water tax
-
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్‌మహల్‌కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్‌ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్‌మహల్‌కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
ఇదేం తీరు?
సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారుపై ఆర్థిక భారం దండిగానే ఉంటోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. నీటి వనరుల మరమ్మతు... ఆధునికీకరణవంటి పనులకు ఆసరాగా నిలుస్తుందని నిర్దేశించిన నీటితీరువా వసూలుపై అధికారులు నిర్లక్ష్యధోరణి చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 30కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేస్తే కాస్తయినా ప్రభుత్వానికి తోడ్పాటునందించినట్టే. సాక్షి, విజయనగరం గంటస్తంభం: నీటి తీరువా బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. కోట్లాది రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉన్నా... వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపడంలేదు. అంత మొత్తం ఒకేసారి వసూలు చేయకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా దశల వారీగానైనా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి తిరిగి నీటి వనరులు బాగు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మరచి అధికారులు వసూలుపై దృష్టిసారించపోవడం విశేషం. సాగునీటి వనరుల నుంచి నీటిని పంటలకు వినియోగించుకునేందుకు రైతులు ఏటా నీటి తీరువా(పన్ను) చెల్లించాల్సి ఉంది. శాశ్వత సాగునీటి వనరులైన ప్రాజెక్టుల కింద ఏడాదికి ఎకరాకు రూ.200లు, సాధారణ సాగునీటి వనరులైన చెరువులు, కాలువ కింద ఎకరాకు రూ.100లు పన్నుగా చెల్లించాలి. ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పన్ను వసూలు చేస్తుంటారు. పేరుకుపోయిన బాకాయిలు.. నీటి తీరువా వసూలుపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. పంటలు పండని ఏడాది మానేసి పండిన ఏడాది తప్పక వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో నాలుగు మండలాలు, రబీలో 25మండలాల్లో కరువు ఉండగా మిగతా మండలాల్లో పంటలు పండాయి. అంతకుముందు ఏడాది జిల్లాలో కాస్తా దిగుబడి తగ్గినా పంటలు మాత్రం బాగానే పండాయి. కానీ అధికారులు నీటితీరువా సకా లంలో వసూలుకు వెళ్లక బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.30.74 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అందులో రూ.28.10కోట్లు గతేడాది వరకు వసూలు కాని బకాయిలే. ఈ ఏడాది రూ.2.63కోట్లు టార్గెట్ ఇచ్చారు. పాత బకాయిలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఒకే ఏడాది వసూలు చేయాల్సి వస్తోంది. వసూలు అంతంతమాత్రమే.. రైతుల నుంచి అంత మొత్తం వసూలు చేయడం కష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో కేవలం రూ.10.81 లక్షలు మాత్రమే వసూలైంది. కోట్లాది రూపాయిలు బకాయిలుండగా వసూలు నామమాత్రంగా ఉండటం ఆలో చించదగ్గ విషయం. జిల్లాలో గతంలో కూడా పెద్దగా వసూలు చేసిన సందర్భం లేదు. నోట్లు రద్దు చేసిన సంవత్స రం మాత్రం జిల్లాలో రూ. 1.80కోట్లు వసూలు జరిగింది. ఆ తర్వాతగానీ, ముందుగానీ రూ.కోటి దాటి లేదు. గతేడాది ఆ మాత్రం కూడా వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతగా ప్రయత్నించినా మరో రూ.2కోట్లు వరకు వసూలవుతుందని అధికారుల అంచనా. వసూలుపై దృష్టిసారించని అధికారులు.. జిల్లాలో బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నా వసూలు విషయం మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వసూలు చేయాలంటే ముందుగా జమాబందీ జరిగి పన్ను నిర్ణయించాలి. తర్వాత వసూలుకు వీఆర్వోలు వెళ్లాలి. కానీ జమాబందీ ప్రక్రియ జిల్లాలో మొక్కుబడిగా జరుగుతోంది. ఇక వసూలు విషయమే అధికారులు మరిచిపోయా రు. గత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రంగా వసూలు చేసిన అధికారులు ఈ ఏడాది పూర్తిగా దృష్టిసారించలేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడిచినా రూ.30కోట్లు లక్ష్యంలో కేవలం రూ.10.81లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 0.4 శాతం మాత్రమే. నీటి తీరువా వసూలు ఇంత ఘోరంగా ఉన్నా ఒక్క అధికారీ దీనిపై పట్టించుకోవడం లేదు. వాస్తవానికి నీటి తీరువా ద్వారా వచ్చిన ని ధులను ప్రభుత్వం తిరిగి సాగునీటి వనరుల అభివృద్ధికి వెచ్చిస్తుంది. దీని వల్ల రైతులకే లబ్ధి కలుగుతుంది. కానీ అధికారులు వసూలు చేయకపోవడం వల్ల ఈ భారం ప్రభుత్వంపై పడి నీటి వనరుల అధునికీకరణ, మరమ్మతులకు నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఎన్నికల వల్ల ఆలస్యమైంది.. నీటి తీరువా వసూలు రెగ్యులర్‌గా జరుగుతుంది. ప్రతి ఏడాది వందశాతం రైతులు చెల్లించరు. అందువల్ల కొంత బకాయి ఉండడం సహజం. గతేడాది వరకు బకాయిలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవి. ఈ ఏడాది వసూలు తక్కువగానే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మొదట్లో ఆలస్యమైంది. తర్వాత వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు ఇతర పనులపై బీజీగా ఉన్నారు. నీటితీరువా వసూలుపై దృష్టిపెట్టాం. సమావేశం ఏర్పాటు చేసి డ్రైవ్ తీసుకునేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – బి.శ్రీకాంత్, సెక్షన్ పర్యవేక్షకులు, కలెక్టరేట్ -
