ఐకేపీకి 89 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు | 89 Grain sales counters for IKP | Sakshi
Sakshi News home page

ఐకేపీకి 89 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు

Published Tue, Nov 5 2013 6:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

89 Grain sales counters for IKP

25 కేంద్రాలను లాగేసుకున్న పీఏసీఎస్ చైర్మన్లు..
నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా ఉన్నతాధికారులు
మహిళా సంఘాలకు అన్యాయం..

 
 సాక్షి, నిజామాబాద్: మహిళా సంఘాలు నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పీఏసీఎస్ చైర్మన్ల కన్ను పడింది. కమీషన్ రూపంలో కాసులు కురిపిస్తున్న ఈ కేంద్రాల నిర్వహణ కోసం వీరు తహతహలాడుతున్నారు. పీఏ సీఎస్‌లకు కేటాయించిన కేంద్రాలే కాకుండా, తమ రా జకీయ పలుకుబడిని ఉపయోగించి ఐకేపీ (ఇందిర క్రాంతి పథం) సంఘాలకు మంజూరైన కొనుగోలు కేంద్రాలను కూడా లాగేసుకున్నారు. ఈ ఖరీఫ్ సీజనులోనే మహిళా సంఘాలకు మంజూరైన వాటిలో ఏకం గా 25 కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు ఎగురేసుకుపోయారు. దీంతో ఈ కేంద్రాల ద్వారా వచ్చే కమీషన్ సొ మ్ము మహిళా సంఘాలకు రాకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలను ఐకేపీకి కేటాయించడం ద్వారా ఆ యా గ్రామ సంఘాలు (వీఓ)లు ఆర్థికంగా బలోపేతమవుతాయి. గ్రామంలో ఉన్న స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఈ వీఓ నుంచి రుణాలు విరివిగా దొరుకుతాయి. పీఏసీఎస్‌లకు వచ్చే కమీషన్‌తో మా త్రం రైతుల కంటే నేతలే ఎక్కువ ప్రయోజనం పొందుతారనే ఆరోపణలున్నాయి.
 
 ఐకేపీకి అనుమతించింది.. 89 కేంద్రాలు..
 జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఖరీఫ్ కొనుగోలు సీజను ప్రణాళికను రూపొందించారు. ఈ సారి ఐకేపీ మహిళా సంఘాలకు జిల్లావ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశారు. అయితే
 నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇందులో 25 కేంద్రాలను పీఏసీఎస్‌లకు కట్టబెట్టేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులకు త లొగ్గి 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను మార్చి వేశారు. 64 కేంద్రాలకు కుదించారు. ఈ మేరకు ఐకేపీకి రీఆర్డర్‌లు జారీ చేశారు. ఈ కేంద్రాల మంజూరులో మహిళా సంఘాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ఐకేపీ ఉన్నతాధికారులు బసవన్నల్లా తలూపారనే విమర్శలు వస్తున్నాయి.
 
 మచ్చుకు కొన్ని...
 డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి కొనుగోలు కేం ద్రాన్ని అధికారులు ఐకేపీ మహిళా సంఘానికి మం జూరు చేశారు. తరువాత అధికార పార్టీ నేత ప్రోద్బలంతో ఈ కేంద్రాన్ని పీఏసీఎస్‌కు కట్టబెట్టారు. ఆర్మూ ర్ మండలం పెర్కిట్ కేంద్రాన్ని కూడా రాజకీయ ఒత్తిడి మేరకు పీఏసీఎస్‌కు అప్పగించారు. ఇలా మహిళా సంఘాలకు మంజూరైన నవీపేట్, తిరుమలాపూర్ (బాన్సువాడ మండలం), రాంపూర్, కారేగాం (పిట్లం), ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్ (బీర్కూర్), పడకల్, పడిగెల (జక్రాన్‌పల్లి), పెర్కిట్ (ఆర్మూర్), తల్వేద (నందిపేట్) తదితర కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు తమ రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని లాగేసుకున్నారు. దీంతో ఆయా మహిళా సం ఘాలు ధాన్యం కొనుగోళ్ల ద్వారా కమీషన్ రూపంలో వచ్చే రూ. లక్షల  ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
 
 పెట్టుబడి లేని దందా..
 భారీ మొత్తంలో కమీషన్ వచ్చే ఈ కేంద్రాల నిర్వహణకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. రెండు, మూడు నెలలు దృష్టి సారిస్తే రూ.లక్షల్లో వెనుకేసుకోవచ్చు. కొనుగోళ్లకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రవాణా తదితర ఖర్చులన్నీ సివిల్‌సప్లయ్ కార్పొరేషనే భరిస్తుంది. ఆ ఏర్పాట్లు కూడా ఆ శాఖ అధికారులే చూసుకుంటారు. కేంద్రాని కి వచ్చే ధాన్యం నాణ్యతను పరిశీలించి తూకం వేయి స్తే చాలు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.2.5 శాతం చొప్పున కమీషన్ చెల్లిస్తున్నారు.
 
 విచ్చల విడిగా కొనుగోళ్లు..
 ధాన్యం కొనుగోళ్లలో జిల్లాలోని ఎస్‌హెచ్‌జీ మహిళ లు ఎంతో నైపుణ్యం సాధించారు. ధాన్యం నాణ్యతను నిశితంగా పరిశీలిస్తారు. కొనుగోళ్లలో ఏళ్ల తరబడి అనుభవం కలిగిన ఈ మహిళలు ఏటా విజయవంతంగా కొనుగోళ్లను సాగిస్తున్నారు. ఇప్పుడు అధికారులు పీఏసీఎస్‌లకు అప్పగించడం ద్వారా విచ్చల విడిగా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేం ద్రాల్లో తూకాలు వేయకుండానే నేరుగా లారీల్లో రైసుమిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఆయా మిల్లర్లు తూకాల్లో మోసాలకు పాల్పడితే ధాన్యం విక్రయిం చిన రైతులు రూ. వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు జరిగితే ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. ఇలా కొన్ని పీఏసీఎస్‌లలో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
 
 కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
 కమీషన్ రూపంలో కాసులు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం పీఏసీఎస్ చైర్మన్ల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. సుమా రు 50 పైగా దరఖాస్తులు సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ అధికారుల వద్ద ఉన్నాయంటే ఈ కేంద్రాల నిర్వహణ కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ కేంద్రాల ఏర్పాటు లో ఐకేపీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తే నిరుపేద స్వయం సహాయక సంఘాల మహిళలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement