Wimbledon tennis tournament
-
Wimbledon 2022: నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
ఈసారి వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) నేడు జరిగే ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు. వీరిద్దరికిదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Wimbledon: బార్టీ క్వీన్...
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్‌కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్‌ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్‌గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. తొలి సెట్లో రెండో గేమ్‌లో, నాలుగో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్‌లో ఆమె బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ నెట్‌కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు. –బార్టీ -
తుదిపోరుకు బార్టీ, ప్లిస్కోవా
లండన్: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల ప్రపంచ నంబర్‌వన్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ, చెక్ రిపబ్లిక్ తార కరోలినా ప్లిస్కోవా తుది పోరుకు అర్హత సాధించారు. వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరడం వీరిద్దరికీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈసారి సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైం ది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా 5–7, 6–4, 6–4తో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై గెలుపొందగా... టాప్‌సీడ్ బార్టీ 6–3, 7–6 (7/3)తో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై గెలిచింది. ఏస్‌ల వర్షం... ప్లిస్కోవా, సబలెంకా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏస్‌ల వర్షం కురిసింది. మొత్తం 31 ఏస్‌లు నమోదవ్వగా... అందులో సబలెంకా 18, ప్లిస్కోవా 13 సంధించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ హోరాహోరీగా సాగింది. 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సబలెంకా... ఆ తర్వాతి గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో సబలెంకా అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లను చేజార్చుకుంది. ఇదే అదనుగా ఐదో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్లిస్కోవా అదే దూకుడుతో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లిస్కోవా ఫైనల్‌కు చేరుకుంది. వారెవ్వా... బార్టీ మరో సెమీస్‌లో టాప్‌సీడ్ బార్టీ మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. తొలి సెట్‌ను ఆమె 6–3తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో కెర్బర్ గట్టిపోటీ ఇవ్వడంతో బార్టీ శ్రమించక తప్పలేదు. రెండో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలుపుకొని 5–2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి బార్టీ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి పనిపట్టింది. వరుసగా మూడు గేమ్‌లను కైవసం చేసుకుని 5–5 వద్ద రెండో సెట్‌ను సమం చేసింది. అనంతరం ఇరువురు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఏకపక్షంగా సాగిన ‘టై బ్రేక్’లో బార్టీ చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధించి 6–0 ఆధిక్యంలో నిలిచింది. బార్టీ మూడు అనవసర తప్పిదాలతో ఆధిక్యం 6–3కు తగ్గినా గెలిచేందకు ఎంతోసేపు పట్టలేదు. -
ఆట కోసం బ్రెస్ట్ తీయించుకుంది!
వింబుల్డన్ టైటిల్ గెలిచి సిమోనా హలెప్ చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు వెనుక ఆమె 23 ఏళ్ల కష్టం ఉంది. ఎవరు చేయని త్యాగం ఉంది. అంతకు మించి వాళ్ల అమ్మ కలను నెరవేర్చాలనే బలమైన కోరిక ఉంది. ఇవే హలెప్‌కు సెరెనా విలియమ్స్లాంటి కొండను ఢీకొట్టే ధైర్యాన్నిచ్చింది. ఏడుసార్లు చాంపియన్.. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేతను మట్టికరిపించేలా చేసింది. కేవలం ఫైనల్‌కు చేరడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఈ రొమేనియా స్టార్ ఏకంగా టైటిల్‌నే సొంతం చేసుకుంది. నాలుగేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టుకున్న హలెప్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె తండ్రి హలెప్‌ను ‘లిటిల్ రొలెక్స్’ అని ముద్దుగా పిలిచేవాడు. ఆట కోసం 16 ఏళ్లకే ఇళ్లును వదిలిన ఆమె నిరంతారయంగా శ్రమించింది. ఎవరూ చేయని త్యాగం.. తనకిష్టమైన ఆటకోసం హలెప్ ఎవరూ చేయని త్యాగం చేసింది. తన ఆటకు ఇబ్బంది కలుగుతుందని సర్జరీ ద్వారా బ్రెస్ట్‌నే తీయించుకుంది. తన 34DD చాతి భాగంతో తన కల నెరవేరదని భావించిన ఆమె బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీతో 34C సైజుకు తగ్గించుకుంది. 