weird
-
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదేం విడ్డూరం..మంగళవారం పెళ్లిళ్లు చేసుకుంటే పెటాకులవుతాయా?
5జీ టెక్నాలజీతో దూసుకుపోతున్నా ఇప్పటికీ మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తున్నా ఇప్పటికీ పిల్లి ఎదురుపడితే అపశకునం అని, రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే అరిష్టం అని, పగిలిన అద్దం వాడిదే దరిద్రమని నమ్మేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించేవాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్లు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందన్న గుడ్డి నమ్మకంతో కొన్నింటిని ఫాలో అవుతుంటాం. ఇది ఒక్క మనదేశంలోనే కాదండోయ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి వింతైన మూఢనమ్మకాలు మనల్ని కశ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ♦ నైజీరియాలో పిల్లల పెదవులపై ముద్దు పెట్టరు. అలా చేస్తే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ల జీవితం నాశనం అవుతుందని నమ్ముతారట. ♦ మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం చాలామందికి అలవాటు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ అలవాటును అస్సలు ఒప్పుకోరట. ఖాళీగా కూర్చొని కాళ్లు కదిపితే ఆ వ్యక్తి సంపద మొత్తం పోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట. ♦ ఐస్‌ల్యాండ్‌లో ఆరుబయట అల్లికలు,కుట్లు చేయరట. అలాచేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని భావిస్తారు. అలసే అక్కడ మైనస్ డిగ్రీల వాతావరణం కాబట్టి ఈ పని అస్సలు చేయరు. ♦ లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఒకవేళ అలా చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. నిత్యం తిట్లు, గొడవలతో చివరకు విడాకులు తీసుకొని విడిపోతారట. అందుకే అక్కడి ప్రజలు మంగళవారం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్లు చేసుకున్నా ఏదో ఒక సాకుతో జనం వెళ్లడానికి కూడా ఇష్టపడరట. ♦ జపాన్‌లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరట. ♦ జర్మనీలో కొవ్విత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులను చెడు చేస్తుందట. ♦ ఆఫ్రికా దేశం రువాండలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయనేది మూఢనమ్మకం. ♦ జపాన్‌లో సూర్యాస్తమయం తర్వాత చేతి గోళ్లను కత్తిరించరు. అలా కత్తిరిస్తే త్వరగా చనిపోతారని నమ్ముతారట. మన దగ్గర కూడా అరిష్టం అని రాత్రిళ్లు గోళ్లు కత్తిరించరు. ♦ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలంటే ఏం చేస్తాం? గొడుగు తీసుకొని బయటకు వెళ్తాం. అయితే ఆ గొడుగు బయటకు వెళ్లాకే తెరవాలట. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు గొడుగు తెరవొద్దట. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట. అందుకే ఎంత వర్షం పడుతున్నా పూర్తిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన తర్వాతే గొడుగు తెరుస్తారు. ♦ స్వీడన్లో మాన్హోల్పై పొరపాటున కూడా కాలు పెట్టరట. అలా చేస్తే ప్రేమ విఫలం అవుతుందని, దురవృష్టం వెంటాడుతుందని బలం నమ్ముతారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. -
గుట్కా తినండి.. మందు తాగండి.. సేవ్ వాటర్!
