Women Journalist
-
బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్ అంటూ మహిళ జర్నలిస్ట్‌పై దాడి!
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు, హిందువులు, మైనార్టీలే టార్గెట్‌గా కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టును మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఆమెను భారత ఏజెంట్ అంటూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారంటూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను కొందరు టార్గెట్ చేశారు. గుంపుగా వచ్చిన కొంతమంది.. ఢాకాలో ఆమెను చుట్టుముట్టారు. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని వారు ఆరోపించింది. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు.. ఆమెను రక్షించారు. అనంతరం, ఆమెను తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, మున్నీ సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బంగ్లా ప్రభుత్వ వైఖరిని భారత్ ప్రభుత్వం సైతం తప్పుపడుతోంది. Bangladeshi TV journalist Munni Saha's car was intercepted by radical in Dhaka.The Radical mob accused her of being an Indian agent and a supporter of the former Hasina govt.Later on she was arrested by Dhaka police based on the allegations levelled by Radical .… pic.twitter.com/icHcUIuZZt— MÃHĘŠH ŸĐV (@MkYdv97) December 1, 2024 -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
విలువలు పాటించినప్పుడే జర్నలిస్టులకు గౌరవం
సాక్షి,సనత్‌నగర్: న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలో వారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మించే సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. సమావేశానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా గొంతెత్తితే ఆపేందుకు ‘టెక్ ఫాక్స్’ద్వారా వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వారిని అణచడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ పత్రిక రంగంలోని అన్ని పాత్రలను తానే పోషించి కాకతీయ అనే పత్రికను నడిపారని ఎమ్మెల్సీ వాణీదేవి గుర్తు చేశారు. జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సిందే
ముంబై: ‘మరణశిక్ష అనేది దోషులకు పశ్చాత్తాపం నుంచి వెంటనే విముక్తి పొందేలా చేస్తుంది. జీవితఖైదు విధిస్తేనే వారు జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోతారు’ అంటూ సామూ హిక అత్యాచార కేసు దోషుల మరణశిక్ష నుంచి జీవితఖైదుకు తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘ రేప్ అనేది అత్యంత హేయమైన చర్య. బాధితురాలు శారీరకంగానే కాదు మానసికం గానూ అత్యంత వేదనకు గురవుతారు. మహిళ గౌరవాన్ని కించపరుస్తూ, అత్యంత తీవ్రస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిన ఈ దోషులెవరూ జీవితకాలంలో ఎన్నడూ సమాజంలోకి తిరిగి వెళ్లలేరు. జీవితాంతం తమ ఘోరమైన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షే సరైంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్ట్ 22న సెంట్రల్ ముంబైలోని నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై ఐదుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఐదుగురుకీ మరణశిక్ష విధిస్తూ ఏడేళ్ల క్రితమే ట్రయల్ కోర్టు శిక్ష ఖరారుచేసింది. వీరిలో విజయ్ జాధవ్, మొహమ్మద్ ఖాసిం బెంగాలీ షేక్, మొహమ్మద్ అన్సారీ మరణశిక్షను సవాల్ చేస్తూ 2014 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ సాధనా జాధవ్, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌ల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ‘ దోషులకు మరణశిక్ష సరిపోదు. అంతకు మించిన శిక్ష విధించాలి. జీవితాంతం వీరు పశ్చాత్తాపంతో కుంగిపోవాలనే ఉద్దేశంతోనే, కింది కోర్టు ఖరారుచేసిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ‘ ఏ నేరానికి ఏ శిక్ష అనే విధానంలో.. ఇలాంటి దారుణమైన ఘటనల్లో మరణశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించాలనే ఒక నియమంగా పెట్టాలి’ అని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ‘సంచలనం రేపిన ఈ కేసులో ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు చెప్పడం కుదరదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!
