న్యూఢిల్లీ: బవానాలో గల్లైంతైన ఇద్దరు బాలుల అన్వేషణ కోసం మునాక్ కెనాల్‌లో నీటి సరఫరాను నిలిపివేయడంతో ఢిల్లీ వాసులకు గురు, శుక్రవారం నీటి సమస్యలు తలెత్తనున్నాయి. బవానాలో ఇద్దరు బాలులు మంగళవారం నుంచి కనిపించడం లేదు. వారు మునాక్ కెనాల్‌లో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తుండడంతో వారిని గాలించడం కోసం బవానా ప్లాంటుకు నీటిని వదలరాదని ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని అంగీకరించారు. దీని వల్ల ఢిల్లీ వాసులకు నీటి సమస్య ఎదురైనప్పటికీ బిడ్డలను కోల్పోయిన రెండు కుటుంబాల దుఃఖాన్ని దష్టిలోకి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.