రైతు నెత్తిన బకాయిల భారం
సాక్షి, పాలకొండ (శ్రీకాకుళం): కూలీల కొరత, పెరగిన పెట్టుబడులు, ప్రకృతి సహకరించక పోవడం, దిగుబడులు లేకపోవడం..అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లభించకపోవడం తదితర కారణాలతో రైతులు వ్యవసాయం చేయడం అంటేనే భయపడున్నారు. ఈ ఏడాది రైతులకు కష్టాలు మరింత రెంటిపు స్థాయిలో వెంటాడాయి. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రాక వలసలు పోతున్నారు. కాస్త పండిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించకపోవడంతో రైతులు దీన స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి నీటి తీరువా వసూలు కోసం రైతులపై వత్తిని నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి కోసం గత ఐదేళ్లుగా నీటితీరువాపై నామమాత్రంగా స్పందించిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం నీటితీరువా వసూలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రైతుల నుంచి పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకూ ఈ ఏడాది నీటితీరువా 447.12కోట్లు వరకూ ఉంది. ఈ మొత్తం రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు అధికారులు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నీటి తీరువా బకాయిలు ఉన్న రైతులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ నిలిపివేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పని ఉన్నా ముందుగా నీటితీరువా కట్టాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు అందించకుండా నీటితీరువా? నిబంధనల ప్రకారం సంవత్సరంలో కాలువల ద్వారా 150 రోజులు రైతులకు నీరు అందిస్తేనే నీటి తీరువా వసూలు చేయాలి. 150 రోజుల నీరు అందిస్తే కేటగిరీ ఏ కింద ఎకరానికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. 100 రోజులు పైబడి నీరు అందిస్తే కేటగిరి 2 కింద ఎకరానికి రూ.100 చొప్పున చెల్లించాలి. కాని పాలకొండ డివిజన్లో ఇంతవరకూ మేజర్, మైనర్ ఇరిగేషన్ల ద్వారా 90 రోజుల కూడా నీరు అందించలేదని రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నీరు అందించకుండా నీటితీరువా మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీవో ఏం చెబుతుంది? రైతుల నుంచి భూమి శిస్తు వసూలు విధానంపై 1996లో జీవో విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి భూమి శిస్తును రద్దు చేసి 11/88 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారం రైతులు వాడుకున్న నీటిని ఆధారంగా తీరువా వసూలు చేయాలని నిబంధన తీసుకువచ్చారు. దీని ప్రకారం 150 రోజులు నీరు అందించకపోతే తీరువా వసూలు చేయడానికి అవకాశం లేదు. ఈ నిబంధన ప్రకారం అయితే నీటితీరువా చెల్లించాల్సిన అవసరం లేదని రైతు సంఘాలు వాధిస్తున్నాయి. నియోజకవర్గంలో మండలాల వారిగా నీటి తీరువా బకాయిలు మండలం బకాయిలు పాలకొండ 148.86 కోట్లు వీరఘట్టం 289.06 కోట్లు సీతంపేట 001.16 లక్షలు భామిని 008.04 లక్షలు మొత్తం 447.12 కోట్లు రైతులపై వత్తిడి తగదు నీటి తీరువా కోసం రైతులపై వత్తిడి తగదు. నీరు అందించక పోయినా తీరువా చెల్లిస్తున్నాం. అయినా అధికారులు పాత బకాయిలు కూడా చెల్లిం చాలని వత్తిడి తెస్తున్నారు. రైతులకు అçప్పులే మిగిలాయి. అధికారులు ఆచోలించాలి. – లోలుగు విశ్వేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు, అంపిలి 90 రోజులు కూడ నీరు అందించడంలేదు అధికారులు తోటపల్లి కాలువల ద్వారా ప్రతి ఏటా కనీసం 90 రోజులు కూడా నీరు అందించడంలేదు. జనవరి నుంచి నవంబర్ నెల ఆఖరకు నీరు అందించిన రోజులు లెక్కించాల్సి ఉంది. అధికారులు మాత్రం రెండు సంవత్సరాలు అందించిన రోజులను లెక్కిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. – కండాపు ప్రసాదరావు, రైతు, రుద్రిపేట ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నీటి తీరువా వసూలు చేయడం వాస్తవం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్ఓలకు ఆదేశాలు జారి చేశాం. పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలు చేయడంపై లక్ష్యాలు విధించాం. అదేశాల ప్రకారమనే అధికారులు పనిచేస్తున్నారు. – ఎల్ రఘుబాబు, ఆర్డీవో, పాలకొండ -
రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ వేయం
-
నీటి తీరువా రద్దు
సాక్షి, మెదక్ : రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన రూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలను మాఫీ చేయడంతోపాటు నీటి తీరువా వసూళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వమే సాగునీటి ప్రాజెక్టులు నిర్వహిస్తుందని, రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ మోపబోమని స్పష్టం చేశారు. సీఎం బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ చర్చి గ్రౌండ్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రూ.20 కోట్ల మేరకు నీటి తీరువా బకాయిలున్నాయని, రైతుల సంక్షేమం కోసం వాటిని రద్దు చేయాలని పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారని సీఎం చెప్పారు. రైతు సంక్షేమం కోసం వారు కోరినట్టుగా నీటి తీరువా బకాయిలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశానికే ఆదర్శప్రాయ రీతిలో ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందజేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ అట్టర్ ఫ్లాప్ రాష్ట్ర రాజకీయాల గురించి తనకు రంది లేదని సీఎం అన్నారు. ‘‘అడ్డగోలు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే నాకు ఎలాంటి బెరుకూ లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 85 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు’’అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లోనూ టీఆర్ఎస్నే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెదక్ బిడ్డ అయిన తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ తిరోగమనంలో నడిపించాయని విమర్శించారు. రెండు పార్టీలూ అట్టర్ ప్లాఫ్ అయ్యాయని విమర్శించారు. ‘‘దేశవ్యాప్తంగా రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీ, నిరుద్యోగ యువకుల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా దేశ రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తాం. ప్రజలు ఆశీర్వదించాలి’’అని కోరారు. రైతుబంధు... ప్రపచంలోనే ఉత్తమం రైతుబంధు పథకం ప్రపంచానికే ఆదర్శప్రాయమైనదని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ‘‘ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. దేశమంతా ముక్కున వేలేసుకుని తెలంగాణ వైపు చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూ ప్రక్షాళన వంద శాతం విజయవంతమైంది. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో దీన్ని 9 ఏళ్ల క్రితం మొదలు పెడితే ఇంకా పూర్తి కాలేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా తాము ఇంకా భూ ప్రక్షాళన చేయలేదని ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నాతో అన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే భూ ప్రక్షాళన సాధ్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’’అని కొనియాడారు. జూన్ 2 నుంచి అమలులోకి రానున్న నూతన రిజిష్ట్రేషన్ విధానంలో కూడా దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందని సీఎం ధీమా వెలిబుచ్చారు. పోలీసు శాఖ అద్బుతంగా పని చేస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో పోలీసు శాఖకు అవసరమైన భవనాలు నిర్మించటంతోపాటు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. మెదక్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదు: హరీశ్ కాంగ్రెస్ హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రధానులు, మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధిని పట్టించుకోలేదని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ది వల్లే జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, శేరి సుభాష్ రెడ్డి, భూమిరెడ్డి, దామోదర్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
నీళ్ల పన్ను నిల్
