Women kidnapping case
-
పల్నాడు: మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ట్విస్ట్
-
అనంతపురం: కిడ్నాప్ కథ సుఖాంతం
-
యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, అనంతపురం : కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నగరంలోని ఆజాద్‌నగర్‌లో ఈ నెల రెండో తేదీన కిడ్నాప్‌కు గురైన జ్యోతి, కానిస్టేబుల్ భగీరథ ఆచారి తదితరులను బనగానిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెల్పిన వివరాల మేరకు... అనంతపురంలోని ఆరో రోడ్డుకు చెందిన గోపీనాథ్ ఆచారి కూతురు జ్యోతికి గతేడాడి అక్టోబర్‌లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన భగీరథ ఆచారి (కానిస్టేబుల్)తో నిశ్చితార్థం కాగా, అదే ఏడాది డిసెంబర్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి రద్దయ్యింది. చదవండి: 'ప్రతీది వక్రీకరించటం చంద్రబాబుకు అలవాటే' ఈ నెల 2న సాయంత్రం జ్యోతి, తన బంధువు(మహిళ)తో కలసి ఆజాద్‌నగర్‌లోని టైలర్ షాప్‌కు వెళ్లింది. అక్కడ కొందరు స్కార్పియో వాహనంలో వచ్చి జ్యోతిని తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సత్యయేసుబాబు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై సీఐ కత్తి శ్రీనివాసులు తదితరులతో పాటు పలు బృందాలను రంగంలోకి దింపారు. ఈ నెల 2న తాడిపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండడాన్ని గమనించిన భగీరథ ఆచారి తదితరులు స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లి, మరో జిస్ట్ వాహనంలో వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి అవుకు, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. మంగళవారం కోవెలకుంట్ల మార్గంలో కానిస్టేబుల్ భగీరథ ఆచారి, జ్యోతిలను బనగానిపల్లి సీఐ అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి స్టేట్మెంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. 2వేల మంది బాలల గుర్తింపు అనంతపురం క్రైం: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మంది బాలలను గుర్తించినట్లు జిల్లా పోలీసు శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో 1,674 మంది బాలురు, 326 మంది బాలికలు ఉన్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: యువతి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్ కారులో ఎక్కించుకుని హయత్‌నగర్ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది. మీడియా కంట పడకుండా... ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ఎల్బీనగర్ సీసీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్ ఘటనపై రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్ఎస్తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం. -
నా కుమారుడు చచ్చినా పర్వాలేదు
కంకిపాడు (పెనమలూరు): ఎన్నో దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడు రవిశేఖర్ చచ్చిపోయినా పర్వాలేదని తల్లి చిట్టిమ్మ కన్నీటి పర్యంతం అయ్యింది. హైదరాబాద్ పరిధిలోని హయత్‌నగర్‌లో విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అతని స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు వచ్చారు. రవిశేఖర్ కొడుకు రాజాను అదుపులోకి తీసుకుని విజయవాడలోని విచారణ బృందానికి అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతన్ని తల్లి చిట్టమ్మ మీడియాతో మాట్లాడుతూ పెళ్లయిన తరువాత రవిశేఖర్ గాడి తప్పాడని చెప్పింది. డబ్బు, బంగారంపై వ్యామోహంతో నేరాలకు పాల్పడ్డాడని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదన్నారు. ఐదేళ్ల క్రితం కోడలు లక్ష్మి చనిపోయిందని, ఆ దినం రోజునే రవిశేఖర్‌ను చూశానని, మళ్లీ చూడలేదని చెప్పింది. తన కొడుకు చచ్చిపోయినా పర్వాలేదని ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని, తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని పోలీసు శాఖను కోరింది. పింఛను డబ్బుతో, మనవడి తోడుతో బతుకుతున్నానని, తన మనవడిని విడిపించాలని విలపించింది. ఎన్కౌంటర్ చేసినా బాధపడం: రవి శేఖర్ సోదరుడు వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచే ఎన్నో తప్పులు చేశాడని, మందలించినా మార్పు రాలేదని రవిశేఖర్ సోదరుడు వెంకటేశ్వరరావు అన్నారు. తప్పు మీద తప్పులు చేస్తున్న రవిశేఖర్‌ను ఎన్కౌంటర్ చేసినా తాము బాధపడమన్నారు. రాజాను అప్పగించాలని కోరారు. రవిశేఖర్‌పై ఎన్నో కేసులు.. ఐతం రవిశేఖర్ది కంకిపాడు మండలం దావులూరు. ఇతనిపై ఎన్నో కేసులు ఉన్నాయి. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలో రెండు చీటింగ్ కేసులు, రెండు చోరీ కేసులు, ఒక బైండోవర్ కేసు ఉంది. విజయవాడ సిటీ పరిధిలో 12 కేసులు ఉండగా, జిల్లాలో మరో 7 వరకూ కేసులు ఉన్నట్లు పోలీసు శాఖ చెబుతోంది. చిన్న తనం నుంచి తప్పు దోవలో నడుస్తున్న రవిశేఖర్ పెళ్లి అయ్యాక బంగారం, డబ్బుపై వ్యామోహం పెంచుకుని దారుణాలకు పాల్పడుతున్నాడని, తమకు తలవంపులు తెస్తున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రవిశేఖర్‌కు, కుటుంబ సభ్యులకు ఐదేళ్లుగా సంబంధాలు లేవని, అలాంటప్పుడు విచారణ కోసం రాజాను అదుపులోకి తీసుకోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ నేతపై లైంగికదాడి యత్నం కేసు
కాకినాడ క్రైం : అధికార గర్వంతో కాకినాడలో తెలుగుదేశం పార్టీ నేతల అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల భూ దందాలు, మహిళల కిడ్నాప్ కేసుల్లో అధికార దర్పాన్ని ప్రదర్శించి కొందరు దొరికిపోయారు. ఇలాగే ఓ నేత మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. పోలీసులు కూడా అధికారపక్షం నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన విశ్వనాథుల రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంటారు. ఆమెకు దూసర్లపూడి వారి వీధికి చెందిన సీమకుర్తి స్వాతిశ్రీ పరిచయమయ్యారు. ఆమె తన అప్పులు తీర్చుకునేందుకు కొంత సొమ్ము అప్పుగా ఇవ్వాలని రామలక్ష్మిని కోరారు. దీంతో రామలక్ష్మి మరో పది మంది నుంచి కొద్ది మొత్తంలో అప్పు తీసుకుని దానిని స్వాతిశ్రీకి అందజేశారు. రామలక్ష్మికి స్వాతిశ్రీ రూ.13 లక్షలు అప్పుపడింది. వడ్డీతో కలిసి రూ.25 లక్షలు కావడం, డబ్బు ఇచ్చిన వారు రామలక్ష్మిపై ఒత్తిడి తీసుకురావడంతో సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందిగా స్వాతిశ్రీని రామలక్ష్మి కోరారు. దీంతో వారి మధ్య వివాదం జరిగింది. కాకినాడ రంగయ్యనాయుడు వీధికి చెందిన తెలుగుదేశం నాయకుడు పినిశెట్టి సతీష్ వారికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. రామలక్ష్మి అప్పుల వ్యవహారం సర్దుబాటు అయ్యాక రూ.లక్ష మిగిలింది. దీంతో రూ. 20 వేలు ఖర్చులు తీసుకుని మిగిలిన రూ.80 వేలు తనకు ఇవ్వాల్సిందిగా సతీష్‌ను రామలక్ష్మి కోరారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆమెపై సతీష్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగికదాడి చేసేందుకు యత్నించాడు. దీంతో రామలక్ష్మి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై లైంగికదాడికి సతీష్ యత్నించాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సతీష్‌పై 354, 420, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే సతీష్‌పై కేసు నమోదైనట్లు త్రీ టౌన్ పోలీసులు అతనికి నోటీసు జారీ చేసి మిన్నకుండిపోయారు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై త్రీటౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. ప్రసాదరావును వివరణ కోరగా.. కేసు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. ఏడేళ్లలోపు శిక్షపడే నేరాలలో నిందితులను అరెస్టు చేసే అధికారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తాము లేదా కోర్టు వారు పిలిచినప్పుడు హాజరు కావాలని నోటీసులు మాత్రం ఇస్తామన్నారు. సతీష్‌కు కూడా నోటీసు జారీ చేశామన్నారు. రామలక్ష్మి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.