woman Security
-
నిట్‌లో లైంగిక వేధింపులు.. వాట్సాప్ మెసెజ్‌లు పంపుతూ..
సాక్షి, వరంగల్: అతని లైంగి కవేధింపులకు విసిగివేసారిన మహిళా సెక్యూరిటీ గార్డులు చివరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన నిట్ వరంగల్ క్యాంపస్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వరన్ పది నెలల క్రితం క్యాంపస్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా అడ్మిన్ హోదాలో వచ్చాడు. క్యాంపస్‌లో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను ఒంటరిగా తన ఇంటికి పిలిపించుకుని వ్యక్తిగత పనులు చేయాలంటూ కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. వాట్సాప్ మెసెజ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. చెప్పిన పని ఒప్పుకోకపోతే గంజాయి కేసు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరన్.. ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంటికి ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిపించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో గార్డులు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్‌కు దేహశుద్ధి చేసి కాజీపేట పోలీసులకు అప్పగించారు. ముందుగానే ఈ విషయాన్ని రిజిస్ట్రార్ గోవర్ధన్రావుకు తెలిపినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. నిట్ వరంగల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ఐఎస్ సంస్ధ యజమాని డిప్యూటీ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై మహిళా సెక్యూరిటీ గార్డులను తన ఇంటికి పంపించే విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్, చీఫ్ సె క్యూరిటీ ఆఫీసర్ కుమారస్వామి, ఎస్ఐఎస్ సెక్యూరిటీ సంస్థ శంకరన్లపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, గతంలో తమిళనాడులో తాను పనిచేసిన సంస్థలోనూ వెంకటేశ్వరన్ ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడినుంచి నిట్ వరంగల్‌కు మకాం మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి:పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు -
మహిళా గార్డుపై దౌర్జన్యం
ఏలూరు టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన సంఘటనలు కళ్ళముందు కదలాడుతూ ఉండగానే... ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మరో అమానుష సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహిళా విభాగంలోకిఅనుమతించలేదనే కోపంతో ప్రభుత్వాసుపత్రిలోని మహిళా సెక్యూరిటీ గార్డుపై తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు దౌర్జన్యానికి దిగారు. ఏకంగా మహిళా సెక్యూరిటీ గార్డు గుండెలపై చేయివేసి గెంటివేయటంతో ఆమె హతాశురాలయ్యింది. అంతా చూస్తుండగానే ఒక ప్రజాప్రతినిధి మహిళపై చేయి వేయటంతో అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సదరు జెడ్పీటీసీ సభ్యుడు తాను జిల్లా మంత్రి అనుంగుడనని.. నాకే చేయి అడ్డుపెడతావా అంటూ చిందులేశారు. అధికార పార్టీకి చెందిన తనకే మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అంటూ హడావుడి చేశారు. మీ సంగతి తేలుస్తానంటూ గొడవ చేసి గందరగోళం సృష్టించారు. ఆ మహిళా సెక్యూరిటీ గార్డు సహచర సిబ్బందికి, అధికారులకు, కార్మిక సంఘం నాయకులకు తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని రోదించింది. మెడికల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, కార్మిక సంఘం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించినటీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఈప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు చేశారు. దౌర్జన్యానికి కారణమేంటంటే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళా, శిశు విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తూ ఉండడంతో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించారు. మహిళా విభాగంలోకి నిర్దేశిత సమయాల్లో మినహా పురుషులను ఎవ్వరినీ అనుమతించరు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నిడమర్రు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ లోనికి వెళుతున్నారు. ఇదే సమయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి విధులు నిర్వర్తిస్తున్నారు. లోనికి వెళ్ళబోతున్న దివాకర్‌కు ఆమె చేయి అడ్డుగా పెట్టి ఆపింది. పురుషులు లోనికి వెళ్ళకూడదని వారించింది. దీంతో ఆగ్రహానికి గురైన జెడ్పీటీసీ సభ్యుడు మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి గుండెలపై చేయివేసి ఒక్కసారిగా వెనక్కి గెంటివేశారు. తాను ఎవరో తెలుసుకోకుండా అడ్డుపడతావా అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిడుతూ లోనికి వెళ్ళిపోయారు. ఆకస్మికంగా జెడ్పీటీసీ దాడి చేయటంతో నిశ్చేష్టురాలైన ఆమె తేరుకోలేకపోయింది. తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. నాయకులే ఇలా తమపై దాడులు చేస్తే ఇక రక్షణ ఏదంటూ విలపించింది. రాయ‘బేరాలు’ : మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై దౌర్జన్యానికి పాల్పడిన జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ సహచర సిబ్బంది, సంఘం నేతలు వచ్చేలోగానే అక్కడి నుంచి జారుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి సంఘటనలను సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమాచార్యులు, నేతలు పరిశీలించారు. సీసీటీవీ కెమేరాల్లో నమోదైన రికార్డుల ఆధారంగా అతను ఎవరనేది గుర్తించి జెడ్పీటీసీ దివాకర్‌గా నిర్థారించుకుని ఆయనకు ఫోన్ చేశారు. కేసు పెడతామని, తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించటంతో దిగివచ్చిన దివాకర్ రాజీమార్గంలోకి వచ్చారు. ఆసుపత్రి కాంట్రాక్టర్, ఇతర ప్రజాసంఘాల నేతలతో రాజీకి రాయబారాలు నడిపారు. క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై నిడమర్రు జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత హేయమైనది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. ఇప్పుడు ఏలూరులో టీడీపీ ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆమె గుండెలపై చేయివేసి గెంటివేయటం తీవ్రమైన నేరం. ఆయన వచ్చి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.– కే.కృష్ణమాచార్యులు, సంఘం జిల్లా అధ్యక్షుడు -
దగాపడ్డ చెల్లెమ్మ
రెండేళ్ల టీడీపీ పాలనలో మగువలకు రక్షణ కరువు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేయని ప్రభుత్వం మహిళలపై కొనసాగుతున్న రాక్షసకాండ తహసీల్దార్‌ను దుర్భాషలాడి ఈడ్చిపడేసిన టీడీపీ ఎమ్మెల్యే రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైనవారికి ప్రభుత్వ పెద్దల అండ కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అన్న సీఎం యువతులకు ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేయాలన్న బాలకృష్ణ తలవంపులు తెచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉపాధ్యాయురాలి పట్ల మంత్రి తనయుడి అసభ్య ప్రవర్తన అంగన్వాడీలు, ఆయాలపై లాఠీల కరాళ నృత్యం ప్రేమోన్మాదుల దాడుల్లో బలైపోతున్న యువతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళామణులు దగాపడ్డారు. ఎన్నికల్లో వారికి ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. సాక్షాత్తూ ప్రభుత్వమే వారిని వంచిస్తోంది. ‘‘మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కల్పించే దిశగా మహిళా సాధికారత ఉద్యమాన్ని తదుపరి స్థాయికి పార్టీ తీసుకెళుతుంది’’ అని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. మగువలకు సాధికారత, స్వావలంబన కల్పించే మాట అటుంచితే, మెజిస్టీరియల్ అధికారాలున్న తహసీల్దార్ స్థాయి అధికారినే దుర్భాషలాడి, ఈడ్చిపడేసిన రాక్షస ఘటన టీడీపీ పాలనలో చోటుచేసుకుంది. తహసీల్దార్ వనజాక్షిపై సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి, తీవ్రంగా అవమానించినా.. ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయింది. పైగా వనజాక్షిదే తప్పు అంటూ ముఖ్యమంత్రే ఈ దౌర్జన్యకాండకు వత్తాసు పలకడం గమనార్హం. వనజాక్షి చేసిన తప్పంతా ఒక్కటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీని అడ్డుకోవడం. తహసీల్దార్ పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్య మహిళల భద్రతకు భరోసా ఎక్కడుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళల పట్ల ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయి. నిందితులకు ప్రభుత్వ పెద్దలే అండగా నిలుస్తుండడంతో బాధితులకు న్యాయం ఎండమావిగానే మారుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వెకిలిగా మాట్లాడుతుండడం గమనార్హం. * నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య.. సర్కారు చేసిన హత్యేనని రాష్ట్రంలోని ప్రజా సంఘాలు నినదించాయి. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారికి ప్రభుత్వ పెద్దలు అండగా నిలవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థిని మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష వైఎస్సార్సీపీ శాసనసభలో గళమెత్తినా.. ప్రభుత్వం ఎదురుదాడికే పరిమితమైంది. * ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే ఏ అత్త మాత్రం వద్దంటుంది’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మహిళలపై ఆయనకున్న గౌరవం ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. * ‘‘యువతులు దగ్గరికి వస్తే ముద్దయినా పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి. నేను ఎక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు లేవు. మహిళలను గిల్లడాలు, పొడవడాలు నాకు మామూలే’’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత, నిరసన వ్యక్తమయ్యా యి. ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత బాలకృష్ణకు లేదంటూ నెటిజన్లు గళమెత్తా రు. ‘‘ఎమ్మెల్యేగా సరే.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మాట్లాడాల్సిన మాటలా అవి? ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా కొనసాగించడానికి సర్కారుకు సిగ్గుండాలి’’ అని సోష ల్ మీడియాలో మండిపడుతున్నారు. * మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్ మైనారిటీ వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సంచలనం సృష్టించింది. * తమ వేతనాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తే.. