యువతిపై సామూహిక లైంగికదాడి
హైదరాబాద్: ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి పరారైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన ఓ యువతి(20) చింతల్‌కుంటలోని ఎల్పీటీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 9.45గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై శాంతినగర్ కాలనీ వద్ద బస్సు దిగి కాలనీకి నడుచుకుంటూ వెళ్తుండగా ఏపీ29టీవీ6595 నెంబర్ గల కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యువతిని బలవంతంగా కారులోకి లాక్కుని గ్రామ శివారుకు తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
అయితే ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసి పలువురుకి సమాచారం అందించారు. వారంతా కారు వెళ్లిన ప్రాంతానికి వెళ్లగా దుండగులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అయితే అప్పటికే వారు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.