సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓ విద్యార్థినిపై టీడీపీ నేత భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కావలిలో కలకలం రేపింది. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కావలి మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలో బీసీ హాస్టల్‌లో ఉంటూ ఒక ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే హైస్కూల్‌లో టీడీపీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసంతి భర్త ద్రోణాదుల వెంకట్రావు అలియాస్ గాబరా వెంకట్రావు రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బాలికను గాబరా వెంకట్రావు గత కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక భయపడిపోయింది. హాస్టల్‌లో తనతోపాటు ఉంటున్న సహచర విద్యార్థినులకు చెప్పి కన్నీరుమున్నీరైంది. విద్యారి్థనులు బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. దీంతో తల్లిదండ్రులు హైసూ్కలు ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. సదరు పాఠశాల ఎయిడెడ్ యాజమాన్యం పరిధిలో ఉండడంతో హెచ్‌ఎం వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంకట్రావును సస్పెండ్ చేశారు. పది రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.
ఆరోగ్య కారణాల సాకుతో రాజీనామా
విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుండడంతో గాబరా వెంకట్రావు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆరోగ్య కారణాల రీత్యా విధుల్లోనుంచి తప్పుకుంటున్నానని.. రాజీనామాను ఆమోదించాలని హెచ్‌ఎంకు లేఖ రాశాడు. ఈ వ్యవహారాన్ని పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
గతంలోనూ నీచమైన పనులు
వెంకట్రావు వ్యవహార శైలితో స్కూల్‌లోని బోధన, బోధనేతర సిబ్బంది కూడా హడలిపోయేవారని తెలుస్తోంది. గతంలో అదే స్కూలులో పనిచేసిన ఓ ఉపాధ్యాయినిని లైంగిక వేధింపులకు గురిచేసి చిత్రహింసలు పెట్టాడు. ఆమె పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడంతో కాళ్ల బేరానికి వచ్చి ఆమెతో రాజీ చేసుకున్నాడు. అలాగే మున్సిపల్ కార్యాలయంలోకి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి అక్కడి ఉద్యోగులను దుర్భాషలాడిన కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. ఈ కేసులో అతడిపై కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకట్రావు సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ, సీఎం వైఎస్ జగన్‌ను దూషిస్తూ పోస్టులు కూడా పెడుతుంటాడని చెబుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని అసభ్యంగా తిడతాడని అంటున్నారు. కాగా ఈ ఘటనపై టీడీపీ నాయకులు నోరు మెదపడానికి సాహసించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment