Welfare boarding schools
-
ఇంటికి టెన్త్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షలు వాయిదా పడటంతో సంక్షేమ శాఖల పరిధిలో వసతి పొందుతున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కోవిడ్ వ్యాప్తిని నిలువరించే క్రమంలో ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను వాయిదా వేసింది.మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశం తేల్చకపోవడంతో అప్పటివరకు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.దీంతో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి పొందుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. కేవలం సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులే కాకుండా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్ల విద్యార్థులు కూడా ఇదేవిధంగా వారి వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. జాగ్రత్తలు వహిస్తేనే మంచిది కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవగాహన, జాగ్రత్త చర్యలే మేలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఇళ్లకు వెళ్తున్న టెన్త్ విద్యార్థులకు సంబంధిత అధికారులు పలు సలహాలు, సూచనలు చేశారు.ఇప్పటికే వారికి హ్యాండ్ వాష్‌లు, మాస్కులను పంపిణీ చేయగా... వాటిని వెంట తీసుకెళ్లాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాలను పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు.ఈమేరకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచిక పత్రాలను వారికి ఇచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే పరీక్షలు జరిపే అవకాశం ఉండటంతో ఆమేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా సూచించారు. రిజిస్టర్లో విద్యార్థుల వివరాలు పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వివరాలను రికార్డు చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల వారీగా ఉన్న విద్యార్థులను సంబంధి త అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో నమో దు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లిన ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్లు, పూ ర్తి చిరునామాను అందులో రికార్డు చేస్తున్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసుకునేందుకు వీలుగా సంబంధిత పాఠశాల/హాస్టల్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఫోన్ నంబర్‌ను విద్యార్థులకు ఇస్తున్నారు. -
‘గురుకులాల్లో’ ప్రవేశాలకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7 తరగతులు, జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 16తో గడువు ముగుస్తుందని, 6, 7 తరగతులకు సంబంధించి ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు mjptbcwreis.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్సైట్లో ‘మోడల్ స్కూల్’ మెరిట్ జాబితా మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు గత నెల 26న పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ వెబ్సైట్లోకి (telanganams.cgg.gov.in) వెళ్లి పాఠశాలల వారీగా పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి ర్యాంకులను పొందవచ్చని వివరించారు. ఈ సమాచారాన్ని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్ల వద్ద కూడా పొందవచ్చని తెలిపారు. పాఠశాలల వారీగా ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలోనే ప్రిన్సిపాళ్లకు, డీఈవోలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ స్పాట్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ఇష్టానుసారం పేపర్లు దిద్ది ముందుగా వెళ్లిపోకుండా చర్యలు ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నెల 8న సంస్కృతం వంటి పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైనా, ఈ నెల 16 నుంచి ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ మూల్యాంకనంలో దాదాపు 25 వేల మంది లెక్చరర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. గతంలో మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే లెక్చరర్లు కొద్ది గంటల్లోనే తమకిచ్చిన 30 జవాబు పత్రాలను ఆదరాబాదరాగా మూల్యాంకనం చేసి నిర్ణీత సమయానికంటే ముందుగానే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అనేకమంది విద్యార్థులకు మార్కుల్లో తేడాలు వచ్చాయి. వేలమంది విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేయడంతో ఈ లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి లెక్చరర్లు తొందరగా పేపర్లు దిద్ది, ముందుగా వెళ్లిపోకుండా, నిర్ణీత సమయం వరకు ఉండేలా, నిదానంగా మూల్యాంకనం చేసేందుకు బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. -
ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: తమ గురుకులాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి(2016-17) ఆన్లైన్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూ జిల్లాల వారీగా రూపొందించే మెరిట్ జాబితాకు అనుగుణంగానే విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాలేజీలను కూడా మెరిట్ ఆధారంగానే కేటాయిస్తారని, ఇందుకు ఎలాంటి కౌన్సెలింగ్ ఉండదని స్పష్టంచేశారు. కేవలం ఆన్లైన్ దరఖాస్తులనే ఆమోదిస్తామని, విడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దీనికై ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును చేసుకోవాలని పేర్కొన్నారు.