women suffer
-
నల్లగా మారిన మహిళ చేయి.. కారణం తెలిస్తే షాక్
చండీఘడ్: గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వినిత, సర్పరాజ్ దంపతులు. అయితే, వినిత దుండహేరా గ్రామంలోని పార్క్ అనే ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 23న గర్భ విచ్చిత్తి చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు యాంటి బయోటిక్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. ఆమె కుడి చెయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులను మార్చారు. అయినా ఆమెలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆమెను ఎక్స్‌రే తీశారు. దీంట్లో ఆమె చేయి నల్లగా మారడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్కు గురైందని తెలిసింది. కాగా, ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పార్క్ వైద్య సిబ్బంది సలహ ఇచ్చారు. గర్భాస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీ బయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే తన భార్యకు ఇలా జరిగిందని సర్పరాజ్ ఆరోపించాడు. కాగా, తన భార్యను తీసుకొని వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. వినితను అక్కడి వైద్యులు పరీక్షించారు. ఆమె కుడి చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురైందని వెంటనే తొలగించాలని తెలిపారు. దానికోసం చాలా ఖర్చుఅవుతుందని కూడా తెలిపారు. అసలే.. కొవిడ్ కారణంగా సర్పరాజ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాగా, తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటివరకు నెట్టుకొచ్చానని తెలిపాడు. కాగా, వీరికి ఒక ఎన్జీవో ఆహరాన్ని అందిస్తుంది. తాను ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకూడా భరించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఈ దారుణంపై గురుగ్రామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ఆపరేషన్‌ను మధ్యలో ఆపేసిన వైద్యుడు
అచ్చంపేట రూరల్ (మహబూబ్ నగర్): రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రు ల్లో కాసుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్లు చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలను పొగొడుతున్నారు. రోగం నయం చేస్తారని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఏకంగా కాటికే పంపిస్తున్నారు. అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడపుతున్న ఓ ప్రభుత్వ వైద్యుడు.. ఓ మహిళ గర్భసంచిలోని గడ్డను తొలగిస్తానని ఆపరేషన్ ప్రారంభించి.. అది పూర్తి చేయకుండానే మధ్యలో నే ఆపి కుట్లువేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల కథ నం ప్రకారం.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గండికోట అనితకు కడుపులో తరుచూ నొప్పి రావడంతో గత నెలలో అచ్చంపేటలోని డీబీఎం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని టెస్టులు చేశారు. స్కానింగ్ తీశారు. మహిళ గర్భసంచిలో గడ్డ ఉందని వైద్యుడు తారాసింగ్ గుర్తించారు. మహిళకు రక్తం తక్కువగా ఉందని ఇటీవల రక్తం ఎక్కించారు. బుధవారం ఉదయం మహిళకు ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించారు. అయితే సదరు మహిళ గర్భసంచిలో గడ్డ అతుకులు అతుకులుగా ఉందని గ్రహించి.. ఆపరేషన్ పూర్తి చేయకుండానే వెంటనే కుట్లు వేశారు. విషయం తెలుసుకున్న ఆ మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ తారాసింగ్ ఉప్పునుంతలలోని పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా అతని సొంత ప్రైవేటు ఆసుపత్రి కావడంతో మహిళకు ఆపరేషన్ చేశారు. మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. అయితే ఈ విష యం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బాధితురాలి బంధువుల ఫోన్ల ద్వారా బయటపడింది.ఈ విషయమై డాక్టర్ తారాసింగ్‌ను వివరణ కోరగా గతంలోనే మహిళకు రెండు ఆపరేషన్లు జరిగాయని, బుధవారం ఉదయం ఆపరేషన్ చేసి చూడగా గర్భసంచిలో అతుకులు ఉన్నాయని, మళ్లీ నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయవచ్చనే ఉద్దేశంతో కుట్లు వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళలకు ఎలాంటి అపాయం లేదన్నారు. -
రక్తహీనతతో జీవచ్ఛవంలా..
