Welfare hostels for students
-
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఏపీ సర్కారు వరం
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల పిల్లల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు విషయంలో ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా తమది మాటల వంటకం కాదని.. చేతల ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నిరూపించారు. ఈ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం జీఓ–8, 9 ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్లో కన్నా అధికంగా కేటాయింపు రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో డైట్ చార్జీలకు రూ.755 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.78 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. తాజాగా.. ఈ చార్జీలను పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.160 కోట్ల అదనపు భారం పడుతుంది. వీటిలో డైట్ చార్జీలకు రూ.112 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు ప్రభుత్వం అదనంగా కేటాయిస్తోంది. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్కారుకు వారిపట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో రాష్ట్రంలో 5.92 లక్షల మంది బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మేలు చేకూరుతుంది. బాబు బకాయిలు రూ.132 కోట్ల చెల్లింపు నిజానికి.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలను 2012లో పెంచారు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వాటిని పట్టించుకున్న నాధుడే లేడు. 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా, మొక్కుబడిగా 2018 జూన్ 5న డైట్ చార్జీలు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిని 2018 జూలై 1 నుంచి అమలులోకి తెచ్చారు. కానీ, వాటిని కూడా సక్రమంగా అమలుచేయలేదు. 2018 జూలై నుంచి 2019 ఫిబ్రవరి వరకు కేవలం ఎనిమిది నెలల కాలానికి మాత్రమే తూతూమంత్రంగా అమలుచేసింది. పైగా డైట్ చార్జీలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. దీంతో రూ.132 కోట్ల బకాయిలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది. చంద్రబాబు కోసమే ఈనాడు వంకర రాతలు వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర సంక్షేమ విద్యా సంస్థల్లోని బోర్డర్ల (విద్యార్థులు)కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని సర్కారు ఆమోదించే తరుణంలో చంద్రబాబు ప్రయోజనాల కోసం ‘మాటల వంటకం’ అంటూ ఈనాడు ఇటీవలే విషప్రచారం చేసింది. -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్‌లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
పైన్ రైస్
29 నాటికి అన్ని రేషన్ షాపులకు సరఫరా యుద్ధప్రాతిపదికన పనులు.. సెలవులు రద్దు ఎంఎల్ఎస్ పాయింట్లకు ప్రత్యేకాధికారుల నియామకం రేషన్‌కార్డు దారులు, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం హన్మకొండ అర్బన్: పేద ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వనుంది. రేషన్‌కార్డు దారులతోపాటు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇక నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆహార భద్రత కార్డులకు సంబంధించి జిల్లాలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించారు. వారికి సరిపడా కోటాను రేషన్ షాపులకు సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ నెల 29వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలని జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఆదేశించారు. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేం దుకు ప్రతి ఎంఎల్ఎస్ పాయిం ట్‌కు ఒక అధికారిని ఇన్చార్జ్గా నియమించారు. మొత్తం 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పంపిణీ ప్రక్రియ చేపట్టారు. 8 లక్షల కార్డులు జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 8 లక్షలకు పైగా రేషన్‌కార్డులు నమోదయ్యాయి. వీటిలో మొత్తం 26 లక్షల మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నట్లు అధికారు లు లెక్కించారు. పూర్తి స్థాయిలో లెక్కలు తేలితే ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆహార భద్రత కార్డులో ఎంత మంది ఉం టే అందరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం జనవరి నెల కోటాగా అందజేయనున్నారు. ఈ మొత్తం సుమారు 18వేల మొట్రిక్ టన్నులుగా గుర్తించారు. అరుుతే గత నెలలో పాత కార్డుల లెక్కల ప్రకారం జిల్లాలో 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని కార్డుదారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొత్త కార్డులు సంఖ్యా పరంగా కొంత తక్కువగా ఉన్నప్పటికీ... కోటా పెంచడంవల్ల మొత్తం సుమారు 6వేల మెట్రిక్ టన్నులు పెరిగింది. లెక్కలు పూర్తయితే కోటా మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు జనవరి నుంచి పూర్తి కోటా సన్నబి య్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ దిశగా కూడా పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్షేమ శాఖల అధికారులు అందజేసిన లెక్కల ప్రకారం 2,30,000 మంది విద్యార్థులకు అవసరమైన 2.77 వేల మొట్రిక్ టన్నుల బి య్యం సరఫరా చేయనున్నారు. సర్వేలో గుర్తించిన అంత్యోదయ కార్డుదారులకూ పూర్తిస్థారుులో బి య్యం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. 29 వరకు సెలవులు రద్దు పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బంది సెలవులను 29వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు డీఎస్ఓ ఉషారాణి తెలిపారు. స్థానిక అవసరాల మేరకు అదనంగా సిబ్బంది, వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా జిల్లాలోని 2,114 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులుగా ఆర్డీఓలు, డీఎం, డీఎస్ఓ ఇతర ఉన్నతాధికారులను నియమించారు. కొనసాగుతున్న నమోదు ప్రస్తుతం ఆహార భద్రత కార్డుల అర్హుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10.69 ల క్షల దరఖాస్తులు రాగా... క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం కొత్తకార్డుల జారీకి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు
-
ఇక్కడ క్షేమం లేదు
అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు మౌలిక వసతుల కరువు శిథిలావస్థలో భవనాలు విద్యార్థులకు అందని దుప్పట్లు, దుస్తులు జ్వరమొచ్చినా పట్టించుకునే వారుండరు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక... రోగ మొస్తే పట్టించుకునే వారు లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఎదురయ్యే సమస్యలను మౌనంగా భరిస్తూనే ఉన్నారు. వీరి దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్... - సాక్షి, సిటీబ్యూరో పిల్లి కూనల్లా చలికి వణుకుతూ ఒకరిపై ఒకరు... ఒకే దుప్పట్లో నలుగురైదుగురు విద్యార్థులు సర్దుకొని పడుకోవడం... పగిలిన కిటికీలు...తలుపుల సందుల్లోంచి ఇబ్బంది పెట్టే చలిగాలిని తట్టుకోలేక.... ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా నిద్ర లేకుండా గడపడం... స్నానాలకు గంటల తరబడి క్యూలో వేచి ఉండడం...ఇవేవో రైల్వే స్టేషన్లోనో...బస్సు కాంప్లెక్స్లలోనో కనిపించే దృశ్యాలు కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల కష్టాలు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లు 161 ఉన్నాయి. ఇందులో బాలుర 117, బాలికలవి 44 ఉన్నాయి. వీటిలో 15,652 మంది చదువుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 36 హాస్టళ్లలో 2,702 మంది చదువుతుండగా... రంగారెడ్డి జిల్లాలోని 125 హాస్టళ్లలో 12,950 మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల దుస్తులు (రెండు స్కూల్, రెండు జనరల్ డ్రెస్సులు) ఇవ్వాల్సి ఉండగా... కొన్ని హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేశారు. పాఠశాలలు తెరచి ఆరు నెలలు దాటుతున్నా ఇంతవరకూ దుస్తులు అందలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చలిలో వణుకుతున్నా అనేక చోట్ల ఇంకా దుప్పట్లు అందలేదు. ఒకటి, రెండు చోట్ల ఇచ్చినా నాణ్యత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి ప్లేట్లు, గ్లాసులు ఇవ్వాలన్న సంగతి అధికారులు మరచిపోయినట్లున్నారు. మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ఇక జంట జిల్లాల్లోని 83 కాలేజీ హాస్టళ్లలో 8,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 46 బాలురు, 37 బాలికలవి ఉన్నాయి. అధిక సంఖ్యలో హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉండడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.