భోపాల్: కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ఆ చితూచి మాట్లాడడం చాలా అవసరం. అయినా కూడా ఏదో ఒక దగ్గర కొందరు తమ నోటికి పని చెప్తూ.. విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు అలాంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. నీటి సంరక్షణ అంశంపై మాట్లాడుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లందరినీ షాక్‌కు గురి చేశాయి. అప్పటిదాకా ఆయన చేసిన వ్యాఖ్యలను ఆసక్తిగా విన్న జనం.. చివర్లో ఆయన ఇచ్చిన ట్విస్ట్‌తో కంగుతిన్నారు. రేవా ఎంపీ జనార్ధన్ మిశ్రా.. తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో.. ‘‘నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయి. కాబట్టి, వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. గుట్కా అయినా తినండి.. లేదంటే ఆల్కాహాల్ అయినా తాగండి.. లేదంటే మత్తు పదార్థాలకు ప్రత్యామ్నాయాలనైనా ప్రయత్నించండి. కానీ, నీటి విలువను అర్థం చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. #WATCH | Rewa, Madhya Pradesh: "Lands are running dry of water, it must be saved... Drink alcohol, chew tobacco, smoke weed or smell thinner and solution but understand the importance of water," says BJP MP Janardan Mishra during a water conservation workshop pic.twitter.com/Nk878A9Jgc — ANI (@ANI) November 7, 2022 రేవా కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియల్‌లో ఆదివారం ఈ వర్క్‌షాప్ జరగ్గా.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఒకవేళ రేపు ఏ ప్రభుత్వమైనా నీటి పన్నులు మాఫీ చేస్తామని ప్రకటిస్తే.. వాళ్లకు ఒక మాట చెప్పండి. నీటి పన్నులే చెల్లిస్తాం, దానికి బదులుగా కరెంట్ బిల్లులతో సహా మిగతా పన్నులన్నీ మాఫీ చేయమండి డిమాండ్ చేయండి అంటూ సలహా ఇచ్చారు మిశ్రా. మిశ్రా ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన ఆయన ఘనత ఈ మధ్యే తెగ వైరల్ అయ్యింది కూడా. ఇదీ చదవండి: ‘డబుల్ ఇంజన్’కు అగ్నిపరీక్ష -
ఇలాంటి వింత ఉద్యోగాల గురించి ఎప్పుడైనా విన్నారా
మనుషుల మనుగడకు ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం– ఇలా ఏదో ఒక ఆదాయ మార్గం ఉండాల్సిందే! కొన్ని పనుల్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఇంకొన్ని పనుల్లో పెద్దగా కష్టం లేకున్నా, ఫలితం బాగానే దక్కుతుంది. ఆదాయమార్గమైన ఏ రంగంలో రాణించాలన్నా, ఆ రంగానికి చెందిన నైపుణ్యాలు లేకుంటే, అందులో కొనసాగడం కష్టమే! రకరకాల చదువులు, శిక్షణలు వంటివన్నీ ఉపాధి కోసమే! ఉపాధి ఏదైనా, అందులోని కష్టనష్టాలను భరించక తప్పదు. డబ్బులు ఊరికే రావు కదా మరి! నిజమే గాని, పూర్తిగా ఊరికే కాకున్నా దాదాపు ఊరికే డబ్బులొచ్చే ఉపాధి మార్గాలూ ఉన్నాయి. ప్రపంచంలో దండిగా ఆదాయం తెచ్చిపెట్టగల కొన్ని సుఖప్రదమైన సరదా పనులు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని చిత్రవిచిత్రమైన ఉపాధి మార్గాలు కూడా ఉన్నాయి. అతి అరుదైన అలాంటి కొన్ని వింత వింత ఉద్యోగాలు, ఉపాధిమార్గాల విశేషాలు మీకోసం.. రోజూ భోంచేయడం, భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను రుచిచూడటం, రోజంతా అలసి సొలసి