Afghanistan Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్ మెహ్ ముర్సల్ అమిరి వెల్లడించారు. అఫ్గాన్ నేషనల్ టీవీకి చెందిన ఆర్టీఏ స్టూడియోస్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్ వేసుకున్నందుకు, హిజాబ్ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు. ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంధకార భవితవ్యం... దేశంలో స్త్రీల భవిష్యత్ అంధకారంలోకి జారిందని ముర్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్‌షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్ చెప్పారు. స్టేషన్లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్‌పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు. హక్కులు కోల్పోయాం పౌర పాలనలో తాను హిజాబ్ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్‌తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు. భయంలో మహిళా క్రీడాకారులు తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్ విజ్ఞప్తి అఫ్గానిస్తాన్‌లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ షబ్నం మొబరెజ్ ఫిఫా(ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్ మెంబర్స్ అఫ్గాన్‌లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు. ఫుట్‌బాల్ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటైంది. 2012లో ఖతార్‌పై గెలుపుతో ఈ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ కిట్స్‌ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
చిన్న కారణంతోనే మహిళా జర్నలిస్ట్ వేలు విరిచిన గార్డు
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక వార్తా వెబ్సైట్లో ఫేజె మోమెని అనే మహిళా జర్నలిస్ట్ పనిచేస్తుంది. ఈ కోవిడ్ సమయంలో టీకా ప్రక్రియ గురించి ఒక నివేదికను తయారు చేస్తున్నప్పుడు మే 18న రాష్ట్ర టీకా కేంద్రం వద్ద ఉన్న గార్డు ఆమెను కొట్టారు. టీకా కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా జర్నలిస్టును బెహేష్తి మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏజెంట్ కొట్టాడని ప్రభుత్వ ఈటెమాడ్ ఆన్లైన్ వెబ్సైట్ తెలిపింది. అప్పటివరకు సేకరించిన అన్ని ఇంటర్వ్యూలను డిలీట్ చేయమని గార్డు ఆమెను కోరాడు దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే అతను ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వేలు విరిగింది. అయితే, అక్కడ స్థానికులు ఫేజేను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తనకు గాయాల ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె కేంద్రంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహించిందని, అయితే వాటిని తొలగించమని సెక్యూరిటీ గార్డు ఆమెకు చెప్పారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఆ దేశంలో నిదానంగా జరగుతున్న కోవిడ్ -19 టీకా ప్రచారం గురించి మీడియా, నిపుణులు పదేపదే ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శిస్తున్నారు. మరి మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడి యాదృశ్చికంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారో ఇంకా తెలియదు. ఇస్లామిక్ రిపబ్లిక్ లో మహిళలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల నిరుద్యోగం తీవ్రంగా పెరగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ -
జాబ్ వదిలేయలేదని భార్యను కాల్చిచంపాడు..
ఇస్లామాబాద్ : ఉద్యోగం వదిలివేయలేదనే ఆగ్రహంతో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్‌ను ఆమె భర్త కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఏడు నెలల కిందటే వీరి వివాహం జరగ్గా ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఉరూజ్ ఇక్బాల్ (27) ఉర్దూ పత్రికలో పనిచేస్తోంది. సెంట్రల్ లాహోర్‌లోని కిలా గుజ్జర్ ప్రాంతంలోని తన కార్యాలయంలోకి ఆమె ప్రవేశించిన క్రమంలో జర్నలిస్టుగా పనిచేసే ఆమె భర్త దిలావర్ అలీ నేరుగా ఆమె తలపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఉరూజ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. కాగా, మరో ఉర్దూ పత్రికలో పనిచేస్తున్న ఆమె భర్త దిలావర్ అలీపై ఉరూజ్ సోదరుడు యాసిర్ ఇక్బాల్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.ఏడు నెలల కిందట తమ సోదరి అలీని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఆమెను అలీ వేధింపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం మానేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదులో ఇక్బాల్ పేర్కొన్నారు. అలీపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఈ ఘాతుకం జరిగిందని చెప్పారు. భర్త తీరుతో విసిగిపోయిన తమ సోదరి ఉర్దూ పత్రిక కార్యాలయ భవనం పక్కనే ఓ గదిలో ఉంటోందని ఇక్బాల్ తెలిపారు. కాగా హత్య జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం పరిశీలిస్తున్నామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
మీటూ ప్రకంపనలు : ఆ మంత్రి చేష్టలతో అవాక్కయ్యా..