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రాక్షసంగా లాఠీఛార్జీ చేశారు. మహిళలను మగ పోలీసులు ఈడ్చిపడేశారు. ఇదేనా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే మర్యాద? న్యాయమైన డిమాండ్ సాధనకు ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై అంత కక్ష ఎందుకు? అంటూ ప్రజలు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. * రాష్ట్రంలో యువతులపై దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రేమోన్మాదుల చేతుల్లో ఎందరో బలైపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. హామీలను గాలికొదిలేశారు ‘మహిళా సాధికారత, భద్రత’ పేరిట టీడీపీ ఎన్నికల ప్రణాళికలో రెండు పేజీలు కేటాయించారు. అందులో పేర్కొన్న ఒక్క హామీనైనా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నెరవేర్చలేకపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితి ఏమిటో పరిశీలిద్దాం.... హామీ 1: బెల్టు షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం ప్రస్తుత పరిస్థితి: సంతకమైతే చేశారు.. అమలును మరిచారు. ఇప్పటికీ వాడవాడలా బెల్టు షాపులు నిక్షేపంగా కొనసాగుతున్నాయి. ప్రజల జీవితాలను గుల్ల చేస్తూనే ఉన్నాయి. మహిళల మంగళసూత్రాలను తెంపేస్తున్నాయి. వారి సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. హామీ 2: డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తాం ప్రస్తుత పరిస్థితి: ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదు. కేవలం పెట్టుబడి నిధి అంటూ మాట మార్చారు. హామీ 3: పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట ‘మహాలక్ష్మి పథకం’ కింద రూ.30 వేలు బ్యాంకులో వేసి, యుక్త వయసు వచ్చేసరికి రూ.2 లక్షలు అందిస్తాం ప్రస్తుత స్థితి: ఒక్క ఆడబిడ్డ పేరిట కూడా కొత్తగా ఒక్క పైసా అయినా బ్యాంకులో జమ చేయలేదు. హామీ 4: ‘పండంటి బిడ్డ’ పథకం కింద పేద గర్భిణిలకు పౌష్టికాహారం కోసం రూ.10 వేలు ఇస్తాం ప్రస్తుత పరిస్థితి: గర్భిణిలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. హామీ 5: పేద మహిళలకు స్మార్ట్ఫోన్లు ఉచితంగా ఇస్తాం. హైస్కూల్/ఇంటర్ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తాం ప్రస్తుత పరిస్థితి: మహిళలకు ఫోన్లు, విద్యార్థినులకు సైకిళ్ల జాడేలేదు. హామీ 6: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం ప్రస్తుత పరిస్థితి: ఫోర్స్ ఏర్పాటు కాదు కదా.. ఒక్క మహిళా కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. హామీ 7: ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణకు జీపీఎస్ టెక్నాలజీ సాయంతో సెల్‌ఫోన్ ద్వారా పోలీస్స్టేషన్లలోని అలారాన్ని అనుసంధానించి, 5 నిమిషాల వ్యవధిలో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ప్రస్తుత పరిస్థితి: ఇప్పటిదాకా ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. 5 నిమిషాలు కాదు కదా.. 5 రోజులైనా మహిళలకు సహాయం అందే పరిస్థితి లేదు. హామీ 8: మహిళా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మహిళా కమిషన్ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారిని నియమిస్తాం ప్రస్తుత పరిస్థితి: ఐపీఎస్ అధికారి నియమించడం ముఖ్యమంత్రికి క్షణంలో పని. కానీ, రెండేళ్లు పూర్తయినా నియామకం జరగలేదు. మహిళా ఉద్యోగులనూ వంచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా ఉద్యోగులను కూడా వంచించారు. పదో పీఆర్సీ నివేదికను అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్లపాటు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. రెండు నెలలపాటు పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. ఇంత మోసమా? అని మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనైనా.. మహిళలకు ఇచ్చిన అన్ని హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
'మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు'
హైదరాబాద్: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఆదివారం పీపుల్ ప్లాజాలో రోడ్డుభద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. మహిళల భద్రతపై షీ టీమ్స్‌తో నిఘా తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
నాతో తేడాగా ప్రవర్తిస్తేనా...
‘‘పిరికితనం చాలా ప్రమాదకరమైనది. అది మన ఎదుగుదలను ఆపేస్తుంది. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ, హైదరాబాద్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి కదా.. ఈ ప్రపంచంలో ఆడవాళ్లు సురక్షితంగా ఉండగలిగేదెక్కడ అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నాకు తెలిసినంతవరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్. అక్కడ స్త్రీలకు స్వాతంత్య్రం ఉంటుంది. మగవాళ్లతో సమానంగా అన్ని హక్కులూ ఉంటాయి. ఇక.. భద్రత గురించి చెప్పాలంటే భేష్. చాలా బాగుంటుంది. అందుకే నాకు లాస్ ఏంజిల్స్ అంటే ఇష్టం’’ అన్నారు. మీరు స్త్రీవాదా? అనడిగితే -‘‘అవును. పక్కా ఫెమినిస్ట్‌ని. స్త్రీవాదం అంటే.. మగవాళ్లపై నోరుపారేసుకోవడం కాదు. గోరంతను కూడా కొండంత చేసేసి మగవాళ్లపై విరుచుకుపడను. మగవాళ్లను చీడపురుగుల్లా చూడను. కానీ, నాతో తేడాగా ప్రవర్తిస్తే మాత్రం నేనేంటో చెబుతా. అలాంటి సందర్భాల్లో పిరికితనంగా ఉంటే ఆడించేస్తారు. అందుకే ధైర్యంగా ఎదుర్కొంటా. మా అమ్మ (సారిక) గారి నుంచి వచ్చిన అలవాటు ఇది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నాకు తెలిసి ఇప్పటివరకూ తను ఏ విషయానికీ భయపడలేదు. నేను కూడా మా అమ్మలానే’’ అని చెప్పారు.