సిరికొండ(బోథ్) మంచిర్యాల : మండలంలోని మారుమూల గి రిజన గ్రామమైన ముత్యంపేటలో ఓ గిరిజన మ హిళ రక్తహీనతతో బాధపడుతూ మంచం పట్టింది. కుమ్ర శారదాబాయి(35)కి పదేళ్ల క్రితం ఉట్నూర్ మండలం ఎంద్వ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. రక్తహీనతతోనే ఆ మహి ళ ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టినింటికి వచ్చిన శారదాబాయి మంచంలోనే ప్రాణాలతో పోరాడుతోంది. ఇటీవలే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆ దిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి రక్తం చాలా తక్కువగా ఉందని చె ప్పారు. రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల పలు మాత్రలు ఇచ్చి ఇంటికి పంపించేశారని తెలిపారు. భర్త, తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అధి కారులు స్పందించి వైద్యసహాయం అందించి నిండు ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నా రు. శారదాబాయికి మెరుగైన వైద్య సే వలందించేందుకు సహకరించాలనికోరారు. -
మానవత్వమా..మన్నిస్తావా
మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడూ. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడూ అని కవి ఆక్రోశిస్తే.. అందులో అతిశయోక్తి ఏముంది? అక్కడక్కడా సౌహార్దం వెల్లివిరుస్తూ ఉన్నా.. క్రూరత్వం కోర విసిరే సంఘటనలు మన దృష్టికి వచ్చినప్పుడు మమత మృగ్యమైపోతోందన్న భావన కలుగుతుంది. మానవత మనల్ని మన్నిస్తుందా? అని మనసు చివుక్కుమంటుంది. అటువంటి విషాద సంఘటన కేజీహెచ్ వద్ద చోటుచేసుకుంది. డాబాగార్డెన్స్: భీమిలికి చేరువలోని గొల్లలపాలేనికి చెందిన శాంతమ్మ జీవితాన్ని శోకం కడలి అలల మాదిరి కమ్మేసింది. పేద కుటుంబానికి చెందిన ఆమె బతుకులో విషాదం పదేపదే ఉప్పెనలా ఉప్పొంగింది. ఆమె భర్త సూర్యారావు కార్పెంటర్. చిన్నాచితకా పనులు చేసి బండి లాక్కొచ్చేవాడు. లేకలేక కలిగిన ఓ కుమారుడితో బతుకిలా సాగిపోతే చాలని ఆమె ఆరాటపడింది. అయితే విధి ఆలోచన వేరేవిధంగా ఉంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో భర్త కన్నుమూయడంతో ఆమె జీవితం అతలాకుతలమైంది. ఒక్కగానొక్క కొడుకు మహేష్ కోసం ఆమె బతుకు గడుపుతూ ఉంటే.. దురదృష్టం మళ్లీ కాటేసింది. పదేళ్ల కొడుకుకు బోన్ క్యాన్సర్ సోకింది. పెద్ద ఆస్పత్రులలో చికిత్స చేయించే శక్తిలేని ఆమె కేజీహెచ్‌ను ఆశ్రయించింది. అక్కడ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న మహేష్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. పీడించిన కాఠిన్యంకడుపున పుట్టిన చిన్నారి కానరాని లోకాలకు తరలివెళ్లిపోతే.. లోకాన తనకున్న ఒక్కగానొక్క ఆశా అంతర్థానమైపోతే.. శాంతమ్మ కుప్పకూలిపోయింది. సమీప బంధువులు ఆసరా ఇస్తే.. తర్వాతి కార్యక్రమం కోసం సిద్ధమైంది. అయితే.. ఆమె చేతిలో చిల్లిగవ్వ లేదు. దాంతో ఆస్పత్రిలో రోగుల సహాయకులు, కొందరు బంధువులు రూ.3.400 పోగు చేసి ఆమెకు అందించారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లే తాహతు లేక శాంతమ్మ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో ఆ ఘట్టం పూర్తి చేయాలనుకుంది. దాంతో కేజీహెచ్ సిబ్బంది చిన్నా అనే ఆటో డ్రైవర్‌ను పిలిచి ఆమెకు అప్పజెప్పారు. అతడు తన ఎదురుగా ఉన్న మహిళ దీనావస్థను విస్మరించాడు. ఆమె శోకాన్ని కాస్తయినా పట్టించుకోకుండా క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహం తరలింపునకు, ఖననానికి రూ.3500 ఖర్చవుతుందని ఖరాఖండీగా చెప్పాడు. తనదగ్గర అంత లేదన్నా వినిపించుకోకుండా అడిగినంతా ఇస్తేనే పని జరుగుతుందని నిష్కర్షగా చెప్పాడు. తన దగ్గర రూ. 3400 మాత్రమే ఉన్నాయని ఆమె చెబితే, ససేమిరా అన్నాడు. దాంతో ఆమె వారినీ వీరినీ ప్రాధేయపడి మరో వంద సంపాదించి అతడికి ముట్టజెప్పింది. అంతవరకు అతడు బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్ ఓపీ గేటు ఎదురుగా ఆటోలోనే ఉంచి.. అంతా అందుకున్న తర్వాత బుధవారం వేకువ జామున శ్మశానవాటికకు తరలించాడు. అక్కడ సిబ్బందికి రూ. 500 మాత్రమే ఇచ్చి మాయమయ్యాడు. ఆమె దీనగాథ తెలుసుకున్న శ్మశాన వాటిక సిబ్బంది ఖననం పూర్తి చేసి తామే రూ. 600 అందించి ఆ తల్లిని సాగనంపారు. డబ్బుల్లేవని ప్రాధేయపడినా... నా దగ్గర అంత డబ్బు లేదని ఆటో బాబుని వేడుకు న్నా. కానీ కనికరించ లేదు. 3,500 లు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పాడు. చేసేదేమీ లేక వాళ్లనూ వీళ్లనూ మరో వంద అడిగి రూ.3,500 ఆటో బాబుకు ఇచ్చాను. –శాంతమ్మ ఎవరూ లేరని చెప్పినా.. శాంతమ్మకు ఎవరూ లేరని చెప్పాం. అయినా అతడు కనికరించలేదు. చివరికి ఎలా అయితేనేం మొత్తం డబ్బు పుచ్చుకుని బాబు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. –భవాని, స్థానికురాలు, శాంతమ్మ బంధువు -
కోర్ క్యాపిటల్ శంకుస్థాపన సభకు వచ్చి.. అష్టకష్టాలు
-
సభకు వచ్చి.. వర్షంతో అష్టకష్టాలు
-
సభకు వచ్చి.. వర్షంతో అష్టకష్టాలు
కోర్ క్యాపిటల్‌కు శంకుస్థాపన అంటూ లింగాయపాలెంలో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఆ తర్వాత అష్టకష్టాల పాలయ్యారు. సరిగ్గా సభ ముగిసే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆ ప్రాంతం మొత్తం బురదగా మారడంతో అక్కడకు వచ్చిన వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. వాహనాలను తీయడానికి వీలు కాలేదు. ముఖ్యమంత్రి సభ ముగిసి, వీఐపీలు అందరూ అక్కడినుంచి వెళ్లగానే తాము తీసుకొచ్చిన జనాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడికక్కడే వదిలేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థినులను అక్కడకు తరలించారు. దాంతో ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వేలాది మంది డ్వాక్రా మహిళలు అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి వాళ్ల స్వగ్రామాలకు చేర్చడానికి కనీసం అక్కడినుంచి బస్సులు కూడా ఏర్పాటుచేయకపోవడంతో.. నడిరోడ్డుపై మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. స్కూలు పిల్లలు, మహిళలు సమీపంలో ఉన్న చెట్ల వద్దకు వెళ్లి వాటికింద తలదాచుకున్నారు. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది కన్నీరు మున్నీరయ్యారు. స్కూలు పిల్లల వరకు అయితే వర్షాన్ని ఆస్వాదించారు గానీ.. పెద్దవాళ్లు ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో కూడా చాలామంది మహిళలు అక్కడే చిక్కుకుపోయారు.