పనిచేశాక, రాత్రివేళ ఆదమరచి నిద్రపోవడం, కాలక్షేపానికి సినిమాలు చూడటం, టీవీ చానళ్లు, ఓటీటీల్లోని ప్రసారాలను చూడటం వంటివి అందరూ చేసే పనులే! ఈ పనుల వల్ల ఎంతో కొంత ఖర్చు కూడా తప్పదు. అయితే, కొందరికి మాత్రం ఇలాంటి పనులే భేషైన ఆదాయమార్గాలుగా మారి, ఇబ్బడిముబ్బడిగా కాసులు కురిపిస్తున్నాయి. ఏమిటేమిటి? తిండి తిన్నా, నిద్రపోయినా, సినిమాలు చూసినా డబ్బులిస్తారా? అని అవాక్కయిపోకండి. ఇలాంటి రోజువారీ పనులకూ భేషుగ్గా డబ్బులిచ్చేవారు ఉన్నారు. ప్రొఫెషనల్ స్లీపర్ చక్కని సుతిమెత్తని పరుపు మీదకు చేరి, సుఖంగా నిద్రించడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. పాశ్చాత్య దేశాల్లో కొన్ని పరుపుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి ప్రొఫెషనల్ స్లీపర్లకు పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నిద్రకు సంబంధించిన సమస్యలపై వైద్య పరిశోధనల కోసం కొన్ని ఔషధ తయారీ సంస్థలు, భారీ స్థాయి ప్రదర్శనలను ఏర్పాటు చేసేచోట ప్రదర్శనల నిర్వాహకులు కూడా ప్రొఫెషనల్ స్లీపర్ల సేవలను తమ అవసరాల మేరకు తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. వీరు చేయాల్సిన పనల్లా, తమకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో, పరిసరాల్లో చక్కగా నిద్రించడం, నిద్ర లేచాక తమ నిద్రానుభూతిని వివరంగా తెలియజేయడం. ప్రొఫెషనల్ స్లీపర్ల సగటు వార్షిక ఆదాయం 46,545 డాలర్ల (రూ.38.36 లక్షలు) వరకు ఉంటుంది. పెట్‌ఫుడ్ టెస్టర్ ఫుడ్ టెస్టర్ మరీ అరుదైన ఉద్యోగమేమీ కాదు. కొన్ని స్టార్ హోటళ్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్ టెస్టర్లను నియమించుకుంటాయి. అయితే, పెంపుడు జంతువుల కోసం తయారు చేసే ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యత ఎలా ఉన్నదీ చెప్పడానికి కొన్ని బహుళజాతి పెట్‌ఫుడ్ తయారీ సంస్థలు ఫుడ్ టెస్టర్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పెంపుడు పిల్లులు, కుక్కల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యతను చెప్పడమే పెట్‌ఫుడ్ టెస్టర్ల పని. ఈ ఉద్యగంలో ఏడాదికి 27 వేల డాలర్లకు (22.25 లక్షలు) పైగానే సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. పారానార్మల్ గైడ్ ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశాల్లో అక్కడి స్థానిక విశేషాలను పర్యాటకులకు వివరించేందుకు గైడ్లు ఉంటారు. ఈ పని వారికి ఒక స్వయం ఉపాధి మార్గం. ప్రపంచంలో భయానక ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు అక్కడ తిరుగుతుంటాయని ఆ ప్రదేశాల గురించిన కథలు వినిపిస్తుంటాయి. చాలామంది అలాంటి ప్రదేశాలకు వెళ్లడానికే భయపడతారు. కొందరికి మాత్రం అతీంద్రియ శక్తుల విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలాంటి ఔత్సాహికులు వెదికి మరీ అలాంటి ప్రదేశాలకు వెళుతుంటారు. సాహసించి వెళ్లిన వారికి అక్కడి స్థానిక విశేషాలు, పద్ధతులు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సహకరించేందుకే పారానార్మల్ గైడ్లు పుట్టుకొచ్చారు. పర్యాటకులకు తోడుగా అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకునే పాడుబడ్డ బంగ్లాలు, కోటలు, అడవుల్లోకి వెళుతూ, వారికి అక్కడి విశేషాలను వివరిస్తారు. వీరి