సాక్షి, న్యూఢిల్లీ : మీటూ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ పెనుదుమారం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ మాజీ చీఫ్‌ను తొలగించగా తాజాగా యూపీఏ వన్ హయాంలో ఓ కేంద్ర మంత్రి తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన తాను గుజరాత్లో ఏషియన్ ఏజ్ పత్రిక మూతపడటంతో 2006లో ఢిల్లీకి బదిలీ అయ్యానని సోనాల్ కెల్లాగ్ అనే మహిళా జర్నలిస్టు చెప్పారు. అక్కడ ఓ కేంద్ర మంత్రి వార్తలను కవర్ చేసే బాధ్యత తనకు అప్పగించారన్నారు. సదరు కేంద్ర మంత్రి న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో చదివిన అనంతరం మాస్టర్స్ డిగ్రీ కోసం ఇంగ్లాండ్ వెళ్లివచ్చారని చెప్పుకొచ్చారు. ఆ మంత్రి తనను కలిసిన ప్రతిసారీ తనను ముద్దు పెట్టుకోవడం చిరాకు తెప్పించేదని కెల్లాగ్ డైలీఓకు తనకెదురైన అనుభవాలను వివరిస్తూ వెల్లడించారు. గుజరాత్లో రాజకీయ నేతలు ఎన్నడూ ముద్దులు, కౌగిలింతలతో పలకరించేవారు కాదని, ఇది ఢిల్లీ సంస్కృతి అని తాను సరిపెట్టుకున్నానని చెప్పారు. ఇక 2014లో ఢిల్లీలోని ఎంపీ బంగళాలో మంత్రి తన పట్ల మరోసారి అమర్యాదకరంగా వ్యవహరించారన్నారు. మంత్రి వాష్‌రూమ్‌కు వెళుతూ అనూహ్యంగా తన ఛాతీపై చేయి వేశారని, తనను టచ్ చేయవద్దని మంత్రిని గట్టిగా మందలిస్తే ఎందుకు అంటూ ప్రశ్నించారని చెప్పారు. ఇక అప్పటినుంచి తాను మంత్రిని ఎన్నడూ కలవలేదని, మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న క్రమంలోనే తాను మౌనం వీడానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరనేది ఆమె వెల్లడించలేదు. -
మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య
రూస్ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో యూరోప్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బల్గేరియన్ మహిళా జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా దారుణంగా హత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను దుండగులు అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన రూస్ పట్టణంలో చోటుచేసుకుంది. మారినోవా బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని వెలికితీసి ఒక్కసారిగా ఐరోపాను ఉలిక్కిపడేటట్టు చేశారు మారినోవా. ప్రస్తుతం మారినోవా ‘డిటెక్టర్’ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దుండగలు మారినోవాను అమానవీయరీతిలో దారుణంగా హత్య చేశారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపిన కిరాతకులు, పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్‌కు సమీపంలో పడేశారు. అయితే మారినోవా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మారినోవా మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి. మారినోవా హత్య విషయం తెలిసిన బల్గేరియా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ కూడా బల్గేరియాను కోరాయి. -
జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పిన గవర్నర్
చెన్నై : విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్ట్ పట్ల తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కోరారు. అసలేం జరిగిందంటే.. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
-
మహిళా జర్నలిస్ట్ పై మంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. -
ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం
ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ కళా, సాంకేతిక, వ్యాపారం వంటి వివిధ రంగాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోన్న మణిహారికలు ఈ అతివలు. సుధా మూర్తి, రచయిత్రి పొదుపు చేయటంలో మహిళలు దిట్ట అంటారు. అలా ఒకానొక నాడు సుధా మూర్తి పొదుపు చేసిన 10 వేల రూపాయలు ఆమె భర్త స్థాపించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పెట్టుబడిగా ఉపయోగపడ్డాయి. 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పట్టా పొందిన మొదటి మహిళా ఇంజనీర్గగా చరిత్రకెక్కారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, పేద విద్యార్థుల విద్యకై నిధులు వెచ్చించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రచయిత్రిగా గుర్తింపు పొందారు. 13 పుస్తకాలు రచించారు. వాటిలో రెండు ఆంగ్ల రచనలు కూడా ఉన్నాయి. రోహిణి నీలేకని, సామాజిక కార్యకర్త భారత వ్యాపారవేత్త నందన్ నీలేకని భార్య. సామాజిక కార్యకర్త. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అక్షర ఫౌండేషన్ ద్వారా సుమారు లక్ష మంది పిల్లలకు సాయం అందిస్తున్నారు. నిరాండంబర జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. ఫరాఖాన్, కొరియోగ్రాఫర్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఫరాఖాన్. కొరియోగ్రాఫర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా, పలు టీవీ షోల నిర్వహణకర్తగా ప్రాచుర్యం పొందిన ఫరాఖాన్ తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్ ‘మై హూ నా’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఓం శాంతి ఓం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. లీలా శాంసన్, నృత్యకారిణి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కళాక్షేత్రంలో అడుగుపెట్టి, దివ్యఙ్ఞాన పాఠశాలలో చేరిన తర్వాత కళనే ఊపిరిగా భావించారు. భరతనాట్యం సాధన చేసి, కళాక్షేత్రంలో తన వంటి ఎందరో నృత్యకారులను తయారు చేసేందుకు నాట్య పాఠాలు నేర్పుతున్నారు. ఆశా భోస్లే, గాయని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ సోదరిగానే కాకుండా మధురమైన గాత్రంతో అందరినీ అలరించే గాయనిగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆశా భోస్లే. సుమారు ఆరు దశాబ్దాలుగా తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా పాటలే కాకుండా, సంప్రదాయ సంగీతంతో పాటు గజల్స్, భజనలు, కవ్వాలీలు ఆలపిస్తారు. హిందీలోనే కాకుండా మరెన్నో ఇతర భాషల్లో పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో అత్యధిక పాటలు రికార్డు చేయబడిన సింగర్‌గా ‘గిన్నిస్ బుక్ రికార్డు’ సాధించారు. మల్లికా శ్రీనివాసన్, వ్యాపారవేత్త భారతదేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘టాఫె’ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాఫెలో జనరల్ మేనేజర్‌గా చేరి 86 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ బాధ్యతలు చేపట్టి 2600 కోట్లకు చేర్చారు. రూపా పురుషోత్తమన్, ఆర్థిక నిపుణురాలు ప్రతిష్టాత్మక ‘యేల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ నుంచి పట్టా పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి యాజమాన్య సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బ్రిక్స్ దేశాల ఎకానమి ప్రశంసా పత్రాల సహరచయితగా వ్యవహరించారు. న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి ప్రస్తుతం ముంబైలోని ఆర్థిక సంస్థ పాంటాలూన్ రీటైల్లో పనిచేస్తున్నారు. ఆమె భర్త న్యూయార్క్ సిటీ ఎడుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఏక్తా కపూర్, ప్రొడ్యూసర్ సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేతగా, సినీ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సీరియళ్లు, సినిమాలు నిర్మించారు. బోల్డ్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘నేను ఇంట్లోనూ పని చేస్తాను.. పనిచేసే ప్రదేశం కూడా నాకు ఇల్లు వంటిదే’ అంటూ వృత్తి పట్ల తన నిబద్ధతను తెలియజేశారు. ప్రేమ ధన్‌రాజ్ ఎనిమిదేళ్ల ప్రాయంలో కాలిన గాయాలతో సీఎమ్సీ వెల్లూర్ ఆస్పత్రికి చేరారు ప్రేమ ధన్‌రాజ్. తల్లి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించి, నేడు అదే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. బర్న్ విక్టిమ్స్(కాలిన గాయాలతో బాధపడేవారు ) కోసం పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె దేవున్ని నమ్ముతారు. ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తారు. రోజుకు 18 గంటలు పనిచేస్తారు.‘ఒకరితో ఎప్పుడు పోల్చుకోకు. ఏ సత్యాన్రైనా ధైర్యంగా స్వీకరించి, జీవితంలో ముందుకు సాగు’అనేది ఆమె పాటించే జీవన సత్యం. షాయెస్తా అంబర్ అఖిల భారత ముస్లిం మహిళా వ్యక్తిగత లా బోర్డు స్థాపించి సంస్కరణలు తీసుకువచ్చేందుకు పాటుపడ్డారు. ఖురాన్ పేరిట ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్న మౌల్వీల వ్యవహార శైలిని ప్రశ్నించారు. ఈ కారణంగా ఆమె మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ఉర్దూ- పర్షియన్ సాహిత్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. లక్నో పరిసర గ్రామాల్లో ‘గాడ్‌మదర్’గా పేరు పొందారు. ‘ఒక ముస్లిం మహిళగా నా భర్త ఆదేశాలు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. కానీ నేను చేసే ప్రతీ పనికి ఆయన సహకారం ఉంటుందని’ పేర్కొన్నారు. సోనియా మన్చంద్ర, డిజైనర్ పాంటాలూన్, న్రిత్యగ్రామ్ వంటి ప్రముఖ కంపెనీలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. 35 మందితో ప్రారంభమైన ఆమె ‘ఎ న్యూ ఇడియమ్’ నేడు 125 మందికి చేరి భారత్‌లో అతిపెద్ద డిజైనర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ‘కంపెనీ ప్రారంభించిన మొదట్లో డిజైన్లు చూపించేందుకు హోటల్‌కి రావాల్సిందిగా ఒక కస్టమర్ కోరారు. తీరా అక్కడికి వెళ్లాక నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ’ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. లక్ష్మీ పురి, దౌత్యవేత్త జెనీవాలోని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సంస్థకు భారత దౌత్యవేత్తగా వ్యవహరించారు. వాణిజ్య రంగంలో భారత్ అభివృద్ధికై తన వంతు కృషి చేశారు. పరిపూర్ణమైన, శాంతయుతమైన, భద్రత కలిగిన ప్రపంచ రూపకల్పనకై కృషి చేసినందుకు ఐక్యరాజ్య సమితి అందించే ‘పవర్ ఆఫ్ వన్ అవార్డు’ అందుకున్నారు. మంజులా రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘బెస్ట్ బేకరీ కేసు’ (2002లో వడోదరలో జరిగిన అల్లర్లలో 14 మంది మరణించారు) కోసం ప్రత్యేక న్యాయవాదిగా నియమితులైన సమయంలో కేసు గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు గుజరాతీ నేర్చుకుని మరీ వాదించారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రముఖ మాజీ క్రికెటర్ సీకె నాయుడు మనుమరాలు. బాంబే వాలీబాల్, బాడ్మింటన్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. మీనాక్షీ చౌదరి, ఊర్వశి గులాటి, కేశ్నీ ఆనంద్ అరోరా(ఐఏఎస్ అధికారిణిలు) ఈ ముగ్గురు సోదరీమణులే ఒకప్పుడు పరోక్షంగా హర్యానా ప్రభుత్వాన్ని నడిపించారు. ఎలాగంటే.. చౌదరి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, గులాటి వైద్య, విద్య కార్యదర్శిగా, అరోరా హోం ప్రత్యేక కారదర్శిగా పనిచేశారు. పంజాబ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూతుళ్లైన వీరు ముగ్గురు పనిచేసే చోట తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సిస్టర్ సుధా వర్గిస్, సామాజిక కార్యకర్త పేదరికం వల్ల ఎలుకలనే ఆహారంగా తీసుకునే ‘ముసహర్ల’(బీహార్‌లోని ఎస్సీ వర్గం) ఉద్ధరణకై కేరళ నుంచి బీహార్‌కు వెళ్లారు. వివిధ కేసుల నుంచి వారిని విముక్తి చేసేందుకు న్యాయ విద్యనభ్యసించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రష్మీ సింగ్, నేవీ అధికారిణి భారత్‌లో మొదటి మహిళా స్కైడైవింగ్ శిక్షకురాలు. 