మంచానికి పరిమితమైన శారదాబాయి
సిరికొండ(బోథ్) మంచిర్యాల : మండలంలోని మారుమూల గి రిజన గ్రామమైన ముత్యంపేటలో ఓ గిరిజన మ హిళ రక్తహీనతతో బాధపడుతూ మంచం పట్టింది. కుమ్ర శారదాబాయి(35)కి పదేళ్ల క్రితం ఉట్నూర్ మండలం ఎంద్వ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. రక్తహీనతతోనే ఆ మహి ళ ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టినింటికి వచ్చిన శారదాబాయి మంచంలోనే ప్రాణాలతో పోరాడుతోంది.
ఇటీవలే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆ దిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి రక్తం చాలా తక్కువగా ఉందని చె ప్పారు. రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల పలు మాత్రలు ఇచ్చి ఇంటికి పంపించేశారని తెలిపారు. భర్త, తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అధి కారులు స్పందించి వైద్యసహాయం అందించి నిండు ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నా రు. శారదాబాయికి మెరుగైన వైద్య సే వలందించేందుకు సహకరించాలనికోరారు.
Comments
Please login to add a commentAdd a comment