woman leader
-
కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..
గౌహతి: కిసాన్ మోర్చా నాయకురాలు ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న ఓ నాయకుని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అసోం బీజేపీ. గత శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన ఓ మహిళ గౌహతిలో తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళా నాయకురాలు ఇతర పార్టీ నాయకునితో ఉన్న అశ్లీల ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితునిగా ఉన్న పార్టీ నాయకుని సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: 50 శాతం కమిషన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై కేసు.. -
టీడీపీ మహిళా రాష్ట్రప్రధాన కార్యదర్శి ముల్పూరి కళ్యాణి అరెస్ట్
-
విద్యార్థినిపై టీడీపీ నేత భర్త లైంగిక వేధింపులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓ విద్యార్థినిపై టీడీపీ నేత భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కావలిలో కలకలం రేపింది. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కావలి మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలో బీసీ హాస్టల్లో ఉంటూ ఒక ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే హైస్కూల్లో టీడీపీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసంతి భర్త ద్రోణాదుల వెంకట్రావు అలియాస్ గాబరా వెంకట్రావు రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బాలికను గాబరా వెంకట్రావు గత కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక భయపడిపోయింది. హాస్టల్లో తనతోపాటు ఉంటున్న సహచర విద్యార్థినులకు చెప్పి కన్నీరుమున్నీరైంది. విద్యారి్థనులు బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. దీంతో తల్లిదండ్రులు హైసూ్కలు ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. సదరు పాఠశాల ఎయిడెడ్ యాజమాన్యం పరిధిలో ఉండడంతో హెచ్ఎం వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంకట్రావును సస్పెండ్ చేశారు. పది రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్య కారణాల సాకుతో రాజీనామా విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుండడంతో గాబరా వెంకట్రావు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆరోగ్య కారణాల రీత్యా విధుల్లోనుంచి తప్పుకుంటున్నానని.. రాజీనామాను ఆమోదించాలని హెచ్ఎంకు లేఖ రాశాడు. ఈ వ్యవహారాన్ని పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గతంలోనూ నీచమైన పనులు వెంకట్రావు వ్యవహార శైలితో స్కూల్లోని బోధన, బోధనేతర సిబ్బంది కూడా హడలిపోయేవారని తెలుస్తోంది. గతంలో అదే స్కూలులో పనిచేసిన ఓ ఉపాధ్యాయినిని లైంగిక వేధింపులకు గురిచేసి చిత్రహింసలు పెట్టాడు. ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టడంతో కాళ్ల బేరానికి వచ్చి ఆమెతో రాజీ చేసుకున్నాడు. అలాగే మున్సిపల్ కార్యాలయంలోకి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి అక్కడి ఉద్యోగులను దుర్భాషలాడిన కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. ఈ కేసులో అతడిపై కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకట్రావు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ, సీఎం వైఎస్ జగన్‌ను దూషిస్తూ పోస్టులు కూడా పెడుతుంటాడని చెబుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని అసభ్యంగా తిడతాడని అంటున్నారు. కాగా ఈ ఘటనపై టీడీపీ నాయకులు నోరు మెదపడానికి సాహసించడం లేదు. -
దుర్మార్గం: వెంటపడి చీర కొంగు లాగేసి..
ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. పార్టీల మధ్య, ప్రత్యర్థులతో కుమ్ములాటలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలిగించే ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఓ మహిళను చీరపట్టి లాగారు రాజకీయ ప్రత్యర్థులు. లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ప్రత్యర్థులు చీర కొంగు పట్టిలాగారు. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ ఆమె నామినేషన్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు. pic.twitter.com/TqepdO3y4W — Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021 తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఘటనపై స్పందించాడు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ క్యాఫ్షన్ ఉంచాడు. యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గురవారం చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. पीएम साहब और सीएम साहब इसके लिए भी बधाई दीजिए कि यूपी में आपके कार्यकर्ताओं ने ⭐कितनी जगह बमबाजी, गोलीबारी, पत्थरबाजी की ⭐कितने लोगों का पर्चा लूटा ⭐कितने पत्रकारों को पीटा ⭐कितनी जगह महिलाओं से बदतमीजी की कानून व्यवस्था की आंख पर पट्टी बांधकर, लोकतंत्र का चीरहरण चल रहा है। pic.twitter.com/6H9L390frB — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 8, 2021 -
మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం
బెంగళూరు: ఎమ్మెల్యే, అతడి అనుచరులు దాడి చేయడంతో తనకు అబార్షన్ అయ్యిందంటూ ఓ మహిళా నాయకురాలు సొంత పార్టి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసింది. బాధితురాలిని స్థానిక బీజేపీ నాయకురాలు, మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ చాందిని నాయక్‌గా గుర్తించారు. గత నెల 9న ఈ దారుణం చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక గత నెల 9న మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్‌కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. చాందిని నాయక్ ఓటు వేయడానకి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గర్భవతి అయిన చాందిని నాయక్ కింద పడిపోయింది. దాంతో ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తెలిసింది. దీనిపై చాందిని నాయక్, ఆమె భర్త నగేష్ నాయక్.. మరో బీజేపీ లీడర్ సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సిద్దూ సవధి మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాందిని నాయక్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి?.. ఇలాంటి నాయకులు ఉంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు.. ప్రధాని ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినాదాలు చేస్తారు.. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సవధి స్పందించారు. చాందిని నాయక్ తనపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు. ‘‘చాందిని నాయక్‌కు సంబంధించిన ఆస్పత్రి రికార్డులు సేకరించాను. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఒక రోజులో నేను ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాను” అన్నారు. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు తనకు తెలియజేశారని సవధి తెలిపారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్రిజేష్ కలప్ప ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు., “బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి గర్భవతి అయిన కౌన్సిలర్ చాందిని నాయక్ మీద దాడి చేసిన వీడియోలను మేం టీవీ చూసి చాలా భయపడ్డాము. ఎమ్మెల్యే క్రూరత్వం వల్ల ఆమెకు గర్భస్రావం అయ్యింది. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలదా?!” అంటూ సవాలు చేశారు. -
దీపానికి బదులుగా, గాల్లోకి కాల్పులు
-
కరోనా : బీజేపీ నేత ఫైరింగ్ వీడియో వైరల్
సాక్షి, లక్నో : కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా దీపాలు వెలిగించి, ఐక్యతను చాటాలన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు భారీ స్పందన లభించింది. మరోవైపు ప్రధాని పిలుపు నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధలను సైతం ఉల్లఘించి, వీధుల్లోకి వచ్చి సామూహిక ర్యాలీలు తీయడం, పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చడం, స్వల్ప అగ్ని ప్రమాదం లాంటి చెదురు మదురు సంఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ మహాళానేత వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటి బాల్కనీలో దీపం వెలిగించడానికి బదులు, బహిరంగంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు 9నిమిషాల పాటు కొవ్వొత్తులు, మట్టి ప్రమిద దీపాలు, లేదా మొబైల్ టార్చ్ లైట్ల ద్వారా కరోనా వైరస్ ను అంతమొందించేలా ఐక్యతా దీపాన్ని వెలిగించమని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపునకు బలరాంపూర్‌లోని భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంజు తివారీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తన సహచరులతో కలిసి, తుపాకీతో గాలిలో కాల్పులు జరిపి సంబరం చేసుకున్నారు. కెమెరాలో బంధించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో పలు విమర్శలకు దారి తీసింది. కాగా కోవిడ్ -19 దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
