ పిటిషన్‌ను విచారించాలని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని జస్టిస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు చెప్పాలని సీజే స్పష్టం చేస్తూ ఏఏజీ అభ్యర్థనను తోసిపుచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఈ పిటిషన్ ఎలా విచారణార్హం? అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు జలవివాదాలపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి వీల్లేదని రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగం ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ఎలా విచారణార్హమని హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 100 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు శివరామకృష్ణ ప్రసాద్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం భోజన విరామం తర్వాత అత్యవసరంగా విచారించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 11 కింద ఈ పిటిషన్ ఎలా విచారణార్హం అని ధర్మాసనం వెంకటరమణను ప్రశ్నించింది. ఇటువంటి వివాదాల్లో ట్రిబ్యునల్స్ మినహా హైకోర్టు, సుప్రీంకోర్టులు పిటిషన్లను విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచందర్‌రావు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా.. ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వాదన లు వినిపిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇవ్వాల ని ధర్మాసనం ఏఏజీకి సూచించింది. ‘రాజోలిబండ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి రావాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది, ఇరు రాష్ట్రాల ఏజీలకు సూచిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
సామరస్యపూర్వక ధోరణితో ముందుకెళ్లాలి
-
మా వైఖరి సరైనదే
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ సమంజసమైనది, సరైనదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్–కేసీఆర్ మధ్య ప్రధానంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి. గోదావరి నదిలో ప్రస్తుతం వెల్లువెత్తిన వరద నీటి అంశం ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గోదావరిలో పోటెత్తుతున్న వరద గురించి గతంలో జరిగిన చర్చల సందర్భంగా అనుకున్నదే ఇప్పుడు నిజమని తేలుతోందని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సామరస్యపూర్వక ధోరణితో ముందుకెళ్లాలి తెలంగాణలో కొత్తగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు పుష్కలంగా వచ్చిన విషయం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కృష్ణా, గోదావరి నదుల విషయంలో సామరస్యపూర్వక ధోరణితో ముందుకు వెళితే తప్ప ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించుకోలేమని జగన్, కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ రాష్ట్రాలు తమ సమస్యలపై ఎప్పటి నుంచో సామరస్య ధోరణితో ముందుకు వెళ్లి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని జగన్ చెప్పారు. విభజనానంతర సమస్యలపై ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు, తర్వాత చేపట్టాల్సిన చర్యలపై వైఎస్ జగన్, కేసీఆర్ మాట్లాడుకున్నారు. వాటిపై ఇదే విధంగా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. జగన్మోహన్రెడ్డి ప్రగతి భవనకు చేరుకున్నప్పుడు కేసీఆర్ ఎదురేగి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. భేటీ ముగిసిన అనంతరం జగన్ విదేశీ పర్యటన విజయవంతం కావాలని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో వైఎస్ జగన్ భేటీ నిన్న మొన్నటి దాకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించి, ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా సేవలందిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. -
మళ్లీ అదే గొడవ..?