400 సార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆమె, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ సముద్రంలో ఉండగానే డైవింగ్ చేస్తూ డెక్‌పై ల్యాండ్ అయ్యారు. వైజాగ్‌లోని నౌకాదళ ఎయిర్‌బేస్‌లో ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌గా పనిచేశారు. రుత్ మనోరమ, హక్కుల పరిరక్షణకర్త జాతీయ మహిళా కూటమి అధ్యక్షురాలిగా పనిచేశారు. దళితుల సమస్యల పరిష్కారానికై పోరాడారు. దళితుల్లో దళితులుగా పరిగణింపబడుతున్న దళిత మహిళల హక్కులకై కృషి చేశారు. అషూ సూయశ్, ఆర్థిక నిపుణురాలు సిటీగ్రూప్ సంస్థలో చాలా ఏళ్లు సీఏగా పనిచేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ మ్యూచ్‌వల్ ఫండ్ సంస్థను బోస్టన్‌లో ప్రారంభించారు. దేశీయంగా 3600 కోట్ల టర్నోవర్, అంతర్జాతీయంగా 250 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో కంపెనీని అభివృద్ధి పథంలో నడిస్తున్నారు. భారత పెట్టుబడి రంగంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అనురాధా పాల్, తబలా వాయిద్యకారిణి పురుషులు మాత్రమే తబలా వాయిద్యకారులుగా ఉన్న సమయంలో మహిళా వాయిద్యకారిణిగా తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. ఆల్ ఉమన్ పర్కుషన్ బ్యాండ్, స్త్రీ శక్తిని స్థాపించారు. అన్ని రకాల సంగీతాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేశారు. లతికా ఖనేజా, స్పోర్ట్స్ మేనేజర్ ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఒలంపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాలకు స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐఐఎమ్ కలకత్తా నుంచి పట్టభద్రురాలైన లతిక వ్యాపార ఒప్పందాలు కుదర్చటంలో దిట్ట. అనితా నాయర్, రచయిత్రి కేరళకు చెందిన ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత్రి. సాహిత్య రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా 2012లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆమె రచనలు విదేశీ భాషల్లో కూడా ప్రచురితమయ్యాయి. ప్రియాదత్, రాజకీయ వేత్త బాలీవుడ్ దంపతులు సునీల్‌దత్, నర్గీస్‌ల కుమార్తెగా, సంజయ్‌దత్ సోదరిగా సుపరిచితమైన ప్రియాదత్ రాజకీయవేత్త కూడా. 2005లో తండ్రి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై నార్త్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ప్రచారం నిర్వహించి, కార్యక్షేత్రంలో మహిళలు ఎంతటి కష్టనష్టాలకైనా వెరవరని నిరూపించారు. పద్మా రవిచందర్, ఐటీ నిపుణురాలు భారత సాంకేతిక రంగంలో శక్తిమంతమైన మహిళగా పద్మా రవిచందర్ పేరు పొందారు. బహుళజాతి కంపెనీ ‘పెరోట్ సిస్టమ్’ను ఒంటిచేత్తో నడిపిస్తూ తన కౌశల్యాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని టెక్నోట్రీ సంస్థకు సీఈఓగా ఉన్నారు. రూపా గంగూలీ, నటి మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు మరల్చుకున్నారు ఈ బెంగాలీ నటి. తూర్పు భారతదేశంలో ఉన్న అతికొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఒకరు. వృద్ధులు, అనాథలను చేరదీసే ఎన్జీవోకి మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. బెలిందా రైట్, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కలకత్తాలో జన్మించిన బెలిందా నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్‌గా, ‘లాండ్ ఆఫ్ టైగర్’ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ మేకర్‌గా ఎన్నో అవార్డులు పొందారు. పులుల సంరక్షణకై ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. వినీతా బాలి, వ్యాపారవేత్త భారతీయ మహిళా వ్యాపారవేత్త. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(బీవరేజెస్, ప్యాకేజ్డ్ ఫుడ్స్) వ్యాపారంలో ప్రవేశించి అనతికాలంలోనే విజయవంతమయ్యారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