దారి తప్పిన నాయకురాలు
యలహంక (కర్ణాటక): ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు సన్మార్గంలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అయితే ఆమె రూటు మార్చుకుని కటకటాలు లెక్కిస్తున్నారు. వాకింగ్‌కు వెళ్లిన మాజీ నగర సభ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్పను కిడ్నాప్ చేసి రూ 60 లక్షలు నగదును తీసుకోని విడిచిపెట్టిన నలుగురు నిందితులను ఈశాన్య విభాగం పోలీసులు అరెస్టు చేశారు. జేడిఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు అర్షియా ఆలీ ఈ కేసులో పట్టుబడడం విశేషం. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమని ఆమె అపహరణ మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యలహంక సమీపంలోని మారుతీ నగరలో నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్ప ఈ నెల 11వ తేదీ ఉదయాన్నే జికెవికెలో వాకింగ్‌కని కారులో బయలుదేరాడు. మారణాయుధాలతో బెదిరించి కిడ్నాప్ కోగిల్ క్రాస్‌లో హెచ్బిఆర్ లేఔట్‌కు చెందిన కాంతరాజ్ గౌడ (30), ప్రసాద్ (41, బాగలూరు రోడ్డు), అర్షియా ఆలీ (32, శ్రీనివాసగార్డెన్స్), డ్రైవర్ ప్రదీప్ (27, హొరమావు)లు మల్లికార్జునప్ప కారును అడ్డగించి మారణాయుధాలతో బెదిరించి తమ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హొరమావులోని ఒక గ్యారేజులో బంధించి, మల్లికార్జునప్ప కుమారుడు డాక్టర్ రవికుమార్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. మీ తండ్రిని కిడ్నాప్ చేశాం, రూ. 100 కోట్లు ఇవ్వాలి, పోలీసులకు ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలుంటాయి అని బెదిరించా రు. పనిపైన హైదరాబాదుకు వెళ్లిన రవికుమార్, తన తండ్రికి ఏ హానీ చేయయద్దని, నగదు తీసుకొస్తానని కిడ్నాపర్లకు హామీ ఇచ్చాడు. తన స్నేహితుల దగ్గర రూ 60 లక్షల నగదు సమకూర్చుకుని బాగేపల్లి సమీపంలోని ముఖ్య రోడ్డులో ఉన్న దేవస్థానంలో రాత్రి సమయంలో నగదు బ్యాగు పెట్టి కొంతదూరంలో ఉన్న తన తండ్రిని పిలుచుకుని ఇంటికి వెళ్లాడు. బంధువులు, స్నేహితుల సలహా మేరకు యలహంక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. 24 గంటల్లో అరెస్టు డిసీపి గిరీశ్ నాయకత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిడ్నాప్ చేసిన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వారువాడిన మొబైల్ నెంబర్, టవర్ ఆధారంగా హొరమావి ప్రాంతాన్ని చూపించడంతో అక్కడ ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్‌ను పట్టుకున్నారు. ప్రదీప్ ఇచ్చిన సమాచారం ప్రకారం మరో అర్షియా అలీ సహా ముగ్గురుని పోలీసులు నిర్బంధించి ప్రశ్నించగా, తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.1.04 కోటి నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలు, ఒక పిస్టల్, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళలు మాట్లాడటమా.. వద్దు కూర్చో!
ఆమె ఓ పార్టీ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ హోదాలోనే ఒక సమావేశానికి వెళ్లారు. అక్కడ మాట్లాడేందుకు సిద్ధం అవుతుండగా.. అదే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెను ఆపేశారు. పార్టీలో మహిళలు పురుషులను ఉద్దేశించి మాట్లాడటం సంప్రదాయం కాదంటూ అడ్డుకున్నారు. ఇదంతా కేరళలోని ముస్లింలీగ్ పార్టీ వ్యవహారం. కమరున్నీసా అన్వర్ (60).. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు. తిరువనంతపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి లేచి నిలబడగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ మయీన్ హాజీ ఆమెను అడ్డుకున్నారు. పురుషులను ఉద్దేశించి మహిళలు మాట్లాడటం సరికాదన్నారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణల ఆడియోను గుర్తుతెలియని వ్యక్తులు లీక్ చేశారు. అయితే, తాను అలా అనలేదని ఆ తర్వాత హాజీ ఖండించారు. ''మహిళలు బహిరంగ సభలలో మాట్లాడరు. మేము మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. అందుకే వాళ్లను బహిరంగ సభలు, రాత్రివరకు జరిగే కార్యక్రమాలకు హాజరు కాకుండా ఆపుతాం'' అని ఆయన చెప్పారు. ఏదైనా ఒక బృందం వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడటానికి పర్వాలేదు గానీ, బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడకూడదని తెలిపారు. అయితే.. తాను గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, జరిగిన ఘటన పట్ల చాలా బాధపడుతున్నానని కమరున్నీసా అన్వర్ తెలిపారు. అయినా.. పార్టీ మీద మాత్రం తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 మంది సభ్యులుండగా, వారిలో కేవలం 8 మంది మాత్రమే మహిళలు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. ఆ పార్టీ మిత్రపక్షమైన ముస్లింలీగ్‌కు 18 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలోనూ ఒక్కరూ మహిళలు లేరు. -
మహిళా నేతకే ఎమ్మెల్సీ పదవి?
