Worest
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
బైడెన్ అసమర్థ పాలనలో... అమెరికా సర్వభ్రష్టం
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తాను పూర్తిగా అమాయకుడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనపై దాఖలైన క్రిమినల్ అభియోగాలకు సంబంధించి మంగళవారం ఆయన న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ ముందు విచారణకు హాజరవడం తెలిసిందే. అనంతరం ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. వామపక్ష అతివాద ఉన్మాదులు దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకెళ్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మద్దతుదారులపై నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడిలా ఎన్నికల ప్రక్రియనూ ముందుగానే ప్రభావితం చేయజూస్తున్నారని ఆరోపించారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హెచ్చరించారు. ‘‘బైడెన్ దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. ఆయనకు ముందున్న ఐదుగురు అత్యంత అసమర్థ అధ్యక్షుల వైఫల్యాన్నింటినీ కలగలిపినా బైడెన్ పాలనా వైఫల్యాల్లో పదో వంతుకు కూడా తూగవు. అంతటి దారుణ పాలనతో అమెరికాను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తూ విఫల రాజ్యంగా మారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. డాలర్ శరవేగంగా పతనమవుతోంది. గత 200 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత దారుణ పరాజయమిది! ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ఇంకెంత మాత్రమూ సూపర్ పవర్ కాదు. సర్వనాశనం దిశగా పయనిస్తోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. నేనుంటేనా...! బైడెన్ అసమర్థత వల్ల నమ్మశక్యం కాని రీతిలో చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా చేతులు కలిపాయని ట్రంప్ ఆరోపించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి అత్యంత వినాశకర సంకీర్ణంగా రూపొందాయి. ఎన్నో దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్తిస్థాయి అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. బైడెన్ హయాంలోనే జరిగి తీరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేనుంటే వీటిలో దేన్నీ జరగనిచ్చేవాన్ని కాదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు. ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదు. అందమైన ఉక్రెయిన్ పట్టణాలు నేలమట్టమయ్యేవి కాదు’’ అని ట్రంప్ అన్నారు. అదే నా తప్పిదం... వినాశక శక్తుల బారినుంచి దేశాన్ని సాహసోపేతంగా కాపాడటమే తాను చేసిన ఏకైక తప్పిదమంటూ బైడెన్, ఆయన మద్దతుదారులపై ట్రంప్ నిప్పులు చెరిగారు. తనపై కేసు విషయంలో మన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్‌తో పాటు దాన్ని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జువాన్ ఎం.మెర్చన్పైనా విరుచుకుపడ్డారు. వారిద్దరూ డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అంతేకాదు, వారిద్దరికీ నేనంటే విపరీతమైన ద్వేషం. జువాన్ భార్యకు, కుటుంబానికీ నేనంటే అసహ్యమే. ఆయన కూతురు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం పని చేస్తోంది’’ అన్నారు. ఎవరేం చేసినా తనను కుంగదీయలేరని, అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చి చూపిస్తానని చెప్పుకొచ్చారు. -
అధ్వానంగా కేజీబీవీల నిర్వహణ
ఏప్రిల్ నుంచి రూపాయి కూడా మంజూరుకు నోచుకోని వైనం మూడు నెలలలుగా ఎస్ఓలు, సిబ్బందికి జీతాల్లేవ్ ఎనిమిది నెలలుగా విద్యార్థులకు అందని ఉపకారవేతనం అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, చదువుకుంటూ మధ్యలో బడిమానేసిన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. మూన్నెళ్లుగా నిర్వహణకు పైసా కూడా విడుదల చేయకపోవడంతో ప్రత్యేకాధికారుల(ఎస్ఓలు) కష్టాలు వర్ణణాతీతం. నిత్యావసర సరుకులు టెండరుదారులు సరఫరా చేస్తుండగా, రోజువారి అవసరమయ్యే కూరగాయలు, అకుకూరలు, పాలు తదితర వాటి కొనుగోలుకు పలు ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా ఖర్చు చేసి నెలతర్వాతైనా బిల్లులు వస్తాయంటే అవీ ఇవ్వడం లేదని ఎస్ఓలు వాపోతున్నారు. వీటికి తోడు కరెంటు బిల్లులు చెల్లించలేక, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు చేయలేక దిక్కులు చూస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు దాదాపు రూ. 25 వేలు దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కరెంటు బిల్లు ఆలస్యమైతే అపరాధ రుసుం పడుతోంది. సిలిండర్లకు డబ్బు చెల్లించకపోతే ఇవ్వడం లేదు. బిల్లులు పెండింగ్ కారణంగా మెనూ అమలు గాలికి వదిలేస్తున్నారు. మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో మొన్నటిదాకా 36 కేజీబీవీలు ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తుండగా, 18 కేజీబీవీలు ఏపీఆర్ఐఈ సొసైటీ కింద, 5 కేజీబీవీలు గిరిజన సంక్షేమశాఖ, 3 కేజీబీవీలు సాంఘిక సంక్షేమశాఖ కింద పని చేసేవి. అయితే గత నెలలో అన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయి. వీటిల్లో సుమారు 12 వేల మంది దాకా విద్యార్థినులు చదువుతున్నారు. మూడు నెలలుగా అవస్థలు కేజీబీవీల నిర్వహణ ఇక్కట్లు ఇలా ఉంటే.. మరోవైపు మూడు నెలలుగా వారికి జీతాలు మంజూరు కాలేదు. ఎస్ఓలు మొదలుకుని సీఆర్టీలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఏప్రిల్, జూన్, జూలై నెలల జీతాలు రాలేదు. నిర్వహణ బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాజీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్ పడుతున్నారని కొందరు ఎస్ఓలు వాపోతున్నారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీ ఉద్యోగిని వాపోయింది. సబ్బులూ కొనలేదంటున్న విద్యార్థినులు ఉపకారవేతనం రాక విద్యార్థినులు అగచాట్లు పడుతున్నారు. నెల కాదు రెన్నెళ్లు కాదు ఏకంగా ఎనిమిది నెలలుగా విద్యార్థినులకు ఉపకార వేతనం అందలేదు. వ్యక్తిగత అవసరాల కోసం నెలకు ఒక్కో విద్యార్థినికి రూ. 100 ఇవ్వాల్సి ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సబ్బులు, నూనె, ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వస్తువులను కొనడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.