Winter Assembly session
-
ఇది మనసున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి ► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో.. ► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. ► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర ► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. ► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు ► ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం. ► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం. ► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం. పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే ► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. ► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. ► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. ► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాం. దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే. -
పట్టిసీమ ప్రాజెక్ట్ ఎలా వచ్చేది? : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న(1995-2004) సమయంలో పోలవరం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ఎగువున ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తును పెంచుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2004లో దివంగత నేత వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే.. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయని సభలో పేర్కొన్నారు. (చదవండి : లాభాల్లో బోనస్ మహిళలకే: సీఎం జగన్) ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులన్నీ వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని తెలిపారు. వైఎస్సార్ హయాంలో కుడి కాల్వ పూర్తికాకపోతే పట్టిసీమ ప్రాజెక్టు ఎలా వచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయాన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అన్నారని గుర్తిచేశారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ చేస్తే రూ.1343 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని సభలో సీఎం జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రభస మూడో రోజు కూడా కొనసాగింది. సీఎం జగన్ ప్రసంగానికి అడ్డుపడుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పోలవరం గురించి మాట్లాడితే ఎక్కడ నిజాలు భయటపడతాయోననే భయంతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తొమ్మిది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, రవికుమార్, బాలవీరాంజనేయులు, జోగేశ్వరరావు,రామకృష్ణబాబు, అశోక్, అనగాని సత్యప్రసాద్, వై.సాంబశివరావు ఉన్నారు. -
ఒక్క అడుగు కూడా ఎత్తు తగ్గించం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం సభను స్పీకర్ తమ్మినేని సీతారాం రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించమని సీఎం స్పష్టం చేశారు. దివంగత నే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామని తెలిపారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపకూడదని తపన ఉందని, పోలవరం నిర్మాణంలో ఆర్‌అండ్‌ఆర్‌పైన ప్రత్యేక దృష్టి పెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభాముఖంగా తెలిపారు. 9మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వరుసగా మూడో రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తన నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకు రావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం...తొమ్మిదిమంది టీడీపీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన వారితో పాటు చంద్రబాబు నాయుడుతో సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్లిపోయారు. ఏపీ జీవనాడి పోలవరం: బుగ్గన ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పట్టిసీమను తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. పోలవరంలో భాగం అయిన పట్టిసీమ కోసం అదనంగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తాం: మంత్రి అనిల్ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వాపోయారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశామన్నారు. పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై రాష్ట్ర తరపున వాదనలు వినిపించామని వెల్లడించారు. పోలవరాన్ని వైఎస్సార్ ప్రారంభిస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నారని చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహానిస్తామన్నారు. కీలక బిల్లులు ఆమోదం ఏపీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ థర్డ్ అమైన్‌మెంట్‌ను బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. యానిమల్ ఫీడ్, క్వాలిటీ కంట్రోల్ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. మంత్రి సీదిరి అప్పలరాజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ స్టేట్ డెపలప్మెంట్ కార్పొరేషన్, వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల మార్పిడి) సవరణ బిల్లు-2020 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ (కన్వర్షన్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్) అమెండ్మెంట్ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. చారిత్రక బిల్లు: కన్నబాబు అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రక బిల్లు అని, రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. దేశానికి వెన్నముఖగా నిలిచిన వ్యవసాయ రంగానికి కౌనిల్స్ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి వారధిగా అగ్రికల్చర్ కౌన్సిల్ ఉంటుందన్నారు.అగ్రికల్చర్ కౌన్సిల్ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. వ్యవసాయ పట్టభద్రులను ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అనుమతిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామనితెలిపారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంది: కాపు ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లు చదవకుండా ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు పగటిపూట నాణ్యమైన కరెంట్ ఇవ్వాలంటే సౌర విద్యుత్ తప్పనిసరి అన్నారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి, రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీపీ నాయకులు కుట్రపూరితంగా మంచి పనులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. అందుకే ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు: బుగ్గన నాణ్యమైన విద్యుత్‌తోపాటు 24 గంటల కరెంట్ కోసమే ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. చంద్రబాబు విద్యుత్ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని, రెండు రూపాయలకు విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. 4 వేల మెగావాట్లకు తాము యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకున్నామని వెల్లడించారు. సౌర విద్యుత్‌ను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. ఈ బిల్లుతో పేదలకు మేలు జరుగుతుందని, భూమిని స్వచ్ఛందంగా లీజుకిచ్చేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. లీజుకిచ్చిన ఎకరం భూమికి రూ.25 వేలు ఇస్తామన్నారు. పేదలకు మంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. అయితే బుగ్గన చెప్పివన్నీ అవాస్తవాలని అచ్చెన్నాయుడు అన్నారు. మంచి నిర్ణయం: ధర్మశ్రీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడు సీఎం జగన్ 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లులో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఈ బిల్లును సమర్థించాలని కోరారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో11 బిల్లులు చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ సంక్షేమ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు. -
శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వీరంగం సృష్టించారు. పంచాయతీరాజ్ సవరణ చట్టంపై చర్చ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. చూసుకుందాం రా అంటూ హెడ్‌ఫోన్ విసిరేసి మంత్రి వెల్లంపల్లి వైపు దూసుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రాజేంద్రప్రసాద్‌ని అడ్డుకున్నారు. కాగా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీరును వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. -
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
► ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడి వేడిగా జరిగాయి. పలు ప్రభుత్వ పథకాలు, బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశాలను రేపటికి(బుధవారం)వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నవరత్నాలు, పేదలకు ఇళ్లపై చర్చ ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఆంజనేయులు అనుచరుడు..పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులో కేసు వేశారు: సీఎం జగన్ మైనింగ్ జరగకపోయినా మైనింగ్‌కు కేటాయించిన భూములని పిటిషన్ వేశారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవే భూమూల్లో ఐఐటీ పెట్టాలని అడిగారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మాత్రం కుట్రపూరితంగా కోర్టులకు వెళ్తున్నారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు సతీష్ కూడా కోర్టుకెళ్లారు కాకినాడలో పేదలకు ఇవ్వాలనుకున్న స్థలాల పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.. మడ అడవులు లేకుండానే ఉన్నట్టుగా కోర్టులో పిటిషన్ వేశారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కోర్టు కెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు అనంతపురం జిల్లాలో పరిటాల సునీత అనుచరులు కోర్టుకెళ్లారు కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి పీఏ మురళి కోర్టుకెళ్లారు.. 3,65,680 ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు కోర్టు స్టేలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం గతంలో 220 ఎస్ఎఫ్టి ఇళ్లు ఇచ్చేవారు..ఇప్పుడు 340 ఎస్ఎఫ్టి ఇళ్లు ఇవ్వబోతున్నాం తొలిదశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం రూ.28,084 కోట్లతో తొలిదశ ఇళ్ల నిర్మాణం టిడ్కో ఇళ్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది రూ.10,484 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడుతుంది ►టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులను తీసుకెళ్లేందకు వచ్చిన మార్షల్స్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ►చంద్రబాబును అర్జంటుగా పిచ్చాస్పత్రిలో చేర్పించాలి. ఆయన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు హానికరం. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు లభించదు - సీఎం జగన్ ►సభను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ను చంద్రబాబు నాయుడు అవమానించారు. స్పీకర్ వైపు వేలు చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. సభాధ్యక్షుడినే బెదిరాస్తారా అని చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాట్లాడే పద్దతి నేర్చుకోవాలని హితవు పలికారు. నవరత్నాలు, పేదలకు ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో చర్చ 30,66,818 మంది లబ్ధిదారులను గుర్తించాం: మంత్రి రంగనాథరాజు రూ.23,500 కోట్ల విలువైన 68,677.83 ఎకరాలను పంపిణీకి సిద్ధం చేశాం.. 25,433.33 ఎకరాల ప్రభుత్వ భూమి, 25,359.31 ఎకరాల ప్రైవేట్ భూమి.. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఒకటిన్నర సెంటు, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను సమకూర్చేందుకు 17,500 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశాం.. 2024 నాటికి 30.90లక్షల గృహాలు చేపట్టాలని నిర్ణయించాం: మంత్రి రంగనాథరాజు గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో 28.38లక్షల గృహాలు.. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో 2.6లక్షల గృహాల నిర్మాణం: మంత్రి రంగనాథరాజు రూ.28,084 కోట్లతో తొలి దశలో 15.60లక్షల గృహాల నిర్మాణం రూ.22,860 కోట్లతో రెండో దశలో 12.70లక్షల గృహాల నిర్మాణం డిసెంబర్ 25న తొలి దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నాం 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించాం: రంగనాథరాజు రెండో దశ డిసెంబర్ 2021లో ప్రారంభించి జూన్ 2023 నాటికి పూర్తి చేస్తాం చంద్రబాబు ప్రభుత్వంలో పీఎంఏవై కింద నిర్మించిన గృహాలకు..రూ.430 కోట్ల పెండింగ్ బిల్లులు సీఎం జగన్ విడుదల చేశారు గృహ నిర్మాణం కింద గత ప్రభుత్వం 2.07లక్షల మంది లబ్ధిదారులకు..