Wildlife protection law
-
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
అడవి పంది.. చంపాలంటే ఇబ్బంది!
రాష్ట్రంలో పెద్ద పులి ఒక వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా కొన్ని శరీరభాగాలను భక్షించడం కలకలాన్ని సృష్టించింది. ఆ పులిని గుర్తించి బంధించేందుకు అటవీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. పులి దాడి చేసి చంపిన అదే (కొమురం భీం ఆసిఫాబాద్) జిల్లాలోని అదే దహెగాం మండలం చిన్న ఐనం గ్రామంలో తన పొలం లో పనిచేసుకుంటున్న కె.జితేందర్ (33) అనే రైతుపై ఈ నెల 15న అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అతడు చనిపోయాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అడవి పందుల బెడద విపరీతంగా పెరిగింది. అడవుల పక్కనుండే పల్లెల్లోని ప్రజలు తమ ప్రాణాలను, పంటలను వీటి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఈ సమస్య పెరుగుతోంది. ఈ అంశంపై వ్యవసాయ, అటవీ శాఖలు దృష్టి సారించాయి. షెడ్యూల్–3 నుంచి మార్చితేనే.. రక్షిత జంతువుల జాబితాలో అడవి పందిని చేర్చడంతో ప్రభావిత ప్రాంతాల్లో వాటిని సంహరించేందుకు అటవీ చట్టాలు అడ్డొస్తున్నాయి. వీటిని చంపడం ఈ చట్టాల మేరకు నేరం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్–3లో ఉన్న అడవి పందిని షెడ్యూల్–5లోకి (వెర్మిన్లోకి చేర్చి తే) మార్చితే పరిమిత ప్రాంతాల్లో హతమార్చే అవకాశాలుంటాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో వీటి వల్ల ఏయే జిల్లాల్లోని ఏయే ప్రాంతా ల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది? ఇతరత్రా రైతులు, ప్రజ లకు ఎదురవుతున్న సమస్యలేమిటి అన్న దాని పై నివేదిక సిద్ధం చేసే పనిలో అటవీశాఖ నిమగ్నమైంది. (ఆ రెండిటి మధ్య అత్యంత అరుదైన పోరు) ఏమిటీ వెర్మిన్..? పంటలు, వ్యవసాయంలో సహాయపడే పశువులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులకు నష్టం కలుగజేసే.. ఆస్తులు, ఇతర ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధులు, రోగాల వ్యాప్తికి కారణమయ్యే జంతువులు, పక్షులను ‘వెర్మిన్’గా ప్రకటించవచ్చు. ఈ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే, పరిమిత కాలం పాటు వేటగాళ్ల సాయంతో వెర్మిన్లను వేటాడేందుకు అనుమతి లభిస్తుంది. గతంలో పలు రాష్ట్రాలు తగిన సమాచారం, పంటలు, ఇతరత్రా జరుగుతున్న నష్టంపై సమగ్ర వివరాలు పంపకుండానే కొన్ని రకాల జంతువులను ‘వెర్మిన్’గా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తులపై కేంద్రం ఆ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా చాలా సమయమే పడుతోం ది. ఈ నేపథ్యంలో అటు వ్యవసాయశాఖ, ఇటు అటవీశాఖ ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీ గా జరుగుతున్న నష్టంపై వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. (లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) ఈ నివేదిక సిద్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, సర్కార్ ఆమోదంతోనే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి అనుమతే కాకుండా రాష్ట్రప్రభుత్వ ఆమోదం మేరకు అడవి పందుల వల్ల అధిక నష్టం జరుగుతున్న ప్రాంతాల్లో, పరిమిత కాలానికి వీటిని వేటగాళ్లతో చంపించేందుకు అవకాశం కూడా ఉంది. ఈ వన్యప్రాణులు, పక్షులను ‘వెర్మిన్లు’గా ముద్రవేసి చంపడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. కూరమృగాలు, వన్యప్రాణుల నుంచి పంటల రక్షణ, రైతులపై ప్రాణాంతక దాడుల నివారణకు ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌లకు కొన్ని జంతువులను వెర్మిన్లో చేర్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతినిచ్చిం