Westminster
-
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది
లండన్: బహిరంగ మూత్ర విసర్జన ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న దురలవాటు. దీని కారణంగా పరిసరాలు దుర్గంధంతో నిండి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. లండన్ యంత్రాంగం దీనికి ఓ విరుగుడును కనిపెట్టింది. గోడలపై పోసే మూత్రం చింది తిరిగి వారిపైనే పడితే..? ఆ పాడు పనిని మానుకుంటారేమో. పారదర్శక వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే పోసిన వ్యక్తి పైకే మూత్రం చింది పడుతుంది. దుస్తులు తడిచిపోతాయి. వారికి ఇదే తగిన శిక్ష అవుతుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఇందుకోసం సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది. సోహోలో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతోపాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. సుమారు 0.6 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలోని సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. పబ్లిక్ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు (దిస్ వాల్ ఈజ్ నాట్ ఫర్ యూరినల్) అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే ప్రయోగాన్ని మరో ప్రాంతంతోపాటు జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి, మంచి ఫలితం సాధించారు. ఆరునెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని స్థానిక అధికారి ఒకరు చెప్పారు. -
వెస్ట్మిన్స్టర్ హాల్లోనే రాణి శవపేటిక ఎందుకంటే..
వెస్ట్మిన్స్టర్ హాల్ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్ కింగ్డమ్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. బ్రిటన్ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్‌లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్‌లో అత్యంత పురాతనమైన బిల్డింగ్ ఇది. ► అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. ► గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. ► 1910లో కింగ్ ఎడ్వర్డ్-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్మిన్స్టర్ హాల్లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ► ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్ ఎలిజబెత్(క్వీన్ ఎలిజబెత్-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉంచారు. ► ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు. ► థేమ్స్ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు. ► రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు. ► క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్మిన్స్టర్ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. ► అబే నుంచి సెయింట్ జార్జిస్ చాపెల్ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది. ► కింగ్ జార్జి- మెమోరియల్ చాపెల్ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి చెంతకు బ్రిటన్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. ► చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. సాయంత్రం శవపేటికను.. రాయల్ వాల్ట్‌లోకి దించుతారు. అక్కడ విండ్సర్ డీన్ కీర్తన ఉంటుంది. కాంటెర్బరీ ఆర్చిబిషప్ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. అయితే.. ఆపై విండ్సర్ డీన్ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. -
బ్రిటన్ రాణి శవపేటిక వద్ద ఊహించని ఘటన.. రాయల్ గార్డ్‌కి ఏమైంది!
బ్రిటన్ను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా. రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. రాణి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. ఇక, రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. ఇందులో భాగంగా రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలించారు. మంగళవారం అక్కడి నుంచి విమానంలో లండన్‌కు తీసుకొచ్చారు. https://t.co/OzckR639WV#RoyalGuard #Queen's #coffin #collapsed #QueenElizabethII #video #Westminster #Watch: Royal Guard collapses in front of Queen Elizabeth II's coffin at Westminster#viralvdoz #BreakingNews pic.twitter.com/97x7dCMHL5 — ViralVdoz (@viralvdoz) September 15, 2022 ఇదిలా ఉండగా.. వెస్ట్‌మినిస్టర్ హాల్లో క్వీన్స్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు. రాణి పార్థివదేహాన్ని సందర్శించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న రాయల్స్ బాడీగార్డ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు నిల్చున్న ఓ గార్డ్.. కిందపడిపోవడంలో అక్కడున్న ఇతర గార్డ్స్ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. కాగా, సదరు గార్డ్ నీరసంగా ఉన్న కారణంగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'Thousands have travelled from all corners of the UK and the world to pay their respects to the Queen.' GB News' Theo Chikomba reports as Queen Elizabeth II's coffin Lies-In-State in Westminster Hall, where she will remain until the morning of the funeral on Monday. pic.twitter.com/K5ypw5FD8B — GB News (@GBNEWS) September 15, 2022 -
వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు రాణి పార్థీవదేహం (ఫొటోలు)