ఖమ్మంఅర్బన్ : జిల్లాలో నీటి తీరువా కోట్లలో పేరుకుపోయింది. సాగునీరు వాడుకున్నందుకు ఎకరానికి రైతులు కొంత మొత్తం నీటి తీరువా రూపంలో చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని సాగునీటి కాల్వల మరమ్మతు తదితర పనుల కోసం వినియోగిస్తుంటారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అందించిన సాగునీటి లెక్కల ప్రకారం.. ప్రతి ఏడాది నీటి తీరువా రైతుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. దాదాపు ఏడేళ్లుగా నీటి తీరువా వసూలు చేయకపోవడంతో వసూళ్లు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో ఖరీఫ్, రబీలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు పైగానే సాగర్ జలాలు అందుతున్నాయి. సాగర్‌లో నీరుంటే రెండు పంటలకు పుష్కలంగా నీరందుతుంది. ఆయకట్టుగా ఉన్న సుమారు 2లక్షల 60వేల ఎకరాల్లో సగానికి పైగా వరి, మిగతా సగం ఆరుతడి పంటలు సాగు చేస్తుంటారు. ఇవేకాక చెరువులు, ప్రాజెక్టుల పరిధిలో లిఫ్టులు, చెక్‌డ్యాంల పరిధిలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు పైగానే సాగవుతుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే 2012–13 నుంచి వరుసగా ఇప్పటివరకు నీటి తీరువా వసూలు కావడం లేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదని ఎన్నెస్పీ అధికారులు చెబుతుండగా.. చెరువుల పరిధిలో కొందరు వీఆర్వోలు అరకొరగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎకరానికి రూ.100, రూ.200 వరకు.. సాగర్ ఆయకట్టు పరిధిలో నీటిని వినియోగించుకున్నందుకు వరికి ఎకరానికి రూ.200, ఆరుతడి పంటలకు రూ.150, చెరువుల పరిధిలో వరికి రూ.150, ఆరుతడి పంటలకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో కాల్వలు, తూములు తదితర మరమ్మతు పనులకు వినియోగిస్తారు. ఇందులో 50 శాతం నీటి సంఘాల పరిధిలోకి, 20 శాతం డీసీల పరిధిలో, 20 శాతం ప్రాజెక్టు కమితీ పరిధిలోని కాల్వల మర్మతులకు వాడొచ్చు. 10 శాతం పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఆరేడు ఏళ్లుగా నీటి తీరువా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ నిధులతోనే పనులు చేపడుతున్నారు. మంత్రి, కలెక్టర్ ఆరా.. నీటి తీరువా వసూళ్లపై సంబంధిత అధికారులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ చర్చించినప్పుడు.. నీటిని వాడుకున్నందుకు ప్రతి ఎకరాకు నీటి తీరువా వసూలు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో లెక్కలు తీసి.. పక్కాగా పన్ను వసూళ్లు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో ఏడేళ్లకు సంబంధించిన బకాయిలు సుమారు రూ.18కోట్ల వరకు ఉన్నట్లు ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం. ఈ లెక్కల్లో కొద్ది తేడా ఉన్నట్లు నీటిపారుదల శాఖ వాదన. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు దృష్టి పెట్టకపోవడంతోనే నీటి తీరువా సరిగా వసూలు కావడం లేదని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. సాగర్, చెరువుల పరిధిలో సుమారు రూ.25కోట్లకు పైగా నీటి తీరువా ఉంటే.. ఇందులో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.5కోట్ల మేర నిధులు వచ్చేవని చెబుతున్నారు. ఎన్నెస్పీ లెక్కలిలా.. 2012–13, 2015–16, 2017–18లో ఖరీఫ్‌లో సాగునీరు అందించలేదని మధ్యలో ఒక ఏడాదికి సంబంధించి పన్నులు నమోదు చేయలేదు. మిగిలిన సంవత్సరాల్లో మొత్తంగా రూ.17.88కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఇవికాక చెరువులు, లిఫ్టులు, ప్రాజెక్టుల పరిధిలో కలిపి రూ.25కోట్ల వరకు వసూలు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు అందించాం.. సాగర్ నీటి విడుదల ప్రకారం తమ ఇంజనీర్లు ఇచ్చిన లెక్కల మేరకు నీటి తీరువా జాబితా ఇస్తాం. తాము కాల్వల వెంట తిరుగుతున్నప్పుడు రైతులు పొలాలకు నీరు వాడుకుంటున్నారు. పన్ను ఎందుకు చెల్లించడం లేదని అడిగితే.. తమ వద్దకు ఎవరూ రాలేదని కొందరు రైతులు సమాధానం ఇస్తున్నారు. వరుసగా పన్నులు వసూలు కాకపోవడంతో కోట్లలోనే బకాయిలు ఉన్నాయి. – ఎం.వెంకటేశ్వర్లు, ఎన్నెస్పీ ఈఈ చెరువుల పరిధిలో వసూలు చేశాం.. తన పరిధిలో చెరువుల పరిధిలో రైతుల నుంచి నీటి తీరువాను గత ఏడాది కూడా వసూలు చేశాం. తమ పరిధిలో సాగర్ ఆయకట్టు పెద్దగా లేదు. చెరువుల పరిధిలో ఉన్న మేరకు వసూలు చేశాం. – హుస్సేన్, వీఆర్వో ఏన్కూరు -
బాధ్యతగా పన్నులు చెల్లించండి
విశాఖసిటీ: ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని గ్రేటర్ ప్రజలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ విజ్ఞప్తి చేశారు. కోట్ల రూపాయల బకాయిలుండటం వల్ల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పోలిస్తే జీవీఎంసీలో పన్నుల విలువ తక్కువైనా నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడా ది అక్టోబర్ వరకూ మొత్తం నీటి పన్ను బకాయిలు రూ.29 కోట్లుండగా, ఆస్తి పన్ను బకాయిలు రూ.37 కోట్లున్నాయని ఇవన్నీ వసూలైతే.. నగర ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్లకు నిధులు అవసరమని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను కచ్చితంగా వేరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 100 కిలోలు, అంతకంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు.. తమ పరిసర ప్రాంతాల్లోనే కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా చేయని వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. అదే విధంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. లేకుంటే ఆ ప్రాంతాలకు చెత్త బండిని పంపించే ది లేదని స్పష్టం చేశారు. చెత్త బండి రాలేదని పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. తడి పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి వద్ద బాధ్యతగా చేపట్టాలనీ, త్వరలోనే ఈ అంశాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేరు చేస్తున్నారని, అన్ని జోన్లకూ కలిపి రోజుకి 105 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. భీమిలి జోన్‌కు సంబంధించి 279 జీవో టెండర్ పరిశీలనలో ఉందనీ, మిగిలిన జోన్లకు సంబంధించి కోర్టులో స్టే నడుస్తోందని కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. నీటి పన్నుల విషయంలో కమర్షియల్ కేటగిరీల్లో కొన్ని తప్పులు దొర్లాయనీ, నోటీసులు వచ్చిన వారు ఆయా జోన్లకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. వర్షపునీటిని ఒడిసి పట్టాల్సిందే.. జీవీఎంసీ పరిధిలోని సెమీ బల్క్, బల్క్ వాటర్ కనెక్షన్లు కలిగిన వారంతా విధిగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కమిషనర్ సూచించారు. కేవలం ఇంకుడు గుంతల నిర్మాణానికే పరిమితం కాకుండా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఇస్తామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ ద్వారా ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లో 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ జీవీఎంసీ పరిధిలోని 27 హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని గుర్తించి, వారికి స్పెషల్ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి దానికనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధులు చేస్తామన్నారు. ఈ పరీక్షల మార్కుల్ని ఆన్లైన్లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
పన్ను చెల్లించకపోతే.. గొంతు తడవదంతే..
► తాగునీటి పథకాల నిలిపివేత ► ఇబ్బందులు పడుతున్న ప్రజలు ► మున్సిపాలిటీ తీరుపై మండిపాటు బద్వేలు అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల గొంతెండుతోంది. పన్నులు చెల్లించడం లేదనే కారణంతో 26 వార్డుల్లోని 19 గ్రామాల్లో సుమారు 11 తాగునీటి పథకాలను నిలిపివేశారు. దీంతో మూడు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడాల్సి న పరిస్థితి నెలకొంది. కొందరు పన్నులు చెల్లించని కారణంగా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. తాగునీటి పథకాల నిలిపివేత: మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో గూడెం, వల్లెలవారిపల్లె, రామాపురం, లక్ష్మీపాళెం , బుచ్చిరెడ్డిపాళెం, చెన్నంపల్లె, బోవిళ్లవారిపల్లె, భాకరాపేట గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయనే కారణంతో తాగునీటి పథకాలను నిలిపేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24వ వార్డు పరిధిలోని గూడెం గ్రామంలో సుమారు 600 జనాభా నివసిస్తుండగా ఒక్క తాగునీటి పథకమే ఉంది. పన్నులు చెల్లించలేదని దీనికి సంబంధించిన గదికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారని ప్రజలు చెబుతున్నారు. సమీప పొలాల్లోని మోటార్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. అధికారులు స్పందించి తాగునీటి పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీరు సరఫరా చేయాలి: గూడెం గ్రామంలో ఉన్న తాగునీటి పథకాన్ని నిలిపేశారు. దీంతో మూడు రోజులుగా నీరు రావడంలేదు. కూలి పనిచేసుకుని జీవించే మాలాంటోళ్లను ఇబ్బందులకు గురిచేయడం తగదు. పన్ను వసూళ్లకు మరేదైనా మార్గం ఆలోచించాలి. నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. –కొండమ్మ, గూడెం గ్రామం కష్టాలు పడుతున్నాం: పన్నులు చెల్లించని కొందరి కోసం అందరినీ ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. గ్రామంలో చాలామంది పన్నులు చెల్లించిన వారు కూడా ఉన్నారు. ఉన్నట్లుండి తాగునీటి పథకం నిలిపివేయడంతో కష్టాలు పడుతున్నాం. పండుగ సమయంలో ఇలా చేయడం సరికాదు. – శాంతమ్మ కమిషనర్ ఏమన్నారంటే: తాగునీటి పథకాల నిలిపివేతపై మున్సిపల్ కమిషనర్ శివరామిరెడ్డిని వివరణకోరగా విలీన గ్రామాల్లో అక్రమకుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఏళ్ల తరబడి పన్నులు కూడా చెల్లించడం లేదు. నోటీసులు ఇచ్చినా ఫలితం లేదు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చింది. శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నాం. -
20 ఏళ్లుగా నిద్రపోతున్నారా ?
సంతనూతలపాడు: ‘కాలనీలో 20 ఏళ్ల నుంచి 50 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. క్రమం తప్పకుండా గతంలో పంచాయతీకి..ఇప్పుడు కార్పొరేషన్‌కు ఇంటి పన్నులు, నీటి పన్నులు కడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాలనీని ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటి. ఇన్నేళ్లుగా నిద్రపోతున్నారా..కాలనీకి వైఎస్సార్ పేరు బదులు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఓకేనా’ అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేర్నమిట్ట పంచాయతీ పరిధిలో..ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాల వారు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కాలనీలోని స్థలాలు ఎన్ఎస్పీ కాలువకు చెందినవని..డిసెంబర్ 1వ తేదీనాటికి ఖాళీ చేయకుంటే ఇళ్లను కూల్చేస్తామని ఎన్ఎస్పీ అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసుల్లో ఎక్కడా సర్వే నంబర్లను పేర్కొనలేదు. ఇదే కాలనీలో పలు రైస్ మిల్లులు, కార్పొరేట్ స్కూళ్లు ఉంటే వాటికి నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల వారికే పంపడం గమనార్హం. ఈ క్రమంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బుధవారం కాలనీని సందర్శించారు. కాలనీలోని గృహాలను, వాటి డోర్ నంబర్లు, కరెంటు మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి ఓ పక్క ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించుకుంటూ ఇప్పుడు అవి ఎన్ఎస్పీ కాలువ స్థలాలన్న సాకు చూపి అధికారులు వారిని వీధులపాలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మెప్పుకోసమే ఈ పనిచేస్తున్నారా అని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి కాలనీవాసుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. పేర్నమిట్ట మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రావూరి లింగారెడ్డి మాట్లాడుతూ ‘అసలిక్కడ కాలువ ఉందా..అధికారం చేతిలో ఉందికదా అని అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని అవసరమైతే గాలిలో కూడా మేడలు కట్టాం అంటారు. అసలు కాలనీకి వైఎస్సార్ పేరు పెట్టడం వల్లే కదా ఇదంతా..ఎన్టీఆర్ పేరు పెడితే అధికారుల కళ్లు చల్లబడతాయా..’ అని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు ఓబుల్‌రెడ్డి, కండే రమణాయాదవ్, ఈశ్వరరావు, ఎమ్ ఆంజనేయులు, టీ గోపి, కృష్ణారెడ్డి, చిరంజీవి తదితరులున్నారు. -
నీటి పొదుపు
- దీన్ దయాళ్ ఆస్పత్రిలో రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు - నీటి అవసరాలే కాదు, నీటి పన్ను నుండీ విముక్తి - నగర ప్రజలకు అవగాహన కల్పించాలని ఆస్పత్రి వర్గాల సూచన పింప్రి, న్యూస్‌లైన్ : భవిష్యత్తులో నీటి సమస్యను ఇలా అధిగమించవచ్చు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రి ప్రయోగాత్మకంగా చేసి చూపించింది. సొంతంగా రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలుస్తోంది అదే పుణేలోని దీన్ దయాళ్ ఆస్పత్రి. ఆస్పత్రికి అవసరమైన నీటి అవసరాలను తీర్చుకునేందుకు మొట్టమొదటి సారిగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆస్పత్రులల్లో నీటి వాడకం అధికంగా ఉండడం, అదేవిధంగా నీటి పన్నులు అదే మొత్తంలో ఉంటున్నాయి. దీని నుంచి కూడా చాలా వరకు విముక్తి కలుగుతోందని ఆస్పత్రి వైద్యుడు పరాగ్ అభిప్రాయపడ్డారు. హోటళ్లు, హౌసింగ్ సొసైటీలు ఈ పద్ధతిని ఉపయోగించుకుంటే చాలా వరకు నీటి సమస్యను తీరుతుందని ఆయన సూచించారు. నీటి సమస్య నుండి బయటడేందుకు... ఈ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా రెయిన్ హార్వెస్టింగ్‌ను ప్రారంభించారు. నగరంలో కాంక్రీట్ రోడ్లు పెరిగిపోవడంతో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకడం లేదు. భూగర్భ జలాల నీటి మట్టం అడుగంటిపోతోంది. ఆస్పత్రి వర్గాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవడం తప్పడం లేదు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు రెయిన్ హార్వెస్టింగ్ మార్గాన్ని ఆస్పత్రి అనుసరిస్తోంది. ఇప్పటి వరకు ఐదు లక్షల లీటర్ల వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించిన్నట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి మంగేష్ గోడబోలే తెలిపారు. 