ఆదాయం ఏడాదికి 84 వేల డాలర్ల (రూ.69.27 లక్షలు) వరకు ఉంటుంది. ఫార్చూన్కుకీ రైటర్ కుకీస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండి. వీటిలో రకరకాలు ఉంటాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా కుకీస్‌ను ఇష్టంగా తింటారు. పాశ్చాత్యదేశాల్లో కుకీస్‌ను తయారు చేసే కొన్ని కంపెనీలు, వాటిలో కొన్ని చీటీలను పెడతాయి. ఆ చీటీల్లో అదృష్టాన్ని సూచించే అందమైన వాక్యాలు ఉంటాయి. జనాలను బాగా ఆకట్టుకునేలాంటి అదృష్ట వాక్యాలు రాయడంలో నైపుణ్యం ఉన్న రచయితలను కుకీల తయారీ సంస్థలు ఫార్చూన్ కుకీ రైటర్లుగా నియమించుకుంటాయి. చాలామంది కుకీల కంటే, వాటిలో ఉండే చీటీల కోసమే వాటిని కొంటుంటారు. అందువల్ల ఫార్చూన్కుకీ రైటర్లకు గిరాకీ ఏర్పడింది. వీరి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది. ఫేస్ఫీలర్ రకరకాల ముఖాలను చేతులతో తాకి, ముఖచర్మాల తీరుతెన్నులను వివరించడమే ‘ఫేస్ఫీలర్’ పని. సౌందర్యసాధనాల మార్కెట్లో ముఖానికి సంబంధించిన వాటి వాటానే సింహభాగం ఉంటుంది. అందువల్ల ముఖసౌందర్యానికి మెరుగుపరచే క్రీములు, లోషన్లు, పౌడర్లు, సబ్బులు, ఫేస్‌వాష్‌లు, షేవింగ్ క్రీములు, రేజర్లు వంటివి తయారు చేసే సంస్థలు ప్రత్యేకంగా ఫేస్ ఫీలర్లను నియమించుకుంటాయి. కొత్తగా ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ముందు ఈ కంపెనీలు రకరకాల పరీక్షలు నిర్వహిస్తాయి. వాటిలో ఫేస్ఫీలర్ల పాత్ర కీలకం. ఉత్పత్తులు వాడక ముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు ముఖచర్మాల్లో వచ్చిన మార్పులను చేతులతో తాకి గుర్తించి, వివరాలను నమోదు చేయడం వీరి ముఖ్యమైన పని. వీరు భరోసా ఇస్తేనే, సదరు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. వీరి పారితోషికం గంటకు 25–50 డాలర్ల (రూ.2,061–4,123)వరకు ఉంటుంది. లైన్ స్టాండర్ క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి రావడం ఎవరికైనా ఇబ్బందే! బలహీనంగా ఉన్నవాళ్లయితే క్యూలైన్లలో నిలబడలేక, సొమ్మసిల్లిపోయే సంఘటనలు మనకు తెలియనివి కాదు. మనవంతు క్యూలైన్లో మనకు బదులు మరొకరు నిలబడేందుకు ముందుకొస్తే, ఎంతో ఉపశమనంగా ఉంటుంది. క్యూలైన్ల సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. జనాలు ఎదుర్కొనే ఈ ఇబ్బందిని గమనించి కొందరు, దీనినే తమ స్వయం ఉపాధి అవకాశంగా మార్చుకున్నారు. ఇతరుల బదులు క్యూలైన్లో నిలబడి, అందుకు కొంత రుసుము తీసుకుంటారు. ఈ పనిచేయడానికి విద్యార్హతలు, నైపుణ్యాలతో పెద్దగా పనిలేదు. కాళ్లల్లో సత్తా, గంటల తరబడి నిలబడే ఓపిక ఉంటే చాలు. అమెరికాలోను, యూరోపియన్ దేశాల్లోనూ కొద్దిమంది లైన్స్టాండర్లుగా ఉపాధి పొందుతున్నారు. షాపింగ్ మాల్స్ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించినప్పుడు, బడా కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు వీరికి బాగా గిరాకీ ఉంటుంది. లైన్స్టాండర్లు ఈ పని ద్వారా వారానికి వెయ్యి డాలర్ల వరకు (సుమారు రూ.82 వేలు) సంపాదిస్తుంటారు. పెయింట్ డ్రై వాచర్ పెయింట్లను తయారు చేసే కొన్ని బడా అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించేందుకు పెయింట్ డ్రై వాచర్లను నియమించుకుంటాయి. పెయింటర్లు గోడలకు పెయింట్ పూయడం పూర్తిచేసిన వెంటనే పెయింట్ డ్రై వాచర్ల పని మొదలవుతుంది. గంటల తరబడి పెయింట్ పూసిన గోడ ముందే కూర్చుని, పూసిన పెయింట్ ఆరడానికి ఎంత సమయం పడుతోంది, ఆరిన తర్వాత దేనికైనా అంటుకుంటోందా లేదా అని పరిశీలించి, ఆ వివరాలను కంపెనీ నిర్వాహకులకు ఒక నివేదికలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ పనిచేయడానికి కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చునే ఓపిక ఉంటే చాలు. ఈ పనిచేసే వారికి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని... ఇలాంటివే మరికొన్ని విచిత్రమైన ఉద్యోగాలు, వృత్తులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని రిస్కుతో కూడుకున్నవీ ఉన్నాయి. ఉదాహరణకు పాముల నుంచి విషాన్ని వెలికితీయడం. ఈ ప్రక్రియను స్నేక్ మిల్కింగ్ అంటారు. ఔషధ కంపెనీలు ఈ పనికోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటాయి. వీరికి వార్షికాదాయం 60 వేల డాలర్ల (సుమారు 50 లక్షలు) వరకు ఉంటుంది. వివాహ వేడుకల్లో అతిథుల సందడి తక్కువయ్యే సందర్భాల్లో కొందరు ఫేక్గెస్ట్లను ఆహ్వానిస్తుంటారు. ఒక్కో పెళ్లికి హాజరయ్యేందుకు వీరికి 2500 డాలర్ల (రూ.2.06 లక్షలు) వరకు ముడుతుంది. అలాగే అంతిమయాత్రలో పాల్గొనేందుకు కూడా అద్దెమనుషుల సేవలను ఉపయోగించుకునే జనాలూ ఉన్నారు. విమానాలకు రంగులు వేసే ఏరోప్లేన్ పెయింటర్, వ్యాపార సమావేశాలకు కాస్త హంగు తీసుకొచ్చే ప్రొఫెషనల్ ఫారెనర్, రహదారికి అడ్డంగా పేరుకుపోయిన మంచుదిమ్మలను తొలగించే ఐస్‌బెర్గ్ మూవర్, ఎలుకల సాయంతో మందుపాతరల ఆచూకీని కనుగొనే ల్యాండ్‌మైన్ డిటెక్టర్, దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించే తీఫ్ హంటర్ వంటి అరుదైన వృత్తులు కూడా ఉన్నాయి. ఈ వృత్తులు, ఉద్యోగాల గురించి చాలామందికి సరైన సమాచారం తెలియదు. ఇలాంటి కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల ఆదాయం కంటే ఎక్కువగానే ఉండటం విశేషం. ఫెంగ్‌షుయి కన్సల్టంట్ ఫెంగ్‌షుయి ప్రాచీనకాలం నుంచి చైనాలో వ్యాప్తిలో ఉంది. ఇది దాదాపు మన వాస్తుశాస్త్రంలాంటిది. చైనా నుంచి ఇది దేశదేశాలకూ పాకింది. అగ్రరాజ్యాల్లో ఫెంగ్షుయికి ఆదరణ విపరీతంగా ఉంటోంది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ చైనీయులు కొందరు ఫెంగ్షుయిని వృత్తిగా మలచుకుని భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. ఫెంగ్‌షుయి పూర్తిగా విశ్వాసాలతో కూడుకున్నదే అయినా, దీని గిరాకీ తక్కువేమీ కాదు. ఈ గిరాకీనే ఫెంగ్‌షుయి కన్సల్టంట్లకు కాసుల పంట పండిస్తోంది. ఒక్కో క్లయింట్ నుంచి వీరు వెయ్యి డాలర్ల (రూ.82 వేలు) వరకు వసూలు చేస్తుంటారు. పేపర్ టవల్ స్నిఫర్ సెంట్లు, డియోడరెంట్లు వంటివి వాసన చూసి, వాటి నాణ్యతను పరీక్షించే ఆడర్ స్నిఫర్లే కాదు, పేపర్ టవల్స్– అదే టిష్యూపేపర్లను వాసన చూసే పేపర్ టవల్ స్నిఫర్లూ ఉన్నారు. టిష్యూపేపర్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు పేపర్ టవల్ స్నిఫర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అప్పుడే తయారైన టిష్యూ పేపర్లను వాసన చూసి, వాటి నాణ్యతను ధ్రువీకరించడమే వీరు చేయాల్సిన పని. వీరికి ఏడాదికి 52 వేల డాలర్ల (రూ.42.88 లక్షలు) వరకు ఆదాయం ఉంటుంది. హ్యూమన్ స్టాచ్యూ హ్యూమన్ స్టాచ్యూలు మన దేశంలోనూ కనిపిస్తారు. అయితే, వారినెవరూ ప్రత్యేకంగా నియమించరు. వారంతట వారే, ఒళ్లంతా తెల్లగా మెరిసే రంగు పూసుకుని గాంధీ వేషంలో ఎక్కువగా రద్దీ కూడళ్లలో కనిపిస్తుంటారు. జనాలు జాలి తలచి ఇచ్చే డబ్బు తప్ప వారికి దక్కేదింకేమీ ఉండదు. కాని, పాశ్చాత్య దేశాల్లోనైతే ఇదొక ప్రత్యేకమైన వృత్తి. వీరు ఒంటికి రంగు పూసుకుని, కదలకుండా శిలా విగ్రహంలా గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. ఎక్కువగా వేడుకలు జరిగే చోట, షాపింగ్ మాల్స్ వద్ద జనాలను ఆకట్టుకోవడానికి వీరిని నియమించుకుంటారు. వీరి సేవలకు గంటకు 100 డాలర్ల (సుమారు రూ.8,200) వరకు పారితోషికంగా చెల్లిస్తారు. ఆడర్ స్నిఫర్స్ పొద్దన్న లేచింది మొదలు రకరకాల వాసనలను ఆఘ్రాణిస్తూనే ఉంటాం. వాసనలు చూడటానికి జీతాలు చెల్లించే సంస్థలూ ఉన్నాయి. సెంట్లు, పర్ఫ్యూమ్లు, డీయోడరెంట్లు వంటి పరిమళ ద్రవ్యాలను తయారు చేసే కొన్ని పెద్దస్థాయి కంపెనీలు ప్రత్యేకంగా ఆడర్ స్నిఫర్స్ను నియమించుకుంటాయి. ఇంకొన్ని కంపెనీలు తమ అవసరం మేరకు గంటకు కొంతమొత్తం చొప్పున పారితోషికం చెల్లించి, ఆడర్ స్నిఫర్ల సేవలను వినియోగించు కుంటాయి. ఉత్పత్తుల నాణ్యతను కాపాడుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్తదనాన్ని అందించడానికి మార్కెట్లో పోటీ పడే సంస్థలు నిశితమైన ఆఘ్రాణశక్తి గలవారికి ఆడర్ స్నిఫర్లుగా అవకాశాలు ఇస్తుంటాయి. ఈ ఉద్యోగంలో పనితనం, అనుభవం బట్టి ఏడాదికి 39 వేల (32.16 లక్షలు) నుంచి, 1.13 లక్షల డాలర్ల (రూ.93.18 లక్షలు) వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా వీరి సేవలను వినియోగించు కునే కంపెనీలు వీరికి గంటకు 25–30 డాలర్ల (రూ.2,061– 2,474) వరకు చెల్లిస్తాయి. ప్రొఫెషనల్ కడ్లర్ ఇది పూర్తిగా స్వయం ఉపాధి వృత్తి. తమ వద్దకు వచ్చే క్లయింట్లను వాటేసుకోవడమే వీరి పని. రకరకాల కారణాలతో దిగులు, మనోవేదనతో బాధపడేవారు ఆత్మీయస్పర్శను కోరుకుంటారు. ఆత్మీయస్పర్శకు నోచుకోని ఒంటరిజీవులకు ఊరటనిచ్చే ఉద్దేశంతో సమంతా హెస్ అనే అమెరికన్ యువతి దాదాపు దశాబ్దం కిందట ప్రొఫెషనల్ కడ్లర్గా మారింది. ఆమె ఇందులో విజయవంతం కావడంతో మరికొందరు కూడా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. సోఫాపై కూర్చుని లేదా మంచంపై పడుకుని, క్లయింట్లను కౌగలించుకుని ఉండటమే వీరి పని. వీరి ఆదాయం గంటకు 20 నుంచి 40 డాలర్ల (రూ.1650– 3300) వరకు ఉంటుంది. మూవీ వాచర్ సినిమాలు చూడటమంటే చాలామందికి సరదా. అభిమాన హీరోల సినిమాలు విడుదలైతే, థియేటర్లో ఆడుతున్నన్ని రోజులూ వాటిని చూసే వీరాభిమానులూ ఉంటారు. సినిమాకు వెళితే టికెట్లు, వెహికల్ పార్కింగ్, చిరుతిళ్లు, కూల్డ్రింకులు వగైరాలకు బాగానే ఖర్చవుతుంది. అయితే, సినిమాలు చూడటానికి– అదీ విడుదలకు ముందే వాటిని చూడటానికి డబ్బులిచ్చేవారూ ఉన్నారు. హాలీవుడ్లో కొన్ని నిర్మాణ సంస్థలు తాము నిర్మించిన సినిమాలు చూసి, వాటికి రేటింగ్ ఇచ్చేందుకు నిపుణులైన విశ్లేషకులను నియమించుకుంటాయి. ‘నెట్‌ఫ్లిక్స్’ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలూ ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్నాయి. విడుదలకు ముందే ఈ నిపుణులు సినిమాలు, సిరీస్‌లు చూసి, వాటికి మంచి రేటింగ్ ఇస్తేనే, అవి విడుదలకు