బకాయిలు పెట్టిన రూ.900 కోట్లను మా ప్రభుత్వమే చెల్లిస్తుంది 2015 నుంచి 2018 వరకు పీఎంఏవై కింద 7లక్షల గృహాలు మంజూరయ్యాయి..2017-18లో 5లక్షల గృహాలకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చారు 2019 మే 1 నాటికి కేవలం 77,371 గృహాలు మాత్రమే పూర్తి చేశారు మౌలిక వసతుల కోసం రూ.2,428 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా..కేవలం రూ.345 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు: రంగనాథరాజు పూర్తయిన ఇళ్లలో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్, రోడ్ల సదుపాయాలు లేవు. మౌలిక వసతులు లేకపోవడం వల్లే లబ్ధిదారులకు స్వాధీనపరచలేదు: రంగనాథరాజు 300 చ.ద. అడుగుల గృహాలను గతంలో 2.65లక్షలు చెల్లించాల్సి వచ్చేది..ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. టిడ్కో ఇళ్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆదా: రంగనాథరాజు ఆయననే మాట్లాడమనండి: సీఎం జగన్ ఆక్వా బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు చేసిన సూచనలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు అడ్డుతగిలారు. చర్చ కొనసాగిస్తున్న రామరాజును పక్కనపెట్టి తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. చర్చలో మాట్లాడుతున్న సభ్యుడిని కాదని తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి దానికి ఇలా అడ్డుపడే బదులు చంద్రబాబే మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్ష నేతే చర్చలో పాల్గొంటే తామంతా సంతోషిస్తామని, విపక్షం తరపున చర్చలో పాల్గొనే అవకాశం చంద్రబాబు ఇవ్వాలని కోరుతున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు విష ప్రచారం: మల్లాది విష్ణు చంద్రబాబు తీరు శాసనసభను, రాజ్యాంగ వ్యవస్థలను కించ పరిచేలా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, వాటిలో వెయ్యి కోట్లు తమ ప్రభుత్వం కట్టిందని వెల్లడించారు. రివర్స్ టెండర్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి బయట పడిందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల అంశంలో టీడీపీ పనికట్టుకుని దుష్ప్రచారనికి తెరలేపిందని ఆరోపించారు. నిమ్మల రామానాయుడు సస్పెన్షన్ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్ సస్సెండ్ చేశారు. రెండవ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. బిల్లులపై చర్చ జరగకుండా సభకు ఆటకం సృష్టిస్తున్నారు. పొడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. దటీజ్ జగన్! తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ‘జగన్ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావ’ని సీఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినప్పటీకి టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గందరగోళం సృష్టించడం సమంజసం కాదని హితవు పలికారు. టీడీపీకి భయం ఎందుకు? టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేదని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ రచ్చ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ప్రతిపక్ష సభ్యులు నిన్న వ్యవసాయ రంగంపై చర్చ అంటే సీఎం జగన్ పెద్ద మనసుతో మిగతా అంశాలను పక్కనపెట్టి అంగీకరించారు. చర్చ ప్రారంభించిన తర్వాత డ్రామా క్రియేట్ చేసి రచ్చ చేశారు. ఈరోజు హౌసింగ్‌పై చర్చ అడిగారు. సరే ఇస్తామంటే.. లేదు లేదు ఇప్పుడే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఏ అంశంపైనా అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టీడీపీ సభ్యులు ఇంత భయపడుతున్నారేందుకు?’ అని ప్రశ్నించారు. టీడీపీ అనవసర రాద్ధాంతం: బుగ్గన టీడీపీ సభ్యులు కావాలనే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. దీంతో రాజేంద్రనాథ్ జోక్యం చేసుకున్నారు. సజావుగా జరిగే సభను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఈ విధంగా అడ్డుకోవడం అన్యాయమన్నారు. నిన్న కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి సభను అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ జరిగితే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముగ్గురికి నివాళి మాజీ మంత్రి పెనుమత్స సాంబశివ రాజు, మాజీ ఎమ్మెల్యేలు పి నారాయణరెడ్డి, ఖాలీల్ బాషాలకు శాసనసభ సంతాపం తెలిపింది. తర్వాత సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ అమెండ్మెంట్ బిల్, ఏపీ ఫిషరిస్ యూనివర్సిటీ బిల్-2020లపై చర్చను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: చీఫ్ విప్ ప్రతిపక్ష నేత నిన్న సభలో మాట్లాడిన తీరు దురదృష్టకరమని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షనేత అలా వ్యవహరిస్తే ఇక కింది వాళ్ళు బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారాన్ని మరిచి ముఖ్యమంత్రిని వాడూ వీడు అని వ్యాఖ్యానించడం దారుణమని, చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ, కరోనా నియంత్రణలో విజయవంతమైన ప్రభుత్వ చర్యలపై చర్చ జరగనుంది. కాగా, టిస్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. -
తొలిరత్నం రైతుభరోసా
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్ము నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ అవుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అలా జమ చేసిన సొమ్ము వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నామని తెలిపారు. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు సంవత్సరానికి రూ. 13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ. 67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నామని తెలిపారు. నవరత్నాలలో మొట్టమొదటి పథకం రైతు భరోసా అని, నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50 వేలు ఇస్తామని మొదట్లో చెప్పామని, కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ. 13,500 చొప్పున ఇస్తున్నామని వివరించారు. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోందన్నారు. కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని, కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపారు. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపామని చెప్పారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆర్బీకేలతో అన్నదాతలకు సేవలు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైఎస్సార్ జలకళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లించకుండా పెట్టిన రూ. 8,655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ. 384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ. 1,030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది. పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను రూ. 1,800 కోట్లు వెచ్చించి అందిస్తున్న ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే రూ. 510 కోట్లు చెల్లించాం. బీమా ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నాం.. బీమా ప్రీమియంను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరఫున కట్టాల్సిన రూ. 506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ. 524 కోట్లు.. మొత్తం రూ. 1,030 కోట్లు బీమా ప్రీమియం చెల్లించగా, ఈ డిసెంబర్ 15న బీమా పరిహారం (క్లెయిమ్‌లు) రూ. 1,227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి. రైతుకు సాంకేతికంగా వెన్నుదన్ను 13 జిల్లాల్లో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు (గ్రామీణ నియోజకవర్గాల్లో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది. వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట.. కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఆవులు, గేదెలు 4.68 లక్షల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌తో పాల ధర అధికం.. కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ. 34కు, దొడ్ల డెయిరీ రూ. 32కు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ. 39కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ. 5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్థలు రూ. 58 లకు, జెర్సీ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ. 64.97కు కొనుగోలు చేయనుంది. ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్ సంస్థ రూ. 23.12లు, సంగం డెయిరీ రూ. 25.20లు, జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది. ఆక్వా రైతులకు భరోసా.. ఇంకా ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు గ్రామాల్లోని జనతా బజార్లలో దొరుకుతాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 35 చోట్ల ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ. 3,491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ. 666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన పంటలకు అదనపు విలువ (వాల్యూ యాడిషన్) జోడించి, తిరిగి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రూ. 3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి. రెండో దశ ప్రాససింగ్ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. -
మద్దతు ధరపై మండిపాటు
సాక్షి,బెంగళూరు : శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే సువర్ణ విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేయడం ద్వారా విపక్ష బీజేపీ అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులు, ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ నాయకుల మధ్య ఉన్న ఐక్యతను కూడా ప్రదర్శించింది. శీతకాల సమావేశాల ప్రారంభమైన మంగళవారం తెల్లవారుజాము నుంచే బెళగావి, హుబ్లీ, ధారవాడ, గదగ్, హావేరి, రాయచూరు, దావణగెరే, శిమొగ్గ, కొప్పళతో సహా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, రైతులు సువర్ణ విధానసౌధకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బృహత్ వేదిక వద్దకు చేరుకోవడం మొదలు పెట్టారు. ఇక ఉదయం 11 గంటల కల్లా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి, బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరరావు, సీనియర్ నాయులు కే.ఎస్ ఈశ్వరప్ప, సురేష్అంగడి, శ్రీరాములు తదితరులు వేదిక వద్దకు చేరుకోగానే అక్కడి పరిస్థితి వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, రైతు సంఘం నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. చెరుకు రైతులకు ప్రకటించిన మద్దతు ధర ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంది, వరి, జొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప ధర్నాకు వచ్చిన కార్యకర్తలను, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ఘాడనిద్రలో ఉందని ఎద్దేవ చేశారు. అందువల్లే ప్రజల కష్టాలు వారికి తెలియడం లేదని విమర్శించారు. అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మంది మంత్రులను వెంటనే మంత్రిమండలి నుంచి తొలగించాలని ప్రహ్లాద్‌జ్యోషి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరసన వ్యక్తం చేస్తుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం దీన్ని అణచడానికి ప్రయత్నిస్తూ హిట్లర్, తుగ్లక్‌ల నాటి పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని జగదీష్ శెట్టర్ విమర్శించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, రైతులతో కలిసి బీజేపీ నాయకులు సువర్ణ విధానసౌధను ముట్టడించడానికి వెళ్లడానికి వెళ్లారు. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు యడ్యూరప్ప, శోభకరంద్లాజెతో సహా సుమారు 20 మంది శాసనసభ్యులు, వందల మంది రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ నాయకులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా లెక్కచేయని పోలీసులు నాయకులను వేర్వేరు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తర్వాత సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరరావు మాట్లడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. ఆయన మరెంతో కాలం ఆ పదవిలో కొనసాగలేరని జోష్యం చెప్పారు. మరోవైపు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సువర్ణ విధానసౌధ చుట్టు పక్కల ధర్నా నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలి పెట్టారు. ఇది ఇలా ఉండగా రాష్ర్ట చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కరుబూరు శాంతకుమార్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ధర్నాను ఉపసంహరించుకునే విషయాన్ని సహచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతకు మందు సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ రెండు, మూడు చోట్లకు స్వయంగా వెళ్లి రైతు సంఘం నేతలతో మాట్లాడి ధర్నాను విరమింపజేయడానికి విఫలయత్నం చేశారు. -
వాడివేడిగా..