8 మంది మహిళానేతల పేర్లను కోరిన ఏఐసీసీ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో మండలి ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారిం చింది. త్వరలో ఖాళీ అవనున్న సీట్లలో కాం గ్రెస్‌కు దక్కనున్న ఏకైక స్థానాన్ని మహిళ తో భర్తీ చేయాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ముగ్గురు సీనియర్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇటీవలే పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులను మార్చిన ఏఐసీసీ.. మరిన్ని మార్పులను చేపట్టనుందని పార్టీ ముఖ్యుడొకరు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా నుంచి పార్టీకి పూర్తికాలం పనిచేయగలిగే ఒక మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. దీనికోసం పీసీసీ నుంచి 8మంది మహిళానేతల పేర్లతో జాబితాను పంపించాలంటూ ఆదేశించిదని సమాచారం. పార్టీకోసం ఇప్పటిదాకా పని చేసినా ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి, గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రాని మహిళానేతకు అవకాశం కల్పించాలని నిర్దేశిం చింది. అయితే విధేయత, అంకిత భావం కలి గి, పార్టీ పటిష్టానికి ఉపయోగపడగలరనుకుం టే గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినా జాబితాలో చోటు కల్పించవచ్చని పేర్కొంది. దీంతో అధిష్టానం సూచనలకు అనుగుణంగా జాబితా రూపకల్పనలో పీసీసీ నిమగ్నమైంది. మాజీమంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద వంటివారికి ఇప్పటికే జాబితాలో చోటు దక్కినట్టుగా తెలుస్తోంది. మరో ఐదుగురు నేతల పేర్లకోసంపీసీసీ ఇంకా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న డి.శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి ఆశిస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి వంటివారు కూడా పోటీపడుతున్నారు. అధిష్టానం మాత్రం మహిళానేతకే అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. జాతీయ స్థాయి పదవుల్లోకి ముఖ్యులు రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ స్థాయి పదవుల్లో కొందరికి చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లలో ఒకరికి సీడబ్ల్యూసీలో చోటు దక్కనుందని సమాచారం. అలాగే ఏఐసీసీలో పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. -
ఎల్టీటీఈ కీలక మహిళా నేత అరెస్టు
కొలంబో: నిషేధిత సంస్థ ఎల్టీటీఈకి చెందిన కీలక మహిళా నేతను కొలంబో ఎయిర్‌పోర్టులో శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఎల్టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది పారిస్ వెళ్లేందుకు యత్నించగా టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న లంకకు వచ్చారు. -
మహిళా ఎంపీటీసీపై అత్యాచారయత్నం
విశాఖఫట్నం: మృగాళ్ల ఆగడాళ్లు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. సామాన్య మహిళల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు రక్షణ లేకుండా పోతోంది. విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఓ యువకుడు దాడి చేశాడు. జి.మాడుగుల మండలం కంబిడిసింగి ఎంపీటీసీపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఉరలమెట్టకు చెందిన నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.