కోర్ క్యాపిటల్‌కు శంకుస్థాపన అంటూ లింగాయపాలెంలో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఆ తర్వాత అష్టకష్టాల పాలయ్యారు. సరిగ్గా సభ ముగిసే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆ ప్రాంతం మొత్తం బురదగా మారడంతో అక్కడకు వచ్చిన వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. వాహనాలను తీయడానికి వీలు కాలేదు. ముఖ్యమంత్రి సభ ముగిసి, వీఐపీలు అందరూ అక్కడినుంచి వెళ్లగానే తాము తీసుకొచ్చిన జనాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడికక్కడే వదిలేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థినులను అక్కడకు తరలించారు.