సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: బకాయి వసూళ్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. పేరుకుపోయిన నీటి బకాయిలను వసూలు చేసేందుకుగాను అధికారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇన్నాళ్లూ నోటీసులు మాత్రమే పంపిన అధికారులు తాజాగా నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. గురువారం పట్టణంలోని సంజీవనగర్‌లో నీటి పన్ను బకాయిలపై నోటీసులు అందచేయడంతో పాటు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు మంజీరా నీటి సరఫరాను నిలిపివేశారు.
2011 నవంబర్ నుంచి పట్టణంలో మంజీర నీటి సరఫరా చేసేందుకు గాను నల్ల కనెక్షన్‌లు తీసుకున్న చాలా మంది మున్సిపాల్టీకి ఇంత వరకు పైసా కూడా చెల్లించలేదని మున్సిపల్ ఇంజనీర్ మున్వర్‌అలీ తెలిపారు. గతంలో పలుమార్లు బకాయిదారులకు నోటీసులు అందజేసిన స్పందించలేదని అందువల్లే వారి ఇంటి కనెక్షన్‌లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా నీటిపన్ను బకాయిదారులు మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్ను చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటరావ్ , ఏఈ మహేశ్, వాటర్ సప్లయ్ సూపర్‌వైజర్ గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
పన్ను చెల్లించకపోతే కనెక్షన్ కట్
Published Thu, May 22 2014 11:54 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement