woman committees
-
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు తీర్మానం
రాజమండ్రి(పిఠాపురం): రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో మహిళా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు ఇస్తామని చెప్పి రూ. 3వేలు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం డ్యాక్రా రుణాల మాఫీపై అనుసరిస్తున్న విధానాలుకు వ్యతిరేకంగా 30 మహిళా సంఘాలు గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమావేశమై తీర్మానం చేశాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
నిర్భయ చట్టంలో సారం లేదు: వి. సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళల రక్షణకు చేసిన నిర్భయ చట్టంలోని అంశాలు ఆశాజనకంగా లేవని, జస్టిస్ వర్మ చేసిన ప్రధాన సిఫారసులను పక్కనపెట్టి సారం లేని చట్టాన్ని తయారు చేశారని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆరోపించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని, డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పీవోడబ్ల్యూ 6వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిసాయి. మహాసభల చివరిరోజు సోమవారం సంస్థాగత కార్యక్రమాలపై చర్చించి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. మహిళా ఉద్యమాలతో సాధించుకున్న 498ఏ చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, అలాంటి ఆలోచనను విరమించుకుని వరకట్న వేధింపులు, హత్యల నిరోధానికి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు. మత రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం కల్పించుకోకూడదని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస హక్కులను పరిరక్షించే 5వ షెడ్యుల్‌ను అమలు చేయాలని, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని, బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు కమిటీలు వేయాలనే ప్రతిపాదనకు మహాసభలో ప్రతినిధుల నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు రెండు కమిటీలకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి కమిటీని మంగళవారం ప్రకటించనున్నారు. మహాసభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు, రాష్ట్రనేతలు బి.పద్మ, నర్సక్క, రమాసుందరి, సూర్యకుమారి, అనురాధ పాల్గొన్నారు. -
రంజిత్ సిన్హా ‘రేప్’ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చేసిన ‘రేప్’ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. సీబీఐ చీఫ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆయన తన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కామెంట్లు వివాదాస్పదం కావడంతో రంజిత్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడంపై మంగళవారం రంజిత్ సిన్హా స్పందిస్తూ.. ‘క్రీడల్లో బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడం ఎలాంటిదంటే రేప్‌ను నిరోధించలేకపోతే.. దానిని ఎంజాయ్ చేయండి అనడంలా ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. సిన్హా వివరణ అందిన తర్వాత సీబీఐ డెరైక్టర్‌గా ఆయనను తప్పించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఇటువంటి బాధ్యాతారహితమైన ప్రకటన చేయడం తగదని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మలా సమంత్ ప్రభావాల్కర్ చెప్పారు. సున్నిత అంశాలపై పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు. బీజేపీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, గడ్కారీ స్పం దిస్తూ సీబీఐ చీఫ్ వంటి అత్యుత్తమ పదవికి సిన్హా తగడని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అవును బకాయిలున్నాయి: సెర్ప్
‘సాక్షి’ కథనంపై సీఈవో వివరణ 3 నెలల బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పథకం కింద వడ్డీ బకాయిలు ఉన్నమాట వాస్తవమేనని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అంగీకరించింది. మూడు నెలల బకాయిలను నాలుగు రోజుల్లో మహిళా సంఘాల ఖాతాలకు నేరుగా జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ‘సెర్ప్’ అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ.మురళి బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలల కోసం రూ.299 కోట్లు మహిళా సంఘాలకు చెల్లించినట్లు తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.307 కోట్లు దాదాపు 6.94 లక్షల మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అక్టోబర్ నెలకు సంబంధించిన వడ్డీ విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. వడ్డీని మహిళా సంఘాలకు చెల్లించడానికి అవసరమైన నిధులను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టామని, వచ్చే అర్ధసంవత్సరానికి చెల్లించే దాదాపు రూ.720 కోట్ల వడ్డీ మొత్తాన్ని కూడా ముందుగానే చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు మురళి తెలిపారు. స్త్రీనిధి రుణాలపై వడ్డీ మాటేమిటీ..?: స్త్రీనిధి పథకం కింద ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటుచేసి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. వీటిని సైతం ప్రభుత్వం వడ్డీలేని రుణాల జాబితాలో చేర్చించి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద కూడా వడ్డీని ప్రభుత్వం చెల్లించలేదు. ఇది సంస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని ఇటీవల జరిగిన స్త్రీనిధి సంస్థ బోర్డు డెరైక్టర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తాము మహిళా సంఘాలకు ఇస్తున్నామని, మహిళా సంఘాల నుంచి వడ్డీ వసూలు చేయకుండా కేవలం అసలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు డెరైక్టర్లు తెలిపారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని సంస్థ సొంత నిధుల నుంచి చెల్లించాల్సి రావడం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఐకేపీకి 89 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు