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎడమ కాల్వల కింద నీటి వినియోగంపై మళ్లీ రచ్చ మొదలైంది. ఎడమ కాల్వ కింద కృష్ణా బోర్డు చేసిన కేటాయింపులకు, జరిగిన వినియోగానికి మధ్య పొంతన లేకపోవడంతో వివాదం ముదురుతోంది. ఎడమ కాల్వ కింద తమకు 12 టీఎంసీల మేర కేటాయింపులు చేసినా, ఇంతవరకు 6.61 టీఎంసీల నీరే వినియోగం జరిగిందని, మిగతా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఏపీ బోర్డును ఆశ్రయించడం ప్రస్తుత వివాదానికి ఆజ్యం పోస్తోంది. సాగర్ ఎడమ కాల్వ కింద గుంటూరు జిల్లాలోని ఆయకట్టుకు నీరందించేందుకు ఏపీ శ్రీశైలం నుంచి 15.61 టీఎంసీలు విడుదల చేయగా, సాగర్ నుంచి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అయితే గడిచిన మూడు నెలల్లో తమకు కేటాయించిన 12 టీఎంసీల నీటిలో 6.61 టీఎంసీలు మాత్రమే వచ్చాయని చెబుతోంది. మిగతా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని బోర్డుకు మంగళవారం లేఖ రాసింది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినా ఇంతవరకు తేలలేదు. ప్రస్తుతం సాగర్‌లో 529 అడుగుల్లో మాత్రమే నీరు ఉంది. ఇప్పటికిప్పుడు సాగర్ నుంచి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలో ఏపీకి నీళ్లు అందుతాయన్న ఆశలు లేవు. ఈ నేప థ్యంలో మళ్లీ శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయడం అత్యావశ్యకంగా మారుతోంది. ఈ సమయంలో సాగర్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదల జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయం లో సాగర్ నుంచి ఏపీ అవసరాల నిమిత్తం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలంటూ బుధవారం పదవీ విరమణకు కొన్ని గంటల ముందు బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాయడం గమనార్హం. 10.8 టీఎంసీ తక్కువ చూపారన్న తెలంగాణ ఇక పోతిరెడ్డిపాడు వినియోగం కింద ఏపీ తన వాస్తవ వినియోగం కన్నా తక్కువ చూపిందంటూ తెలంగాణ బుధవారం బోర్డుకు లేఖ రాసింది. పీఆర్పీ కింద ఏపీ వాస్తవ వినియోగం 102.57 టీఎంసీలు ఉండగా 91.77 టీఎంసీలు మాత్రమే చూపిందని, 10.80 టీఎంసీలు తక్కువ చూపిందంటూ ఫిర్యాదు చేసింది. -
గో‘దారి’ మళ్లితే.. గొడవే
సందర్భం రాష్ట్రాల అభ్యర్థనలను లెక్కించకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తెలంగాణ ఉద్యమం బలంగా పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటా నికి నీళ్లే కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృ త్తులు, చేతి వృత్తులు, సబ్బండ జాతులు అంతా కలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవు తుంది. ఈ వ్యవస్థకు మూలం వ్యవసాయం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో యేటా 25 వేల కోట్ల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగా ణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తు న్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటా లో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లుంది కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలం గాణలోనే ఉంది. అంటే ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణానది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలం గాణకు రావాలే. కానీ అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగు పోయాయి, కనీసం ఉన్న గోదా వరి జలాలనైనా పోతం చేసుకుందామంటే కేంద్రం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగా ణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలసి 890 టీఎం సీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం లెక్కలు చెప్తోంది. మహానదిని గోదావరితో కలసి, గోదా వరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరి హద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా.. నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం కలిపి 684 టీఎంసీల జలాలే వాడు కుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్‌రావు బతికి ఉన్నంతకాలం నెత్తి నోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళే శ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ము గూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుంటున్నాయి. పాత ప్రాజెక్టులు ఉండనే ఉన్నాయి. ఏ నది జలాలైనా ప్రస్తుత, కనీస భవిష్యత్తు పరీవాహక ప్రాంత అవస రాలను తీర్చాలి. అంటే మరో 30 ఏళ్ల నాటికి పెరగ నున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్థారించి లెక్కగట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ కేంద్రం మాత్రం 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరిపోలుతాయి? భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడుతాయి. మరో వైపు మహానదిలో అసలు మిగులు జలాలే లేవు అని ఒడిశా ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకో కుండా మొండిగా నదులను అనుసంధానం చే సి తెలం గాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజా నీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. నదుల అనుసంధానం అనేది ఇప్పటి ముచ్చటేం కాదు. 