Workplaces
-
ఉద్యోగులకు ఏఐ చేదోడు
కృత్రిమ మేధ(AI) అంతటా వ్యాపిస్తోంది. పని ప్రదేశాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలతోపాటు దాదాపు ప్రతి విభాగంలోని ఆఫీసుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీని సేవలు వినియోగిస్తున్నారు. ఇటీవల రాండ్‌స్టడ్(Randstad Report) వెల్లడించిన నివేదిక ప్రకారం 2024లో 10 మంది భారతీయ ఉద్యోగుల్లో ఏడుగురు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఉత్పాదకతను పెంచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏఐపై ఆధారపడడం అధికమవుతుందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.ఐటీ సేవలు, ఆర్థిక సేవలు, విద్య, తయారీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,000 మంది ఉద్యోగులతో రాండ్‌స్టడ్ ఏఐ అండ్ ఈక్విటీ రిపోర్ట్ 2024 నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న 56% మంది తాము ప్రతిరోజూ కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఏఐ సాధనాలు వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడానికి, వాటిని సులభతరం చేయడానికి గణనీయంగా తోడ్పడుతున్నట్లు రాండ్‌స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఉద్యోగ పునరుద్ధరణ, డేటా భద్రతపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది.మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), బూమర్లు(1970లో జన్మించినవారు) ఏఐ నైపుణ్యాలపై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. 37 శాతం మంది తమ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా భద్రత, గోప్యత కారణంగా పనిలో చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడాన్ని నిషేధించే విధానాలను తమ యాజమాన్యం అవలంబిస్తున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి మరింత శిక్షణ అవసరమని చెబుతున్నారు. కృత్రిమ మేధ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు శ్రామిక శక్తి కూడా పెరిగేలా విధానాలు రావాలని నివేదిక ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తులో కొత్తగా ఏ టెక్నాలజీ వస్తున్నా అది శ్రామిక శక్తిని తగ్గించేలా కాకుండా, ఉత్పాదకతను పెంచుతూ మరిన్ని ఉద్యోగాలు సృష్టించేలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
థింక్ డిఫరెంట్ క్యాప్షన్ తో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థలో వరల్డ్ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్ సంస్థ గ్లోబల్ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్ స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెర్ స్కార్లెట్ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఆపిల్ నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి : ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి! -
ఉద్యోగానికి ఉత్తమ కంపెనీ.. గూగుల్
న్యూయార్క్: ఉద్యోగం చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బహుళజాతి కంపెనీగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థ ఎస్ఏఎస్ ఇనిస్టిట్యూట్, నెట్వర్క్ స్టోరేజ్ సంస్థ నెట్‌యాప్ వరుసగా తర్వాత స్థానాల్లో నిల్చాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మానవ వనరుల ‘కన్సల్టెన్సీ గ్రేట్ ప్రేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్’ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 25 కంపెనీలతో ఈ జాబితా రూపొందించగా.. ఇందులోనివన్నీ అమెరికా లేదా యూరప్‌కి చెందినవే తప్ప భారత్‌కి చెందిన ఒక్క కంపెనీకి కూడా చోటు దక్కలేదు. కనీసం అయిదు బెస్ట్ వర్క్‌ప్లేసెస్ జాబితాల్లో చోటు దక్కించుకున్న సుమారు 1,000 కంపెనీలను సర్వే చేసిన మీదట ఈ 25 సంస్థలను ఎంపిక చేశారు. కనీసం 5,000 మంది ఉద్యోగులు ఉండటంతోపాటు సుమారు 40 శాతం మంది విదేశాల్లో పనిచేస్తున్న కంపెనీలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. టాప్ 10లో డబ్ల్యూఎల్ గోర్ అండ్ అసోసియేట్స్(5), కింబర్లీ క్లార్క్(6), ఆతిథ్యరంగ సంస్థ మారియట్(7), కన్సూమర్ గూడ్స్ కంపెనీ డయాజియో(8), నేషనల్ ఇన్ స్ట్రుమెంట్స్(9), ఐటీ దిగ్గజం సిస్కో(10) ఉన్నాయి. టాప్ 10లో ఒక్క డియాజియో మాత్రమే అమెరికాయేతర కంపెనీ కావడం గమనార్హం. జాబితాలోని మొత్తం 25 కంపెనీల్లో 1.19 కోట్లమందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.