6 అంతస్తుల ఆస్పత్రిలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, వంద నుంచి 120 పడకల వార్డుల ఉన్నాయి. ఆస్పత్రికి నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నీటి సమస్యలేదని, ఏడాది మొత్తం నీటి అవసరాలు తీరుతున్నాయని మంగేష్ తెలిపారు. ‘వాడియా’ కాలేజీకి..: రెయిన్ హార్వెస్టింగ్ ద్వారా వాడియా కాలేజీకి ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదు వేల మంది విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా కృషి చేస్తోంది. కాలేజీ ఆవరణలో నాలుగు అతి పెద్ద భవనాలకుఈ నీటిని వినియోగిస్తున్నారు. 2004 నుంచి నేటి వరకు ప్రణాళిక బద్ధంగా కాలేజీ పరిసరాలలో 17 ఎకరాలల్లో నిర్మించిన పలు భవనాలపై నుంచి వచ్చే వర్షపు నీటిని పైపుల ద్వారా ఒక చోటికి చే ర్చుతూ, తర్వాత ఆ నీటిని బావుల్లోకి పంపుతున్నారు. 2010లో నాలుగు బోర్లను వేయగా, ఆ బోర్లలోకి ఫిల్టర్ల ద్వారా ఈ నాలుగు బోర్ బావుల్లోకి నీటిని పంపుతున్నారు. కాలేజీలో నీటి సమస్య తీరి, నీటి పన్నుల బెడద నుంచి విముక్తి అయ్యింది. ఈ రెయిన్ హార్వెస్టింగ్ కు ‘కోకా కోలా’, ‘ముంబై మెంబర్స్ ఆఫ్ బ్రదర్ హుడ్’ అనే స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇవ్వడం ద్వారా అనుకున్నది సాధించామని కాలేజీ ఇంజినీరు, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అభయ్ హాకే తెలిపారు. ఇంటింటికి ప్రచారం.. కోత్రోడ్కు చెందిన సామాజిక కార్యకర్త సుహాస్ నిమ్హణ్ ఇప్పటి వరకు నగరంలోని 268 హౌసింగ్ సొసైటీలకు వెళ్లి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ప్రజలకు వివరించారు. వర్షాలు ప్రతి ఏడాది కురుస్తాయనీ, ఆ వర్షపు నీటిని వృథాగా పోనిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఒక ఏడాది వర్షాలు రాకపోతే తాగు నీటికి ఎన్నో అవస్థలు పడుతారని తెలిపారు. జనాభా పెరుగుతోందని, నీటి వనరులు మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు. గతంలో 10 నుంచి 15 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. ఇప్పుడు 50 నుంచి 100 అడుగుల లోతు వరకు జాడ కనిపించడం లేదన్నారు. పర్యావరణానికి హాని కలిగి మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీని ప్రభావం నుంచి బయటి పడాలంటే రెయిన్ హార్వెస్టింగ్‌ను కలిగి ఉండాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలల్లో బావుల ద్వారా భూగర్భ జలాలు పెరుగున్నాయి. వర్షపు నీటిని బోర్బావుల్లోకి ఫిల్టర్ చేసి పంపడం ద్వారా నగరాలలో కూడా భూగర్భ జలాల నీటి మట్టాలను పైకి తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. సుమారుగా 10 వేల ఖర్చు అవుతోందనీ సుహాస్ తెలిపారు. -
రూ.2.45 లక్షలు గోల్మాల్
కమిషనర్‌కు నోట్ పెట్టిన మేనేజర్ ఇప్పుడు నీటిపన్ను బాగోతం రామచంద్రపురం : రామచంద్రపురం మున్సిపాలిటీని కుదిపేసిన ఆస్తిపన్నుల అవినీతి బాగోతాన్ని మరువక ముందే.. ఇదే మున్సిపాలిటీలో నీటిపన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్ము మాయమైన వ్యవహారం వెలుగుచూసింది. కార్యాలయంలో బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆస్తి, నీటి పన్నుల వసూలు సొమ్మును స్వాహా చేశారని అధికారులే స్పష్టం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాలిటీలోని నీటి పన్నుల వసూళ్లలో జరిగిన అవినీతిపై మున్సిపల్ మేనేజర్ జి.రాధాకృష్ణ మే నెలలో కమిషనర్‌కు నోట్ పెట్టారు. మొత్తం 243 నీటి పన్నుల రసీదులకు సంబంధించి రూ.2.45 లక్షలు గోల్మాల్ అయినట్టు తెలిసింది. సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్, రెవెన్యూ వసూళ్ల విభాగం సిబ్బంది కలిసి ఆన్లైన్లో 243 నీటి పన్నుల రసీదులను రద్దు చేసి, వాటి సొమ్మును కార్యాలయ చిట్టాల నుంచి తొలగించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా, ఆన్లైన్లో కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను సిబ్బంది దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు ఈ బాగోతాన్ని నడిపించినట్టు సమాచారం. ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని మేనేజర్ తన లేఖలో పేర్కొన్నా, చర్యల్లేవు. ఆస్తిపన్ను బాగోతంపై నిర్లక్ష్యం మున్సిపాలిటీలో జరిగిన రూ.48 లక్షల ఆస్తిపన్ను బాగోతం వెలుగులోకి వచ్చి 15 రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. ఈ నెల 15న ‘సాక్షి’లో ‘ఇంటిదొంగల టాలెంట్’ శీర్షికన కథనం వెలువడిన సంగతి విదితమే. దీనిపై కల్టెక్టర్ స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. 21న ము న్సిపల్ కార్యాలయానికి ఆదేశాలు చేరుకున్నా, ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు. -
ఆదాయానికి ‘నీళ్లొ’దిలారు...