1960లో 4,200 కిలోమీటర్ల పొడవైన హిమా లయ ప్రాంత కాల్వలను, 9,300 కిలోమీటర్ల పొడవైన దక్షిణ ప్రాంత కాల్వలను ఢిల్లీ–పట్నాల వద్ద కలపాలని కెప్టెన్ దస్తూన్ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తరువాత 1972లో అప్పటి కేంద్ర మంత్రి, ఇంజనీరు కేఎల్‌రావు కావేరి–గంగా నదుల ప్రతిపాదన చేశారు. సోన్, నర్మద, పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదుల మీదుగా కావేరి నదితో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదని అప్పట్లోనే కేంద్రం తేల్చి చెప్పింది. నాటినుంచి నదుల అనుసంధాన ప్రతిపాదనపై చర్చ జరుగుతూనే ఉంది. అనుకూల వర్గం కంటే వ్యతిరేక వర్గమే ఎక్కువగా ఉండ టంతో ప్రభుత్వాలు ఈ ప్రక్రియను పక్కన పెట్టాయి. పశ్చిమ కనుమల్లో వర్ష ప్రభావం ఎక్కువ. అక్కడ స్థిరమైన వర్షపాతం ఉంది. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసె క్కుల జలరాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చిమంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలుస్తున్నాయి. కేంద్రం ముందుగా ఈ జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసిపట్టుకుని, తూర్పు దిశగా తీసుకు వచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదావరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులేమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిం టినీ అనుసంధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అను సంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సమాయత్తం అవుతారు. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు మొబైల్ : 94403 80141 -
తొలి హామీనే మరిచిపోయిన లోకేష్
-
తాగునీటికి రూ.5 కోట్లు అవసరం
ఆమనగల్లు: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావ్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయవచ్చని ఆయన చెప్పారు. ఆమనగల్లు మండలం రాంనుంతల, ఆమనగల్లులో ఉన్న నర్సరీలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాంనుంతలలోని అయ్యసాగరం నర్సరీలో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి నీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లతో ప్రతిపాదనలు పంపించామని.. రెండుమూడు రోజుల్లో నిధులు మంజూరు కావచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో నూతనంగా బోర్ల డ్రిల్లింగ్ చేపట్టకుండా అవసరమైన బోర్లను లీజుకు తీసుకుని నీటిని సరఫరా చేస్తామని ఆయన వివరించారు. గతంలో బోర్ల లీజు, నీటి ట్యాంకర్ల సరఫరాకు సంబంధించిన బకాయిలు రూ.9 కోట్లు ఉన్నాయని వాటిని ఈ నెలాఖరు లోగా చెల్లిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో 51 అటవీశాఖ, 16 ఎన్ఆర్ఈజీఎస్ వననర్సరీలు ఉన్నాయని ఈ నర్సరీలలో 2.37 కోట్ల మొక్కలను హరితహారం కోసం పెంచుతున్నామని కలెక్టర్ వివరించారు. వీటితో పాటు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పదిలక్షల మొక్కలు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలను నాటుతామని ఆయన తెలిపారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో రూ.5.36కోట్ల బకాయిలు కూలీలకు చెల్లించాల్సి ఉందని.. వీలైనంత త్వరలో బకాయిలు చెల్లిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో 34వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని.. మరికొన్ని రోజుల్లో 50వేల మంది కూలీలు పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వినోద్‌కుమార్, ఎఫ్డీఓ జానకిరాం, ఆమనగల్లు మండల ప్రత్యేకాధికారి, జేడీఏ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కందుకూరు ఆర్డీఓ నర్సింహారెడ్డి, తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ వెంకట్రాములు, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ కమాలుద్దీన్ తదితరులున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై అసంతృప్తి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీరుపై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అయ్యసాగరం నర్సరీ, చంద్రాయణపల్లితండా నర్సరీలలో మొక్కలు ఎండిపోవడం పట్ల కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. నీటి ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికి పెద్ద మొత్తంలో మొక్కలు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు. దీనికితోడు రికార్డుల నమోదు కూడా సరిగా లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చిమ్నీబాయి నీళ్లు ముట్టింది...!