ది. ఈ రాష్ట్రాలతో పాటు గతంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రైవేట్ షూటర్లు, వేటగాళ్లతో కొన్ని జంతువులను చంపేందుకు అనుమతినిచ్చాయి. వివరాలు రాగానే నివేదిక.. అడవి పందులను తాత్కాలికంగా వెర్మిన్ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.. అయితే దానికి కేంద్రం అనుమతి కావాలి. రాష్ట్రంలో అడవి పందుల సమస్యలపై కొన్ని జిల్లాల ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి నివేదికలొచ్చాయి. పూర్తి వివరాలు, సమాచారం వచ్చాక ఓ నిర్ణయం తీసుకుంటాం.. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కూడా నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.– అటవీశాఖ వైల్డ్‌లైఫ్ విభాగం ఓఎస్డీ శంకరన్ -
అటవీ సంరక్షణలో బిష్ణోయ్ ఆదర్శం
1972 వన్యమృగ సంరక్షణకు చట్టం అమల్లోకి వచ్చింది. అభయారణ్యాలలోకి అడుగు పెట్టడం, వన్యమృగాల వేట చట్టవిరుద్ధమైంది. అయినా ఈ చట్టం మాఫియాను ఆపలేకపోయింది. అటవీ అధికా రులకు ఆయుధాలిచ్చినా వేట మాత్రం ఆగలేదు. కొన్ని ముఠాలు అక్రమంగా వనంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడటం వలన కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. అంతెందుకు ఆదిలాబాద్ జిల్లాలో 2012లో కవ్వాల్ అభయార ణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన తరువాత కూడా వేట ఆగలేదు. మహారాష్ట్ర నుంచి వేటగాళ్లు తుపాకులతో పులులను వేటాడారు. అదే జిల్లా వెంచపల్లి జింకల అభయారణ్యంలో 1980లో వందల సంఖ్యలో కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడక్కడ పదంటే పది కృష్ణ జింకలు కూడా కన్పించవు. సంపన్న కుటుంబాల్లో వేట ఒక వినోదం. సల్మాన్ ఖాన్ వేట అటువంటిదే. రాజస్తాన్‌లో కంకణీ గ్రామంలో రెండు కృష్ణజింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ అక్కడి బిష్ణోయ్ తెగ యువకుల కంటపడ్డారు. తుపాకీ కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమైన యువకులు వాహనం వెంట పడి వివరాలు సేక రించి, ఫిర్యాదు చేశారు. సంపన్న వర్గాలు, పలుకు బడి వర్గాలు ఒక్కటైనా బిష్ణోయ్ యువకులు చివరి వరకు నిలబడి కేసు గెలిచారు. పులుల సంరక్షణ అనే కుట్రతో పాలకులు, పారి శ్రామిక వర్గాలు సంయుక్తంగా చెంచు, ఆదివాసి, ఆటవిక తెగలను అడవినుంచి వెళ్లగొట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆదివాసీలు అడవిలో అంతర్భాగమే. అడ విని అక్కడి జంతువులను, పక్షులను ఆదివాసీ గిరిజనులను వేరుగా చూడలేం. అటవీ ఆవరణ అంతస్థులో ఒక్కొక్క జాతిది ఒక్కో అంతస్థు. ఏ ఒక్క అంతస్థు దెబ్బతిన్నా... పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అడవిలో సాయంత్రం ఐదుగంటలకే చీకటి తెరలు కమ్ముకుం టాయి. చీకటి పడక ముందే గుడిసెలకు చేరు కుంటారు. సరిగ్గా ఈ సమయంలో అడవిలో జీవ రాశులు బయటికి వస్తాయి. ఆహార ఆన్వేషణ పూర్తి చేసుకొని సూర్యోదయం వేళకు తావుకు చేరుకుం టాయి. సూర్యోదయం తరువాతే ఆదివాసీ దిన చర్య మొదలవుతుంది. ఆదివాసుల జీవన చర్యలు జీవ రాశుల జీవన విధానంపై జోక్యం చేసుకోవు. ప్రకృతే ఆదివాసీలకు, అటవీ జంతువులకు మధ్య అలాంటి సర్దుబాటు చేసింది. కానీ, అభయారణ్యాల్లోంచి ఆదివాసులను బయటకు పంపడం అన్యాయం. ‘చెంచులపై పరిశోధనకు వెళ్లి రాత్రి వేళ కుమ్మనిపెంటలోని అర్తి అంజన్న గుడిసెలో నిద్ర పోతుంటే ఏగిళ్లుబారే వేళ నిద్ర లేపి గుడిసెనుక నుంచి పోతున్న పులిని పిల్లిని చూపినట్టు చూపాడు’ అని ‘మరణం అంచున’ పుస్తకంలో రచయిత తన అనుభవాన్ని చెప్పారు. నిజానికి నల్లమలలో చెంచులు, పులులు కలిసే జీవనం చేస్తారు. వందల ఏళ్లుగా ఈ తంతు అలానే సాగుతోంది. ఇప్పుడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు చెంచు జాతులను అడవి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక నూతన ఆర్థిక విధానాల పర్యవసానం, అటవీ వన రులు, ఖనిజసంపద మీద పెట్టుబడి దారుల కన్ను, దానికి ఏ మిన హాయింపు లేకుండా కేంద్ర ప్రభుత్వాల దన్ను ఉండి ఉండవచ్చు. ఆటమిక్ మిన రల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చేసిన ఏరియల్ సర్వేలో నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, బంగారంతో పాటు 24 రకాల ఖనిజాలు ఉన్నాయని, వీటిలో వజ్రాలు, బంగారం, గ్రానైట్ వెలికితీత లాభదాయకంగా ఉంటుందని నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధా రంగానే దక్షిణాఫ్రికాకు చెందిన డిబీర్స్ అనే మల్టీ నేషనల్ వజ్రాల కంపెనీకి నల్లమలలో వజ్రాల అన్వేషణకు 2009 నవంబర్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచే చెంచుల తరలింపు ముమ్మరం అయింది. అడవిని నాశనం చేసి, వన్య ప్రాణులను (ఆదివాసులతో సహా) సంహ రించి ఖనిజాల సంపదను దోచుకొనిపోయే విస్తాపన నుంచి అడవిని, చెంచు, ఆదివాసులను రాజస్తాన్‌లోని బిష్ణోయ్ తెగ యువత స్ఫూర్తితో కాపాడు కుందాం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ మొబైల్ : 94403 80141 -
మహదేవపూర్ అడవుల్లో జింకల వేట
⇒ వేటగాళ్లను వెంటాడిన అటవీ అధికారులు ⇒ తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పరార్ మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెండు జింకలను చంపేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అటవీ శాఖాధికారులు వేటగా ళ్లను వెంబడించి రెండు జింకల మృతదేహాలతోపాటు ఒక ఇండికా కారును స్వాధీ నం చేసుకున్నారు. అటవీ అధికారులను వేటగాళ్లు తుపాకీతో బెదిరించి తప్పించుకుపోయారు. వారు వదిలివెళ్లిన (ఏపీ13 ఏఈ 2752) ఇండికా కారులో ఫజల్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఫొటోలు, ఆధార్‌కార్డు, మరో యువకుడి ఫొటోతో పాటు జంగిల్ నైఫ్ తదితరాలు లభించినట్లు మహదేవపూర్ రేంజర్ రమేశ్ వెల్లడించారు. మహదేవపూర్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడినట్లు ఆదివారం రాత్రి జిల్లా అటవీ అధికారులకు సమాచారం అందడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పలిమెల రేంజ్ అధికారి నర్సింహమూర్తి, మహదేవపూర్ రేంజ్ అధికారి రమేశ్‌లను అప్రమత్తం చేశారు. వేటగాళ్ల వాహనాన్ని లెంకలగడ్డ అడవిలో ఫారెస్ట్ అధికారులు నిలువరించే ప్రయత్నం చేయగా వారు ఆపకుండా దూసుకుపోయారు. దీంతో అంబట్పల్లి పొలిమేరల్లో మాటు వేసి వాహనాన్ని అడ్డుగా పెట్టారు. అయినా వేటగాళ్లు ఆగకుండా రేంజర్ వాహనాన్ని ఢీకొట్టి అంబట్‌పల్లిలోని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి పశువుల కొట్టంలోకి తీసుకెళ్లారు. టైర్ల అచ్చుల ఆనవాల్లతో ఆ పశువుల కొట్టం వద్దకు అటవీ అధికారులు వెళ్లగా.. ఒక వేటగాడు రేంజర్‌పై తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామని బెదిరించాడు. ఆ వెంటనే వారు పారిపోయారు. ఇంతలో అంబట్పల్లికి చేరుకున్న అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కారును, జింకలతో సహా వదిలి వేయాలని, కేసు నమోదు చేయొద్దని రేంజర్ రమేశ్‌పై ఒత్తిడి తెచ్చి నట్టు తెలిసింది. దానికి అంగీకరించని ఆయన.. సర్పంచ్, గ్రామపెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి వాహనాన్ని మహదేవపూర్‌లోని ప్రభుత్వ కలప డిపోకు తరలించారు. పశువైధ్యాధికారి మల్లేశం పోస్ట్‌మార్టం నిర్వహించి కాల్చి చంపినట్లు నిర్ధారించారు. కాగా, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి మంథని కోర్టులో నివేదించామని, జడ్జి ఆదేశాల మేరకు జింకల కళేబరాలను దహనం చేశామని రేంజర్ రమేశ్ తెలిపారు.