రెండో రోజు దద్దరిలిన అసెంబ్లీ కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్, ఎన్సీపీలు పస్తుత పరిస్థితికి మీరే కారణమంటూ ప్రభుత్వం ఎదురుదాడి మూడుసార్లు సభ వాయిదా .. అయినా వెనక్కు తగ్గని ప్రతిపక్షాలు సాక్షి, ముంబై: నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండవరోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. వాడివేడిగా ప్రారంభమైన రెండవరోజు సమావేశాలు మూడుసార్ల్లు వాయిదాపడ్డ అనంతరం నాలుగవసారి బుధవారం వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీక ర్ ప్రకటించారు. సమావేశాల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విడిపోయిన బీజేపీ, శివసేనలు ఒక్కటైనట్టుగానే మంగళవారం కాంగ్రెస్, ఎన్సీపీలు శీతాకాల సమావేశంలో ఒక్కటయ్యాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని, కరువు ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీలు మంగళవారం నాటి సమావేశంలో డిమాండ్ చేశాయి. మరోవైపు దీనికి కారణం గతంలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వమే కారణమంటు బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఇలా అధికార , ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11.15 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడు లేకుండా కొనసాగుతున్న శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ నాయకుడు జయంత్ పాటిల్, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్భల్లు చర్చలు జరపడంతోపాటు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ప్రారంభమైంది. దీంతో 11.30 గంటలకు 30 నిమిషాలపాటు సభను వాయిదావేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బాలాసాహెబ్ విఖేపాటిల్, బాలాసాహెబ్ థోరాత్, అజిత్ పవార్, ఛగన్‌భుజ్‌బల్, దిలీప్ వల్సేపాటిల్లతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాలు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మాత్రం తమ పట్టును వీడలేదు. దీంతో మళ్లీ 30 నిమిషాలపాటు వాయిదావేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనతరం 12.30 గంటలకు కూడా సభ సాగకపోవడంతో ఒంటిగంట వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా మూడుమార్లు వాయిదావేసినప్పటికీ ప్రతిపక్షాలు తమ ఆందోళనను విరమించుకోలేదు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో చర్చలు ప్రారంభమైనప్పటికీ, ముందు ప్యాకేజీ ప్రకటించాలని కోరడంతో చివరికి చేసేదేమీలేక స్పీకర్ బుధవారం వరకు సభను వాయిదావేశారు. ఇలా వాడివేడిగా ప్రారంభమైన సమావేశాలు రెండవరోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే వాయిదాపడ్డాయి. ప్రతిపక్ష నేతగా ఆర్ఆర్ పాటిల్ పేరు ప్రతిపాదించిన ఎన్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని పదవి కోసం ఎన్సీపీ ఆర్ ఆర్ పాటిల్ పేరును ప్రతిపాదించింది. ఈ విషయంపై తొందర్లోనే అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్లనున్నట్టు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ తెలిపారు. శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందుగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన ప్రభుత్వంలో బాగస్వామ్యం కావడంతో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కనుందా అనే విషయంపై అందరిలో ఉత్కంఠత ప్రారంభమైంది. ఓ వైపు కాంగ్రెస్‌తోపాటు మరోవైపు ఎన్సీపీ కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ తమ అభ్యర్థి ఎవరనేది ప్రకటించి కాంగ్రెస్‌ను కొంత ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. ఈ విషయంపై అజిత్ పవార్ మాట్లాడుతూ ఎన్సీపీ వద్ద 41 ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉండగా మరో నలుగురు ఇండిపెండెంట్లు తమకు మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చారన్నారు. ఈ మేరకు తాము ప్రతిపక్ష నాయకుడిగా ఆర్ ఆర్ పాటిల్ పేరును సిఫారసు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.