wife role
-
పవన్ కల్యాణ్‌కు భార్యగా నిత్యా మీనన్!
వకీల్‌సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. మలయాళ సూపర్ హిట్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. మొదట సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నా తన డేట్స్ కుదరక పోవడంతో సెట్ కాలేదు. దీంతో మేకర్స్ నిత్యా మీనన్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. ఇప్పటికే పవన్ సినిమాలో నిత్య నటించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యా మీనన్ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఒక రకంగా ఈ సినిమా నిత్యామీనన్‌కు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు ఆమె ఇంత వరకు సంతకం చేయలేదు. ఇక ఇదే సినిమాలో మరో యంగ్ హీరో రానా నటిస్తుండగా, అతడికి జోడీగా కోలివుడ్ నటి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారు. ఇటవలె పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చదవండి : రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్ Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు -
మన్మోహన్ భార్య పాత్ర పోషించేది ఆమెనే..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయబారు రాసిన పుస్తక ఆధారంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజేన్, అనుపమ్ ఖేర్‌లు తమ పాత్రలను ధృవీకరిస్తూ, ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మన్మోహన్ సింగ్ భార్య పాత్రలో నటించేది ఎవరో కూడా తెలిసిపోయింది. మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు తెలిసింది. గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు ధృవీకరిస్తూ.. ఒక ఫోటోను అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఇద్దరు తమ తమ పాత్రకు తగ్గట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. అచ్చం మన్మోహన్, గుర్షరన్లా మాదిరిగానే కనిపిస్తున్నారు. ‘చాలా ప్రతిభావంతురాలైన దివ్యా సేథ్ షాను పరిచయం చేస్తున్నాం. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గుర్షరన్లా దివ్య నటించనుంది’’ అని అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మన్మోహన్ పాత్రకు సంబంధించిన పలు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ రత్నాకర్ గట్టే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒక దేశానికి నేతృత్వం వహించాలన్న కల సాకారం కావాలంటే అందుకు ఏళ్ల తరబడి రాజకీయ కృషి.. ప్రజాజీవితం.. ఇలా చాలానే కావాలి. కానీ.. అవేవీ లేకుండానే ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న కథే ఇది. -
నర్గిస్ పంట పండినట్టే...
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోయె.. కృతీ సనన్ వచ్చె.. కృతీ పోయె కరీనా కపూర్ వచ్చె.. ఇప్పుడు కరీనా కూడా పోయె.. అని బాలీవుడ్లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆంటోనీ డిసౌజా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేయనున్నారు. ఆయన మొదటి భార్య పాత్రకు ప్రాచీ దేశాయ్‌ని తీసుకున్నారు. రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్రకు పైన చెప్పిన తారలను అనుకున్నారు. చిత్రనిర్మాత ఏక్తా కపూర్ అయితే ఆ పాత్రను సంగీతా బిజ్లానీతోనే చేయించాలని భావిస్తున్నారట. సంగీత సినిమాలు చేసి, దాదాపు 20 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ చిత్రం ఒప్పుకుంటారా? అనే సందేహం కూడా ఆమెకు లేకపోలేదు. దాంతో రెండో భార్య పాత్రను నర్గిస్ ఫక్రితో చేయించాలని డిసైడ్ అయిపోయారట. అదే జరిగితే నర్గిస్ పంట పండినట్టే.