క్రికెటర్ పై వెల్లువెత్తిన సెక్స్ ఆరోపణలు
వెల్లువెత్తిన సెక్స్ ఆరోపణలు వివాదంలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ బీబీఎల్నుంచి గేల్ అవుట్! మహిళా జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూ వివాదాన్ని గేల్ ‘సారీ’తో ముగించాలని ప్రయత్నించినా... ఇది అంత తొందరగా సద్దుమణిగేలా లేదు. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు గేల్‌ను పూర్తిగా లీగ్నుంచే బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే గేల్‌కు జరిమానా విధించిన అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ మున్ముందు పూర్తిగా గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వచ్చే ఏడాది ఏ జట్టు తరఫున కూడా గేల్‌ను కొనసాగించరాదని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. సిడ్నీ: క్రిస్ గేల్ అంటే పరుగుల సునామీ సృష్టించే విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు...మంచి ‘కళా పోషకుడు’ కూడా అని అతని ఫోటోలు, సోషల్ నెట్‌వర్క్‌లో వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఎన్నో సార్లు కొత్త కొత్త అమ్మాయిలతో సరదాగా గడుపుతూ గేల్ చిత్రాలు పోస్ట్ చేశాడు. మైదానం బయట తన వ్యక్తిగత జీవితాన్ని అతను ఎప్పుడూ దాచుకోలేదు. అయితే ఇప్పుడు ఇది కాస్తా శృతి మించి విషయం బహిరంగ వేదికపై వచ్చే సరికి అతని లీలలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. సోమవారం ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌తో అభ్యంతరకర సంభాషణ వెలుగులోకి వచ్చిన తర్వాత గతంలో గేల్‌తో ఇబ్బంది పడిన మరి కొందరు మహిళా జర్నలిస్ట్‌లు ముందుకు వచ్చి అతని ప్రవర్తన గురించి గుట్టు విప్పుతున్నారు. ‘గేల్ ఇలా వ్యవహరించడం ఇది మొదటి సారి కాదు. అతను చాలా సార్లు ఇదే పని చేశాడు. అతనో దుర్మార్గుడు’ అని ఫాక్స్ స్పోర్ట్స్ రిపోర్టర్ నెరోలి మెడోస్ వెల్లడించింది. 2011లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ‘నీ అందాన్ని చూస్తూ ప్రశ్న వినలేకపోయాను’ అని గేల్ వ్యాఖ్యానించాడని ఆమె చెప్పింది. ‘ట్విట్టర్ ద్వారా నన్ను ఒకసారి డిన్నర్‌కు రమ్మన్న గేల్, ఇంటర్వ్యూ తర్వాత డేటింగ్‌కు వెళదామని కోరాడు. అతడికి ఆడవాళ్లంటే పిచ్చి’ అని నైన్ న్యూస్ రిపోర్టర్ వోని సాంప్సన్ ఆరోపించింది. మరో వైపు ప్రపంచ కప్ సందర్భంగా ఒక మహిళతో డ్రెస్సింగ్ రూమ్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలను గేల్ ఖండించాడు. ‘అదంతా పూర్తిగా అబద్ధం. మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారం. ఇకపై ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్య తీసుకుంటాం’ అని గేల్ తరఫున అతని ఏజెంట్ ప్రకటన జారీ చేశారు. తాజా ఆరోపణలను గేల్ బిగ్‌బాష్ జట్టు మెల్బోర్న్ సీఈ స్టువర్ట్ కోవెంట్రీ ‘అవకాశవాదం’గా కొట్టిపారేశారు. సిడ్నీ ఘటనకు సంబంధించి విక్టోరియా క్రికెట్ సంఘం విచారణ తర్వాతే తాను ఈ వ్యాఖ్య చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అటు తన స్వదేశంలో జమైకాలోనూ గతంలో ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా మాట్లాడాడని గేల్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం ప్రతి ఏడాది భారత్‌లో రెండు నెలల పాటు ఉండే గేల్... ఇప్పటివరకైతే వివాదాల్లో లేడు. అయితే వరుసగా కొత్తకొత్త మహిళలు బయటకు వస్తున్న నేపథ్యంలో... భారత్‌లోనూ ఎవరైనా బయటకు వచ్చి గేల్ గురించి చెబితే... తను మరిన్ని సమస్యల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.