25 కేంద్రాలను లాగేసుకున్న పీఏసీఎస్ చైర్మన్లు.. నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా ఉన్నతాధికారులు మహిళా సంఘాలకు అన్యాయం.. సాక్షి, నిజామాబాద్: మహిళా సంఘాలు నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పీఏసీఎస్ చైర్మన్ల కన్ను పడింది. కమీషన్ రూపంలో కాసులు కురిపిస్తున్న ఈ కేంద్రాల నిర్వహణ కోసం వీరు తహతహలాడుతున్నారు. పీఏ సీఎస్‌లకు కేటాయించిన కేంద్రాలే కాకుండా, తమ రా జకీయ పలుకుబడిని ఉపయోగించి ఐకేపీ (ఇందిర క్రాంతి పథం) సంఘాలకు మంజూరైన కొనుగోలు కేంద్రాలను కూడా లాగేసుకున్నారు. ఈ ఖరీఫ్ సీజనులోనే మహిళా సంఘాలకు మంజూరైన వాటిలో ఏకం గా 25 కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు ఎగురేసుకుపోయారు. దీంతో ఈ కేంద్రాల ద్వారా వచ్చే కమీషన్ సొ మ్ము మహిళా సంఘాలకు రాకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలను ఐకేపీకి కేటాయించడం ద్వారా ఆ యా గ్రామ సంఘాలు (వీఓ)లు ఆర్థికంగా బలోపేతమవుతాయి. గ్రామంలో ఉన్న స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఈ వీఓ నుంచి రుణాలు విరివిగా దొరుకుతాయి. పీఏసీఎస్‌లకు వచ్చే కమీషన్‌తో మా త్రం రైతుల కంటే నేతలే ఎక్కువ ప్రయోజనం పొందుతారనే ఆరోపణలున్నాయి. ఐకేపీకి అనుమతించింది.. 89 కేంద్రాలు.. జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఖరీఫ్ కొనుగోలు సీజను ప్రణాళికను రూపొందించారు. ఈ సారి ఐకేపీ మహిళా సంఘాలకు జిల్లావ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశారు. అయితే నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇందులో 25 కేంద్రాలను పీఏసీఎస్‌లకు కట్టబెట్టేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులకు త లొగ్గి 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను మార్చి వేశారు. 64 కేంద్రాలకు కుదించారు. ఈ మేరకు ఐకేపీకి రీఆర్డర్లు జారీ చేశారు. ఈ కేంద్రాల మంజూరులో మహిళా సంఘాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ఐకేపీ ఉన్నతాధికారులు బసవన్నల్లా తలూపారనే విమర్శలు వస్తున్నాయి. మచ్చుకు కొన్ని... డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి కొనుగోలు కేం ద్రాన్ని అధికారులు ఐకేపీ మహిళా సంఘానికి మం జూరు చేశారు. తరువాత అధికార పార్టీ నేత ప్రోద్బలంతో ఈ కేంద్రాన్ని పీఏసీఎస్‌కు కట్టబెట్టారు. ఆర్మూ ర్ మండలం పెర్కిట్ కేంద్రాన్ని కూడా రాజకీయ ఒత్తిడి మేరకు పీఏసీఎస్‌కు అప్పగించారు. ఇలా మహిళా సంఘాలకు మంజూరైన నవీపేట్, తిరుమలాపూర్ (బాన్సువాడ మండలం), రాంపూర్, కారేగాం (పిట్లం), ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్ (బీర్కూర్), పడకల్, పడిగెల (జక్రాన్‌పల్లి), పెర్కిట్ (ఆర్మూర్), తల్వేద (నందిపేట్) తదితర కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు తమ రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని లాగేసుకున్నారు. దీంతో ఆయా మహిళా సం ఘాలు ధాన్యం కొనుగోళ్ల ద్వారా కమీషన్ రూపంలో వచ్చే రూ. లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. పెట్టుబడి లేని దందా.. భారీ మొత్తంలో కమీషన్ వచ్చే ఈ కేంద్రాల నిర్వహణకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. రెండు, మూడు నెలలు దృష్టి సారిస్తే రూ.లక్షల్లో వెనుకేసుకోవచ్చు. కొనుగోళ్లకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రవాణా తదితర ఖర్చులన్నీ సివిల్‌సప్లయ్ కార్పొరేషనే భరిస్తుంది. ఆ ఏర్పాట్లు కూడా ఆ శాఖ అధికారులే చూసుకుంటారు. కేంద్రాని కి వచ్చే ధాన్యం నాణ్యతను పరిశీలించి తూకం వేయి స్తే చాలు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.2.5 శాతం చొప్పున కమీషన్ చెల్లిస్తున్నారు. విచ్చల విడిగా కొనుగోళ్లు.. ధాన్యం కొనుగోళ్లలో జిల్లాలోని ఎస్‌హెచ్‌జీ మహిళ లు ఎంతో నైపుణ్యం సాధించారు. ధాన్యం నాణ్యతను నిశితంగా పరిశీలిస్తారు. కొనుగోళ్లలో ఏళ్ల తరబడి అనుభవం కలిగిన ఈ మహిళలు ఏటా విజయవంతంగా కొనుగోళ్లను సాగిస్తున్నారు. ఇప్పుడు అధికారులు పీఏసీఎస్‌లకు అప్పగించడం ద్వారా విచ్చల విడిగా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేం ద్రాల్లో తూకాలు వేయకుండానే నేరుగా లారీల్లో రైసుమిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఆయా మిల్లర్లు తూకాల్లో మోసాలకు పాల్పడితే ధాన్యం విక్రయిం చిన రైతులు రూ. వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు జరిగితే ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. ఇలా కొన్ని పీఏసీఎస్‌లలో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు కమీషన్ రూపంలో కాసులు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం పీఏసీఎస్ చైర్మన్ల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. సుమా రు 50 పైగా దరఖాస్తులు సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ అధికారుల వద్ద ఉన్నాయంటే ఈ కేంద్రాల నిర్వహణ కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ కేంద్రాల ఏర్పాటు లో ఐకేపీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తే నిరుపేద స్వయం సహాయక సంఘాల మహిళలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.