2009లో ఈసర్జరీ జరగ్గా.. అప్పటికి ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. టెన్నిస్ కోసమే ఈ పని చేసానని, అదే ఈ రోజు తనని అగ్రస్థానంలో నిలబెట్టిందని సర్జరీ గురించి ఇటీవల పేర్కొంది. అయితే ఇదేదో పెద్ద త్యాగం అనుకోవడం లేదని తెలిపింది. ఆటపై ఉన్న మక్కువనే అలా చేయించిందని స్పష్టం చేసింది. వరుస ఓటములు.. గ్రాండ్‌స్లామ్ అందుకోవడానికి హలెప్ చాలా కష్టపడింది. పలుసార్లు అడుగు దూరంలో టైటిల్ దూరమైనా ఏ మాత్రం నిరాశకు లోనవ్వలేదు. పోయినచోటే వెతుక్కోవాలని పోరాడింది. హలెప్‌కు 2014లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకునే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఒపెన్ ఫైనల్లో మారియా షరపోవా (రష్యా) చేతిలో హలెప్ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2017 వరకు హలెప్‌కు ఫైనల్ చేరే అవకాశం రాలేదు. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో లాట్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకో(20) చేతిలో హలెప్ ఖంగుతిన్నది. టైటిల్‌తో పాటు ప్రపంచ నెం1 ర్యాంకు కోల్పోయింది. 2018లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకి చేతిలో పరాజయం పాలైంది. ‘ఫ్రెంచ్’ కోటలో.. చివరకు ఫ్రెంచ్ కోటలోనే హలెప్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజాగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మా అమ్మ కోరిక.. వింబుల్డన్ ఫైనల్ ఆడాలనేది తన తల్లి కోరికని, అది ఈ రోజు నెరవేరిందని విజయానంతరం హలెప్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను.’ అని హలెప్ పట్టారని సంతోషంతో పరవశించిపోయింది. చదవండి : హై హై... హలెప్ -
హై హై... హలెప్
ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి చేజార్చుకుంది. సహజశైలిలో, స్థాయికి తగ్గట్టు ఆడితే విజయం ఖాయమనుకున్న చోట ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో సెరెనాతో ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే నెగ్గిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ వింబుల్డన్ వేదికపై తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాపై కేవలం 56 నిమిషాల్లో అదీ నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగురవేసిన హలెప్ కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. లండన్: మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన సెరెనా విలియమ్స్‌కు మళ్లీ ఆశాభంగమైంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా స్టార్ మరో టైటిల్‌తో మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలని ప్రయత్నించి విఫలమైంది. గత ఏడాది వింబుల్డన్‌లో, యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న సెరెనా ఈ యేడు కూడా వింబుల్డన్ ఫైనల్లో ఓటమి రుచి చూసింది. గత సంవత్సరం తుది పోరులోఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) షాక్ ఇవ్వగా... ఈసారి సిమోనా హలెప్ (రొమేనియా) ఆ పని చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ.10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే దూకుడు... గతంలో 37 ఏళ్ల సెరెనాపై ఒక్కసారి మాత్రమే నెగ్గిన 27 ఏళ్ల హలెప్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో, మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ తన సర్వీస్‌లను కాపాడుకొని 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన హలెప్ తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సెరెనా పుంజుకుంటుందని ఆశించినా హలెప్ జోరు ముందు ఆమె తేలిపోయింది. ఐదో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ ఎనిమిదో గేమ్‌లోనూ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను. – సిమోనా హలెప్ -
తుది పోరుకు ‘సై’రెనా
లండన్ : టెన్నిస్ దిగ్గజ మహిళా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్(ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డుకు అడుగు దూరంలో సెరెనా విలియమ్స్ నిలిచింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ 11వ సారి ఫైనల్ చేరింది. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 11వ సీడ్ సెరెనా 6–1, 6–2తో అన్‌సీడెడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి హలెప్‌తో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో రుమేనియా తార 7వ సీడ్ హలెప్ 6–1, 6–3తో 8వ సీడ్ స్వితోలినా(ఉక్రెయిన్)పై వరుస సెట్లల్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఫోర్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించి.. హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆడింది. తనదైన ఫోర్ హ్యాం డ్ షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. సెరెనా ఫోర్ హ్యాండ్ షాట్లకు స్ట్రికోవా దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో మొదటి సెట్‌ను 27 నిమిషాల్లో, రెండో సెట్‌ను 22 నిమిషాల్లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో సెరెనా 28 విన్నర్లను, 4 ఏస్‌లను కొట్టగా.. స్ట్రికోవా కేవలం 8 విన్నర్లను, ఒక ఏస్‌ను మాత్రమే కొట్టింది. తొలిసారి.. 2018 ఫ్రెంచ్ ఓపెన్ విజేత హలెప్ తన కెరీర్లోనే తొలిసారిగా వింబుల్డన్ మహిళల విభాగంలో ఫైనల్ చేరింది. టోర్నీ మొత్తం అంచనాలకు మించి రాణించిన ఉక్రెయిన్ భామ స్వితోలినా మాత్రం తన కెరీర్లో ఆడుతున్న తొలి సెమీస్‌లో తడబడింది. మ్యాచ్ ఆసాంతం క్రాస్ కోర్టు, డౌన్ ద లైన్ షాట్లతో ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తించిన హలెప్ 73 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన హలెప్ 26 విన్నర్లను కొట్టగా.. స్వితోలినా ఒక సారి మాత్రమే బ్రేక్ చేసి కేవలం 10 విన్నర్లను కొట్టింది. ఫైనల్‌కు చేరే క్రమంలో హలెప్ కేవలం ఒకే ఒక్క సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోవడం విశేషం. నేటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ జొకోవిచ్ X బాటిస్టా ఫెడరర్ఠ్ X నాదల్ సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని పెంచారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 22 లక్షల పౌండ్ల చొప్పున (రూ. 18 కోట్ల 23 లక్షల 42 వేలు) అందజేస్తారు. గతేడాది సింగిల్స్ చాంపియన్స్‌కు 20 లక్షల పౌండ్లు చొప్పున ఇచ్చారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి విజేతలకు 2 లక్షల పౌండ్లు పెంచినట్లు బుధవారం ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. తొలి రౌండ్లో ఓడిన వారికి 35 వేల పౌండ్లు (రూ. 29 లక్షలు) లభిస్తాయి. గత ఆరు సంవత్సరాల్లో సింగిల్స్ విజేత ప్రైజ్‌మనీ రెట్టింపు కావడం గమనార్హం. 2011లో 1.1మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా ఈ ఏడాది టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 12.5 శాతం పెరిగి 31.6మిలియన్ పౌండ్లకు చేరుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. మరోవైపు మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గర్భస్థ శిశువుపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన రొమేనియా జట్టు కోచ్ ఇలీ నస్టాసేను ఈసారి రాయల్ బాక్స్‌లోకి ఆహ్వానించడంలేదని నిర్వాహకులు ప్రకటించారు. -
వింబుల్డన్‌లో ఫిక్సింగ్ కలకలం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఈ ఏడాది ఒక మ్యాచ్ ఫిక్స్ అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ది టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ (టీఐయూ) దీనిపై విచారణ జరుపుతున్నట్టు ప్రకటించింది. -
ఇవనోవిచ్‌కు షాక్
తొలి రౌండ్లోనే ఓడిన మాజీ నంబర్‌వన్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: పూర్వ వైభవం కోసం తపిస్తున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి అనా ఇవనోవిచ్‌కు సీజన్‌లోని మూడో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ కూడా కలసిరాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో మూడో రౌండ్లో నిష్ర్కమించిన ఈ సెర్బియా బ్యూటీ వింబుల్డన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 23వ సీడ్ ఇవనోవిచ్ 2-6, 5-7తో క్వాలిఫయర్, ప్రపంచ 223వ ర్యాంకర్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అలెగ్జాండ్రోవా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అయితే తొలి సెట్లో, రెండో సెట్లో ఇవనోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున బ్రేక్ చేసి అలెగ్జాండ్రోవా ఫలితాన్ని శాసించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-2, 5-7, 6-4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో సీడెడ్ క్రీడాకారిణులు వీనస్ విలియమ్స్, మాడిసన్ కీస్, సమంతా స్టోసుర్, సారా ఎరాని తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6-0, 7-6 (7/3), 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-4, 6-3, 7-5తో గ్రోత్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 7-6 (7/4), 6-2, 6-4తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 7-5, 6-3తో బాకెర్ (అమెరికా)పై, 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-2, 6-3, 6-2తో అలెగ్జాండర్ వార్డ్ (బ్రిటన్)పై, 13వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై గెలిచారు. -
వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు టాప్ సీడింగ్
లండన్: అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై కన్నేసిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఈనెల 27 నుంచి జూలై 10 వరకు జరిగే ఈ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించి సీడింగ్స్ వివరాలను బుధవారం ప్రకటించారు. మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)కు రెండో సీడింగ్‌ను కేటాయించారు. ఫలితంగా ఈ ఇద్దరు ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశముంది. ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు మూడో సీడ్ దక్కగా... వావ్రింకా (స్విట్జర్లాండ్)కు నాలుగో సీడ్ లభించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)కు టాప్ సీడింగ్ దక్కగా... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు రెండో సీడ్‌ను కేటాయించారు.