-
‘పసిపిల్లలను పార్లమెంట్‌కు తీసుకురావద్దు’... బ్రిటన్‌లో దుమారం
లండన్: బ్రిటన్ పార్లమెంట్ లోకి పసిపిల్లలను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం అక్కడ తీవ్రమైన నిరసనకు దారితీసింది. పార్లమెంట్ లోకి చిన్నారులను తీసుకురావద్దంటూ ఓమహిళా ఎంపీకి ఈ మెయిల్స్ పంపారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే వీటిపై స్పందించిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ నియమాళికి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిచేసే తల్లులకు పిల్లల సంరక్షణ చూసుకునేలా వేసులుబాటు కల్పించాలంటూ చర్చ చేపట్టారు. వివాదం రాజుకుంది ఇలా.. వెస్ట్‌మినిస్టర్ హాల్లో మంగళవారం తన మూడు నెలల కొడుకుతో కలిసి ఎంపీ స్టెల్లా క్రీసీ పార్లమెంట్ చర్చలో పాల్గొన్నారు. చర్చకు హాజరైన తర్వాత బిడ్డను పార్లమెంట్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీకి పార్లమెంటు దిగువ సభ ప్రతినిధి చెప్పారు. మంగళవారం కాన్ఫరెన్స్‌లో బైనౌపే లేటర్ కన్స్యూమర్ క్రెడిట్ స్కీమ్‌ల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నఆమె పసికందును స్లింగ్లో ఛాతీకి కట్టుకుని హాజరయ్యారు. క్రీసీ చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్‌కు ఇలా పిల్లలను తీసుకురావడం సమస్య కాలేదని నిలదీసిన క్రీసీ... దీనిపై కామన్స్ అధికారుల నుంచి ఆమె వివరణ కోరింది. ఇదివరకు తన పిల్లలిద్దరినీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే హౌస్ ఆఫ్ కామన్స్లోకి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో షేర్ చేయడంతో నిరసన తనకు ఎదురైన అనుభవం గురించి క్రీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేను ఛాంబర్లో మాట్లాడేటప్పుడు నా 3 నెలల... నిద్రపోతున్న బిడ్డను తీసుకుపోకూడదని (ఇప్పటికీ పార్లమెంట్ లో మాస్క్‌లు ధరించాలనే నియమం లేదని విమర్శించారు ) నాకు నోటిసులు పంపారు’’ అని ఆమె ట్విట్టర్లో తనకు పంపిన లెటర్ ను షేర్ చేశారు. తనకు పార్లమెంట్ ప్రసూతి కవరేజ్ లేదని... అది కలిగి ఉండటానికి ఉపాధి హక్కులు లేవని ఎంపీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వివరించారు. పెద్ద ఎత్తున నిరసనలు... క్రీసీ లెటర్ ఆన్లైన్లో పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. ఈ విషయంపై అన్ని రంగాల్లోని మహిళలు నిరసనగళం వినిపించారు. తమ ఉద్యోగాలను సులభతరం చేయడానికి పార్లమెంట్ నిబంధనలను మార్చాలని పలువురు మహిళా చట్టసభ సభ్యులు కోరారు. ఎంపీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. పనిచేసే ప్రాంతానికి శిశువును తీసుకెళ్లాడనికి చాలా చోట్ల అనుమతించడం లేదని పలువురు మహిళలు వాపోయారు. తమ బిడ్డను వేరే వాళ్లకి అప్పగించి చూసుకోమని చెప్పడానికి ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వెలిబుచ్చారు. సోషల్ మీడియా ఆగ్రహం అనంతరం... ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం అనంతరం... తాము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తమ విధులను నిర్వహించగలగడం చాలా ముఖ్యం. సభ్యులు ఎప్పుడైనా ఛాంబర్లో లేదా వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉన్నప్పుడు తమ అవసరాల గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, క్లర్క్‌లు, డోర్కీపర్లతో సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి స్టెల్లా క్రీసీతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఇదేం కొత్త కాదు... శిశువులను పార్లమెంటుకు తీసుకురావడం ఇదేం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చట్టసభలకు తీసుకువెళ్లారు. అన్నెలీస్ డాడ్స్ తన బిడ్డను 2016లో యూరోపియన్ పార్లమెంట్‌కు తీసుకెళ్లడం నుంచి న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెర్న్ 2018లో మూడు నెలల కుమార్తెను యూఎన్ జీఏకి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించడం వరకు... చాలా మంది మహిళా చట్టసభ సభ్యులు గతంలో ఇలా చేశారు. -
పార్లమెంటులో వైట్ పౌడర్ కలకలం
లండన్ : బ్రిటన్ పార్లమెంటులో వైట్ పౌడర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు రెండు వైట్ పౌడర్‌తో ఉన్న లెటర్ ప్యాకెట్లను వెస్ట్‌మినిస్టర్ ఆఫీసులోకి పంపించారు. వాటిని తెరిచి చూడగా అందులో పౌడర్ ఉన్నట్లు తేలింది. రెండు లేఖల్లో పెట్టి దాన్ని పంపించారు. పలువురు బ్రిటన్ ఎంపీలు, వారీ ఆఫీసులు అక్కడే ఉండటంతో అధికారులు కంగారు పడ్డారు. ఆ పౌడర్‌ను పరీక్షించిన నిపుణులు ప్రమాదకరమైనది కాదని నిర్ధారించారు. అయితే, ఈ పౌడర్ పంపించడం వెనుక ఉగ్రవాద కోణం ఏదైనా ఉందేమోనని కౌంటర్ టెర్రరిజం కమాండ్ దర్యాప్తు ప్రారంభించాయి. గతంలో రష్యా గుఢాచారి కూడా ఇలాంటి పౌడర్‌లో విషం కలిపి ఉంచిన కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. 'వెస్ట్‌మినిస్టర్ కార్యాలయాల్లో నుంచి ఏ ఒక్కరినీ ఖాళీ చేయించడం లేదు. అయితే, ఆ పౌడర్ ప్రభావం చూపుతుందనుకున్న ప్రదేశం మేరకు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వివరాలు అందించలేం' అని పార్లమెంటరీ అధికారిక ప్రతినిధి చెప్పారు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తాము ఘటనా స్థలికి వెళ్లామని, ఓ మహిళను, వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లామని లండన్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది. -
వెస్ట్‌మినిస్టర్‌లో గిల్ట్ ట్యాక్స్!