నోచుకుంటాయి. ఈ పని చేసేవారికి గంటకు 15 డాలర్ల (రూ.1237) వరకు పారితోషికం ఉంటుంది. ప్రొఫెషనల్ మెర్మెయిడ్ మెర్మెయిడ్లు– అంటే మత్స్యకన్యలు కాల్పనిక సాహిత్యంలో తప్ప నిజజీవితంలో కనిపించరు. అయితే, కొందరు మెర్మెయిడ్ వేషధారణతో సరదాగా సముద్రతీరంలోనో, కనీసం ఈతకొలను దగ్గరో రకరకాల భంగిమల్లో ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. నడుము నుంచి దిగువభాగమంతా చేప మాదిరిగా తయారు చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఈతకొడుతూ చూసేవారిని ఆకర్షిస్తూ ఉంటారు. పెద్దపెద్ద వేడుకలు, ఉత్సవాలు జరిగేచోట నిర్వాహకులు ప్రొఫెషనల్ మెర్మెయిడ్ల సేవలను ఉపయోగించుకుంటూ ఉంటారు. సందర్శకుల్లో ఆసక్తి ఉన్నవారికి మెర్మెయిడ్ దుస్తులు ధరించి, ఈతకొట్టడంలో మెలకువలను కూడా వీరు నేర్పిస్తూ ఉంటారు. ఇది పూర్తిస్థాయి ఉద్యోగం కాకున్నా, భారీగానే ఆదాయం తెచ్చిపెట్టే స్వయం ఉపాధి మార్గం. ప్రొఫెషనల్ మెర్మెయిడ్లకు ఆదాయం గంటకు 300 డాలర్ల (సుమారు రూ.25 వేలు) వరకు ఉంటుంది. -
అరేయ్ ఏంట్రా ఇది! బట్టలిప్పి మరీ నగ్నంగా చోరీ
సాక్షి, హైదరాబాద్: దొంగతనంలోనూ తనకో స్టయిల్ ఉందని నిరూపించుకున్నాడు ఓ చోరుడు. నగరంలోని సనత్ నగర్లో తాజాగా ఓ విచిత్రమైన చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న దుకాణంలోకి దూరిన ఓ దొంగ.. బట్టలు విప్పేసి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి. సనత్ నగర్లో బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న ఓ మెడికల్ స్టార్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్న క్రమంలో.. ఆ ఆగంతకుడు దుస్తులు విప్పి లోపలికి ప్రవేశించాడు. సుమారు రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. అటు ఇటు కలియతిరిగి.. డ్రాలో ఉన్న డబ్బును బయటకు తీశాడు. తిరిగి బయటకు వచ్చే క్రమంలో దుస్తులు వేసుకుని దర్జా నడుకుంటూ వెళ్లిపోయాడు. ఉదయం మెడికల్ షాప్ తెరిచేందుకు వచ్చిన నిర్వాహకుడు.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అరేయ్ ఏంట్రా ఇది! బట్టలిప్పి మరీ నగ్నంగా చోరీ
-
అమితాబ్ ముందే ఊహించారా?
సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటి శ్రీదేవి మరణవార్త మీడియాలో రావటం కంటే ముందే ఆయన ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ఆమె మృతికి సంబంధించిందేనంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది’ అని ఆయన ఓ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్ని నిమిషాల ముందే ఈ ట్వీట్ చేయటం విశేషం. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్ ముందే ఊహించే ఆ ట్వీట్ చేశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పని చేసిందని.. అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి ఉంటుందని’ అని అంటున్నారు. అయితే శ్రీదేవి అమితాబ్‌తో కలిసి ఐదారు చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు, లేదా సన్నిహిత వ్యక్తులు.. బిగ్ బీకి వెంటనే సమాచారం అందించి ఉంటారని, అందుకే ఆయన అలా ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు అమితాబ్ ఆ ట్వీట్‌పై మళ్లీ స్పందించకపోవటంతో సోషల్ మీడియాలో దానిపై చర్చ ఆగటం లేదు. -
తాగి కారు నడిపినా తప్పు కాదట!
డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయన్న విషయం ప్రతి వారికీ తెలిసినదే. అందుకే ఆయా ప్రాంతాలను బట్టి భద్రతాధికారులు కొన్ని నిబంధనలను విధిస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు వేసే శిక్షలు, జరిమానాలూ కూడ భయంకరంగా ఉండటం కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో కార్లను ఆదివారం కడగడమే తప్పయితే... కొన్ని చోట్ల మద్యం సేవిస్తూ కారు నడిపినా తప్పు లేదట. ప్రపంచవ్యాప్తంగా కనిపించే నియమాల్లో వింతగా కనిపించే నిబంధన బీజింగ్ లో కనిపిస్తుంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర బాటసారులు రోడ్లు దాటేప్పుడు ఒకవేళ సిగ్నల్ పడిందంటే వారి పని అంతే. ప్రమాదం జరుగుతుందని తెలిసినా కారు నడిపే వారు మాత్రం మనుషులు అడ్డొచ్చినా, ప్రాణాలు పోయినా వాహనాలు ఆపకూడదట. అలాగే కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా అవలంబిస్తున్నసరిబేసి విధానం చాలా దేశాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా స్పానిష్ దేశాల్లో రోడ్లమీద కార్లు పార్క్ చేయడంలో సరి బేసి విధానం అమలవుతోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కారు పార్క్ చేయకపోతే భారీ జరిమానాలు పడటం ఖాయం. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడంకోసం, రోడ్డు మార్గం సరిగా కనిపించడం కోసం చీకటి సమయంలో వాహనాల లైట్లను వేస్తాం. అయితే స్వీడన్ లో మాత్రం పగలు కూడ వాహనాలు నడిపేవారు లైట్లను ఆపకూడదట. ప్రయాణంలో లైట్లు వెలగని పక్షంలో శిక్షను భరించాల్సిందే. ఈ వింత నియమం ఎందుకు అవలంబిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అలాగే థాయ్ ల్యాండ్ లో బట్టలు సరిగా వేసుకోకుండా కార్లు, బైక్ లు నడపడం నిషేధం స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే... నిబంధనను అతిక్రమించారంటే భారీ జరిమానా కట్టాల్సిందే. ఇక రష్యాలో అయితే మట్టికొట్టుకుపోయిన వాహనాలు రోడ్లపైకి తేవడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇండియాలో బాటసారులు ఎలా పోయినా ఫర్వాలేదంటూ వర్షంలోనూ ఏమాత్రం స్పీడు తగ్గకుండా వాహనాలు నడిపించడం, పక్కవారిపై బుదర చల్లడం కనిపిస్తే... జపాన్ దాన్ని తీవ్ర నేరంగా పరిగణించి భారీ జరిమానా విధిస్తుంది. వీటన్నింటికీ భిన్నంగా జార్జియాలోని మెరియట్టా నగరంలో కార్లలో వెళ్ళేవారు ఏమాత్రం ఉమ్మి వేయకూడదట. ఇది బాగానే ఉంది. పరిశుభ్రతకోసం ఈ పద్ధతి పాటిస్తున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడే ట్రాక్టర్లలో వెళ్ళేవారు మాత్రం ఉమ్మొచ్చు అన్న పద్ధతి కూడ అవలంబించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్విర్జర్లాండ్లో ఆదివారాలు కార్లు కడగకూడదన్న రూలు అమల్లో ఉంటే..డెనివర్ ప్రాంతంలో ఆదివారాలు నల్లకార్లు రోడ్డెక్క కూడదని, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కురుచ దుస్తులు వేసుకొని వాహనాలు కడగ కూడదని ఇలా వింత వింత నిబంధనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇండియాలో మద్యం సేవించి కారు నడపడం నేరం అయితే... కోస్తారికాలో మద్యం తాగుతూ కూడ వాహనం నడపొచ్చన్న విషయం నిజంగా వింతగానే కనిపిస్తుంది. ఇక ఇటలీలో మాత్రం కారునడిపేప్పుడు ముద్దు పెట్టుకోవడం నిషేధం. ఒకవేళ అటువంటి దృశ్యం పోలీసుల కంట పడిందో సుమారు ఏభై వేల రూపాయల వరకూ భారీ జరిమానా చెల్లించాల్సిందే. అలాగే కళ్ళకు గంతలు కట్టుకొని కార్టు నడిపినా ప్రమాదం లేదంటారు అమెరికా అలబామా వాసులు. మరి అటువంటప్పుడు ప్రమాదాలను ఎలా నివారిస్తారన్న విషయం వారికే తెలియాలి. ముఖ్యంగా సౌదీలో ఆడవార్లు కార్లు నడపకూడదన్న నిబంధన కనిపిస్తుంది. అది అతిక్రమిస్తే కఠిన శిక్షలను సైతం ఎదుర్కోవాల్సి రావడం కొంత బాధాకరంగా కూడ ఉంటుంది.