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఆ శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయానికి గండిపడింది. మూడేళ్ల నుంచి నీటి పన్ను వసూలు కాకపోవడంతో రూ.అర కోటికి పైగా ఆదాయం నిలిచిపోయింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోగా... అనధికారికంగా పుట్టుకొచ్చిన మరో 500 వర కూ కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు తెలిసినా వాటిపై చర్యలు తీసుకోలేదు. విజయనగరం మున్సిపాలిటీలో 19 వేల వరకు కుళాయి కనెక్షన్లుండగా, వాటి ద్వారా ఏడాదికి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అయితే 2010-11 సంవత్సరంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు అదనంగా 2000 కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా వాటిని ఆన్లైన్ చేయలేదు. దీంతో పన్ను వసూలు చేసేందుకు రెవెన్యూ విభాగం అధికారులకు అవకాశంలేకుండా పోయింది. 2000 కనెక్షన్లకు గత మూడేళ్లుగా ఒక్క నోటీసూ జారీకాలేదు. ఏడాదికి రూ. 14.40 లక్షల చొప్పున ఈ మూడేళ్లలో రూ.43 లక్షల 20వేల వరకు ఆదాయానికి గండిపడింది. అంతేకాకుండా ఇంజినీరింగ్ విభాగం అనుమతులు లేకుండా మరో 500 కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా మూడేళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వీటి ద్వారా ఈ మూడేళ్లలో మరో రూ.10.80 లక్షల వరకూ రావలసిన ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అనధికారిక కుళాయి కనెక్షన్లు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లో మరేతర కార ణాలతోనో వాటిపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ మూడేళ్లలో అటు అధికారిక, ఇటు అనధికారిక కుళాయి కనెక్షన్ల నుంచి రావాల్సిన రూ 54 లక్షల ఆదాయానికి బ్రేక్ పడింది. వార్డు పర్యటనల్లో గమనించిన మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఇంజినీర్‌కు నోటీసులు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణను వివరణ కోరగా.. పట్టణంలో అధికారికంగా మంజూరు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్‌నోటీసులు జారీ చేయకపోవడం వాస్తవమేనన్నారు. దీనిపై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి బాబుకు నోటీసుతో పాటు మెమో జారీ చేసినట్టు తెలిపారు. విచారణ చేసేందుకు డీఈతో కమిటీ వేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా 500 వరకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
పన్ను చెల్లించకపోతే కనెక్షన్ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: బకాయి వసూళ్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. పేరుకుపోయిన నీటి బకాయిలను వసూలు చేసేందుకుగాను అధికారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇన్నాళ్లూ నోటీసులు మాత్రమే పంపిన అధికారులు తాజాగా నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. గురువారం పట్టణంలోని సంజీవనగర్‌లో నీటి పన్ను బకాయిలపై నోటీసులు అందచేయడంతో పాటు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు మంజీరా నీటి సరఫరాను నిలిపివేశారు. 2011 నవంబర్ నుంచి పట్టణంలో మంజీర నీటి సరఫరా చేసేందుకు గాను నల్ల కనెక్షన్లు తీసుకున్న చాలా మంది మున్సిపాల్టీకి ఇంత వరకు పైసా కూడా చెల్లించలేదని మున్సిపల్ ఇంజనీర్ మున్వర్‌అలీ తెలిపారు. గతంలో పలుమార్లు బకాయిదారులకు నోటీసులు అందజేసిన స్పందించలేదని అందువల్లే వారి ఇంటి కనెక్షన్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా నీటిపన్ను బకాయిదారులు మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్ను చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకటరావ్ , ఏఈ మహేశ్, వాటర్ సప్లయ్ సూపర్వైజర్ గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాజెక్టు పనులు ధరల పెంపు పై గందరగోళం