సాక్షి, సంగారెడ్డి: నారాయణఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఓ మహిళా ఓటరుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాను సందర్శించారు. ప్రచారంలో భాగంగా తండాకు వచ్చిన హరీశ్‌కు ఆమె మంచినీరు, విద్యుత్తు సమస్యలను ఏకరువు పెట్టింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తమ తండావాసులకు పిల్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలు తీరిస్తే కోడికూర.. జొన్నరొట్టె పెడతానని చమత్కరించింది. తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 120 కుటుంబాలు ఉన్న సర్దార్ తండాకు తొమ్మిది నెలల వ్యవధిలో త్రీ ఫేజ్ విద్యుత్తు, రూ.10 లక్షలతో పైప్‌లైన్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన చిమ్నీబాయి మంత్రిని కలసి తండాకు రావాలని కోరింది. మంత్రి ప్రారంభిస్తే తప్ప ‘మంచినీటిని తాగం.. కరెంటును వాడబోమని చెప్పింది’. చిమ్నీబాయి కోరిక మేరకు మంత్రి హరీశ్ గురువారం కంగ్టి మండలం సర్దార్ తండాకు వెళ్లి.. మంచినీటి కుళాయిని ప్రారంభించారు. చిమ్నీబాయి ఇంటికి వెళ్లి తండాలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మం జూరు చేసిన ప్రతిని ఆమెకు అందజేశారు. తండాలోని ఇతర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. ‘తండాలో కాళుబాబా ఉత్సవాలు జరుగుతున్నందున మంత్రికి కోడికూర, జొన్నరొట్టె పెట్టలేక పోతున్నా.. మరోమారు రావాలి’ అని మంత్రి హరీశ్‌రావును కోరింది. కాగా, కంగ్టి మండలం బోర్గీ పంచాయతీ పరిధిలోని సర్దార్ తం డాలో నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాధ్యదైవం జ్వాలాముఖి కాళుబాబా విగ్రహప్రతిష్ఠాపనకు మంత్రి హాజరయ్యారు. -
అపెక్స్ భేటీకి సిద్ధం కండి!
రాష్ట్రానికి కేంద్ర జల వనరుల శాఖ సమాచారం * పాలమూరు, డిండి డీపీఆర్‌లపై బోర్డు నోటీసులు * పట్టిసీమ డీపీఆర్, ఆర్డీఎస్ కుడి కాలువలపై ఏపీకి నోటీసులు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెలలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించే అవకాశాలున్నాయంటూ కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే తాము కోరిన సమాచారంపై సన్నద్ధతతో ఉండాలని సూచించింది. ఇక కేంద్ర జల వనరుల శాఖ ఉత్తర్వుల మేరకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పట్టిసీమ డీపీఆర్‌ను అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్తగా తెలంగాణ చేపడుతున్న పాలమూరు, డిండిలతో పాటు ఏపీ చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టులపై వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా... అపెక్స్ కౌన్సిల్ భేటీలో పరిష్కరించుకోవాలని, ఆ భేటీకి కేంద్రం చొరవ చూపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అపెక్స్ భేటీ నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాతవేనని రుజువు చేసే జీవోలను తెరపైకి తె చ్చిన తెలంగాణ... 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు దక్కే వాటాల అంశాన్ని ప్రస్తావిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమైతే.. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 45 టీఎంసీలు తమకు వాటాగా దక్కుతాయని అంటోంది. ఇక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై కాకముందే ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువకు 4 టీఎంసీలు మళ్లించేందుకు ఏపీ సిద్ధమవుతోందని, ఇది ధిక్కారమేననీ అంటోంది. ఈ అన్ని అంశాలపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే తుది పరిష్కారం దక్కే అవకాశం ఉంది. -
రెండు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన
కడప, అనంతపురం: కేంద్ర కరువు బృందాలు బుధవారం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించాయి. వైఎస్సార్ జిల్లాలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ డెరైక్టర్ వందనా సింగాల్, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖకు చెందిన వాటర్ క్వాలిటీ స్పెషలిస్టు డాక్టర్ బ్రజేష్ శ్రీ వాత్సవ, నీతి అయోగ్ సీనియర్ రీసెర్చి ఆఫీసర్ డాక్టర్ రామానంద్‌లతో కూడిన బృందం పర్యటించింది. జిల్లాల్లో ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి, పంటల సాగు, నీటి సమస్యల గురించి కలెక్టర్ కేవీ.రమణ కరువు బృందానికి వివరించారు. కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం జిల్లాకు తక్షణ సాయంగా రూ. 1,404.55 కోట్లు అవసరమని కలెక్టర్ కోనశశిధర్ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. -
ఢిల్లీ వాసులకు రెండు రోజుల నీటి కష్టాలు
న్యూఢిల్లీ: బవానాలో గల్లైంతైన ఇద్దరు బాలుల అన్వేషణ కోసం మునాక్ కెనాల్లో నీటి సరఫరాను నిలిపివేయడంతో ఢిల్లీ వాసులకు గురు, శుక్రవారం నీటి సమస్యలు తలెత్తనున్నాయి. బవానాలో ఇద్దరు బాలులు మంగళవారం నుంచి కనిపించడం లేదు. వారు మునాక్ కెనాల్లో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తుండడంతో వారిని గాలించడం కోసం బవానా ప్లాంటుకు నీటిని వదలరాదని ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని అంగీకరించారు. దీని వల్ల ఢిల్లీ వాసులకు నీటి సమస్య ఎదురైనప్పటికీ బిడ్డలను కోల్పోయిన రెండు కుటుంబాల దుఃఖాన్ని దష్టిలోకి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. -
మా నీటి కటకటల మాటేమిటి?
సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: జలవివాదాలను తిరగ దోడాలని, సాగునీటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎదురవుతున్న చిక్కులు, పాత వివాదాలపై తమవైఖరిని కేంద్రం వద్ద ఏకరువు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఉన్నతాధికారుల బృందంతో సాగునీటిశాఖమంత్రి హరీశ్‌రావు సోమవారం ఢిల్లీ వెడుతున్నారు. కేంద్రమంత్రి ఉమాభారతితోపాటు కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్ల ైచైర్మన్లు, కేంద్రజలసంఘం ఉన్నతాధికారులతోనూ భేటీ కానున్నారు. కృష్ణా నీటివిడుదల, లోయర్ సీలేరు తదితర అంశాలపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణి పై కూడా మంత్రి ఢిల్లీకి ఫిర్యాదు చేయనున్నారు. మళ్లీ పంచాల్సిందే : కృష్ణాబేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల నడుమ నీటికేటాయింపులను మరింత శాస్త్రీయంగా, అవసరాల ప్రాతిపదికన పునస్సమీక్షించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు, కల్వకుర్తి, కొడంగల్, జూరాల-పాకాల, పాలమూరు వంటి ఎనిమిది కొత్త ప్రాజెక్టుల అవసరాలను తీర్చాలని కోరనుంది. కొన్ని అక్రమ ప్రాజెక్టులు ట్రిబ్యునల్ దృష్టికి రాలేదనీ, ప్రస్తుతం వాటిపైనా విచారణ జరిగేందుకు కేంద్రజలసంఘం వద్ద ఒక పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ చైర్మన్‌ను కలసి ఒక నివేదికనూ సమర్పించనుంది. సీమాంధ్రతో పోలిస్తే...తెలంగాణలోనే కృష్ణా పరీవాహక ప్రాంతం 52,229 చదరపు కిలో మీటర్ల (68.50 శాతం) ఉందని, కేటాయింపులు మాత్రం 36.86 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పనుంది. ఇప్పటికే కేటాయించిన 299 టీఎంసీలతో పాటు మరో 441 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరనున్నారు. ప్రాజెక్టుల్లో నీటినిల్వలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కు ఏకపక్షంగా తాగునీటి పేరిట విడుదల కొనసాగించారనీ, అలాగే పోలవరం బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన లోయర్ సీలేరు జలవిద్యుదుత్పత్తి లెక్కలు ఇవ్వకుండా సతాయిస్తున్నారనీ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైఖరి తమకు ఇబ్బందిగా మారిందనీ, తమ ప్రభుత్వ ఆలోచనలను తప్పుబడుతూ, ఏపీ ప్రభుత్వ డిమాండ్లపై వేంగంగా స్పందిస్తున్న కేంద్రం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాపై మాత్రం మాట్లాడటం లేదని ఆరోపించనుంది. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించాలని మంత్రి హరీశ్ కోరనున్నారు. కాగా, అంతర్రాష్ట్ర జలవివాదాల్ని పరిష్కరించుకుందామంటూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాయాలని కూడా సర్కార్ నిర్ణయించింది. -
కింకర్తవ్యం..?
లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహం బీజేపీలో ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు కారణం విద్యుత్, నీటి సమస్యలే. ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తుండగా, బీజేపీకి ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటిదాకా శాసనసభ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందుకు ఎంతమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. సాక్షి, న్యూఢిల్లీ:విద్యుత్, నీటి సమస్యలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం రాజకీయ వాతావరణాన్ని మార్చివేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీవాసులు భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లు గమనించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికలు తమకు అనుకూలం కాదేమోననే అనుమానం వాటికి తలెత్తింది. దీంతో ఇన్నాళ్లుగా ఎన్నికలొక్కటే మార్గమన్న బీజేపీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ అనుకుంటోంది. ఢిల్లీలో అన్నిరకాల అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఢిల్లీ బీజే పీ ఇంచార్జి ప్రభాత్ ఝా ప్రకటించడం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని నితిన్ గడ్కరీ తెలిపినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలించడంతో రాజధానిలో శాసనసభ ఎన్నికలు జరిపించి పూర్తి మెజారిటీతో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావించింది. ఇలా అనుకుంటున్న తరుణంలోనే ఎండలు ముదిరాయి. విద్యుత్ కోతలు, నీటి సరఫరా సమస్యలు తీవ్రమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండడంతో ఈ సమస్యలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రోజుకో ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. తద్వారా నగరవాసుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. వేసవిలో గంటల తరబడి విద్యుత్ కోతలు, నీటి సరఫరా సమస్యల కారణంగా బీజేపీకి ఢిల్లీలో ఆదరణ తగ్గిందని ఆర్ఎస్ఎస్కు సమాచారం అందింది. రాజధానిలో విద్యుత్, నీటి సమస్యలు మరికొంత కాలం కొనసాగవచ్చని, ఈలోగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, వానలు పడితే నగర రోడ్లు నీటిమయమై కొత్త సమస్యలను సృష్టిస్తాయని, ఈ పరిస్థితుల్లోఎన్నికలు జరిపించినట్లయితే తమకు పూర్తి మెజారిటీ రాకపోవచ్చని, మరోసారి త్రిశంకు సభ ఏర్పాటు కావొచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా తమకు మెజారిటీ లేనందువల్ల ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్ నుంచి పలుసా ర్లు ప్రకటించిన ప్పటికీ బీజేపీ శాసనసభ్యుల్లో అనేకమంది మరోమారు ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎన్నికలు జరిపించాలన్న పార్టీ వైఖరిని వారు మొదటి నుంచీ లోలోపల వ్యతిరేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎమ్మెల్యేలు జగ్దీశ్ ముఖి, రామ్‌వీర్ బిధూడీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టేందుకు, పార్టీ వైఖరిని మా ర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నా లు ఫలించాయని, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సుముఖత వ్యక్తమవుతోందని వారంటున్నారు. దీంతో ఇంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక సాగిన ప్రయత్నాలు త్వరలోనే బహిరంగంగా సాగే అవకాశముంది. ఇందుకు సూచన రాజీవ్ ప్రతాప్ రూఢీ, ప్రభాత్ ఝా ప్రకటనలోనే కనిపించింది.