యూపీపై ఇసుక తుపాను పంజా
27 మంది మృత్యువాత
లక్నో: రాజస్థాన్ నుంచి వీచిన పశ్చిమ గాలుల ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌పై గురువారం సాయంత్రం ఇసుక తుపాను విరుచుకుపడింది. పెను గాలులతో ప్రతాపం చూపుతూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, గుడిసెలను నేలమట్టం చేసింది. దీని దెబ్బకు యూపీవ్యాప్తంగా 27 మంది మృత్యువాతపడగా మరో 30 మంది గాయపడ్డారు. అత్యధికంగా ఫరూకాబాద్‌లో 10 మంది మృతిచెందగా బారాబంకీలో ఆరుగురు, రాజధాని లక్నో, సీతాపూర్‌లో ముగ్గురు చొప్పున, హర్దోయ్, జలౌన్‌లో ఇద్దరు చొప్పున, ఫైజాబాద్‌లో ఒకరు మృతిచెందారు.
కాగా, ‘ఎన్‌హెచ్ 10’ పేరిట తొలిసారి సొంత సినిమాలో నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఇసుక తుపాను బారినపడ్డారు. షూటింగ్ కోసం రాజస్థాన్‌లో వేసిన సెట్టింగ్ తుపాను తీవ్రతకు దెబ్బతిందని అనుష్క ‘ట్విట్టర్’లో తెలిపింది.తనతోపాటు యూనిట్‌లోని సభ్యులంతా మట్టికొట్టుకుపోయినా అందరం క్షేమంగా బయటపడ్డామంది.