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో అంతర్భాగమైన వెస్ట్‌మినిస్టర్ ప్రాంతంలో స్థానిక పన్నుల ఆదాయాన్ని పెంచేందుకు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లండన్‌లోనే కాక మొత్తం బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో వెస్ట్మినిస్టర్ఒకటి. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ అనే నగర పాలక సంస్థ కూడా ఉంది. ప్రజలందరూ సాధారణంగా కట్టే పన్నులకు అదనంగా సంపన్నులు స్వచ్ఛందంగా కూడా విరాళాలు ఇవ్వాలని వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఈ విరాళాలను అక్కడి మీడియా ‘గిల్ట్ ట్యాక్స్’ అని వ్యవహరిస్తోంది. గిల్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బును ఉద్యోగ కల్పన, రోడ్లపై నిద్రించేవారికి దుప్పట్లు ఇవ్వడం తదితర అవసరాలకు ఉపయోగిస్తామని వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ చెబుతోంది. కోటి పౌండ్లకు పైగా ఆస్తులు ఉన్న వారి నుంచి స్వచ్ఛందంగానే గిల్ట్ ట్యాక్స్‌ను వసూలు చేస్తామనీ, ఇందుకోసం 15 వేల మంది సంపన్నులకు లేఖలు రాస్తామంటోంది. -
25 ఏళ్లకే 1390 కోట్ల డాలర్లకు వారసుడు
లండన్: బ్రిటన్‌లో వెస్ట్‌మినిస్టర్ ఏడవ డ్యూక్‌గా 25 ఏళ్ల హగ్ రిచర్డ్ లూయీ గ్రాస్వెనర్ ఎంపికై పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి ఆరవ డ్యూక్ జెరాల్డ్ లావెండిష్ గ్రాస్వెనర్ (64) ఇటీవల మరణించడంతో తండ్రి నుంచి వారసత్వంగా ఆయనకు ఈ పదవి దక్కింది. బ్రిటన్ మహారాణి విక్టోరియా 1874లో ఈ పదవిని సృష్టించిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి గ్రాస్వెనర్ కుటుంబ సభ్యులే వంశపారంపర్యంగా ఈ పదవిని ఏలుతున్నారు. పాతికేళ్ల హగ్ రిచర్డ్‌కు తండ్రి మరణంతో వారసత్వంగా డ్యూక్ పదవీ బాధ్యతలతోపాటు 1390 కోట్ల డాలర్ల ఆస్తి సంక్రమించింది. దీంతో ఆయన బ్రిటన్‌లో మూడవ అతిపెద్ద సంపన్నుడిగా, ప్రపంచంలో 68 అతిపెద్ద సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. 2012లో జరిగిన ఆయన 21వ పుట్టిన రోజుకు 80 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారనే ప్రచారం ఉంది. న్యూకాజిల్ సిటీ యూనివర్శిటీలో కంట్రీసైడ్ మేనేజ్మెంట్ కోర్సు చదవిన హగ్ అనంతరం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో పీజీ చేశారు. తొలుత కుటుంబ ఎస్టేట్ వ్యవహారాలు చూసిన హగ్ మొన్నటి వరకు కుటుంబ కంపెనీల్లోనే అకౌంట్ మేనేజర్‌గా పనిచేశారు. హఠాత్తుగా 1390 కోట్ల డాలర్లకు యజమాని అయినందున హగ్ ఆదాయం పన్ను చెల్లిస్తారా, లేదా? అన్న అంశం గత కొన్ని రోజులుగా బ్రిటన్ పౌరుల్లో చర్చనీయాంశం అయింది. అయితే కుటుంబ ఎస్టేట్లు అన్నీ ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నందున ఎలాంటి ఆస్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని హగ్ కుటుంబ న్యాయవాదులు తెలియజేస్తున్నారు. చెషైర్‌లో పదివేల ఎకరాల ఎస్టేట్‌తోపాటు మేఫేర్, బెల్గ్రానియాలోని 300 ఎకరాలు ఇప్పుడు ఏడవ డ్యూక్ హగ్‌కు సంక్రమించాయి. ఆయనకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ట్రస్టీల నుంచి కొంత ఆస్తి పంపకాలు జరుగుతాయని కుటుంబ న్యాయవాదులు తెలిపారు. -
వింటేజ్ కార్లతో విహారం