వృద్ధ నేతలు.. వ్యర్థ సిద్ధాంతాలు
బైలైన్
ఈ విషయం చాలా కాలంపాటే అత్యంత హాస్యభరిత కథనంగా నిలిచి తీరుతుంది. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న బిధాన్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 3న జరిగాయి. ఇప్పుడు పూజ్యులుగా పిలవాల్సినంత పెద్దవారైన అసిమ్ దాస్‌గుప్తా ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మేయర్ అభ్యర్థి. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలో ఆయన పాతికేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఇంత ఘోరంగా పతనం చెందడం ఆషామాషీ విషయం కాదు. వాస్తవానికి ఇది, పార్టీ ఆదేశాలకు వ్యక్తి అహం అడ్డంకి కాకుండా చేయడంలో సీపీఐ(ఎం)కున్న ఖ్యాతికి తగినదే. అంతటి గొప్ప ఆర్థిక మంత్రిని ఒక నగర శివారు మేయరు పదవికి ప్రయత్నించమని పార్టీ ఆదేశిస్తే, శిరసావహించాల్సిందే. అసలు చమత్కారం ఇది కాదు. అది మరో చోటుంది.
కామ్రేడ్ దాస్‌గుప్తా పాత పద్ధతిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ‘‘ఓటు వేయడం మరచిపోకండి. ఉదయాన్నే ఓటు వేసే యండి... ఎందుకంటే ఆ సమయంలోనే టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) గూండాల సమస్య, విచ్ఛిన్నకాండ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం’’ అని ఆయన పౌరులకు చెబుతున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం. ‘మీ ఓటును మీరే వేయండి’ అనే కరపత్రాన్ని కూడా ఆయన పంచుతున్నారు.
నీవు నేర్పిన విద్యయే...
1977-2011 మధ్య అంతే లేదన్నట్టుగా సాగిన వామపక్ష పాలనలోని పశ్చిమ బెంగాల్లో నివసించిన వారెవరైనాగానీ ఇది చూసి విరగబడి నవ్వాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ మార్క్సిస్టులు సరిగ్గా ఈ పద్ధతిలోనే అదనపు ఓట్లను సంపాదించి విజయానికి హామీని సాధించేవారు. రాష్ట్ర పోలీసుల రక్షణతో వారి క్యాడర్లు గూండాలకుండే ఆత్మవిశ్వాసంతో తమ పట్ల వ్యతిరేకత ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకునే వారు.
పోలింగ్ కేంద్రాల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులు తమతో కుమ్మక్కు కాకపోతే వారిని భయపెట్టేవారు, వేధించేవారు. మూలనపడ్డ కుండ, ఉడుకుతున్న కూర దాకను వెక్కిరించడం ఎప్పుడూ తమాషాగానే ఉంటుంది. సీపీఐ(ఎం) ఇతరుల విషయంలో ఏం చేసిందో సరిగ్గా అదే మమతా బెనర్జీ సీపీఐ (ఎం) విషయంలో కూడా చేస్తోంది. ఎన్నికలు న్యాయంగా జరగాలని బెంగాల్ మార్క్సిస్టులు సూచించడం ఊహించడానికి కూడా దాదాపు అసాధ్యం. కానీ ఓటమి అద్భుతాలను చేయగలుగుతుంది. మిమ్మల్నది వివేక వంతులను సైతం చేయవచ్చు.
అధికారం కోల్పోయి నాలుగేళ్లయి పోయినా ఇంకా ఎందుకు ఓడిపోయారో బెంగాల్ మార్క్సిస్టులకు అర్థం కాకపోవడమే విచిత్రమైన విషయం. పాత సిద్ధాంతం, వృద్ధ నేతలు.. అని ఒక్క ముక్కలో దాని ఓటమికి కారణం ఏమిటో చెప్పేయొచ్చు. వామపక్షవాదులు యువతకు చేరువయ్యే సమీకరణాన్ని పునరుద్ధరించగలిగే విధంగా తమ తత్వశాస్త్రాన్ని తిరిగి కనిపెట్టలేదు లేదా చెల్లుబాటయ్యే తేదీ ఎన్నడో దాటిపోయిన పాత నేతలను తప్పించనూ లేదు.
అసిమ్ దాస్‌గుప్తాకు ఇప్పుడు 69 ఏళ్లు. మరో విధంగా చెప్పాలంటే, ఆర్థిక మంత్రిగా నియమితులయ్యేనాటికి ఆయనకు 40 ఏళ్లు. బిధాన్నగర్ మేయర్ అభ్యర్థిగా ఒక 40 ఏళ్ల నేతను సీపీఐ (ఎం) ఎందుకు నిలపలేకపోయింది? పార్టీలో సమర్థవంతులైన యువ నేతలు ఏమంత మంది లేకపోవడం వల్లనేనా? ఆ పార్టీ ఇంకా ‘‘సోవియెట్ పొలిట్‌బ్యూరో మనస్తత్వం’తో బాధపడుతోందా? అత్యంత ప్రభావశీలుర బృందంలోకి ఒక్కసారి చేరారంటే, ఆ భగవంతుడు తాఖీదులు పంపేవరకు అందులో ఉండాల్సిందేననే ధోరణిని సోవియెట్ పొలిట్‌బ్యూరో మనస్తత్వం అని పిలుస్తారు. మార్క్సిస్టు ఆదర్శ నేత స్టాలిన్ భగవంతుడ్ని నమ్మేవాడు కాదు. క్రమానుగతమైన ప్రక్షాళన ద్వారా ఆయన ఆ సమస్యను పరిష్కరించాడు. కానీ బెంగాల్ స్టాలినిస్టులకు ఆ అవకాశం లేదు.
మార్క్సిస్టులకు కాలదోషం పట్టిపోయిందా?
స్థానికమైన ఒక మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ప్రస్తుతం అర్ధ అవనతమై కుంటుతున్న ఎర్రజెండా మాత్రం అలసిపోయిన వృద్ధుల నేతృత్వంలో రెపరెపలాడే అవకాశం తక్కువ. భారత ఎన్నికల సమీకరణల్లో వామపక్షవాదులు ఖాళీ చేసిన స్థలాన్ని వారు ఎన్నటికైనా తిరిగి సంపాదించుకోగలరా? మన దేశంలోని బూట కపు మార్క్సిజం, అంతర్జాతీయ మార్కిజం అంతగా కాలదోషం పట్టిపో యిందా? ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. చిట్టచివరి కమ్యూనిస్టు స్థావరాలు కూడా కూలిపోయాయి. చైనా కమ్యూనిస్టులకు సమానత్వ సాధన ఉద్దేశాలున్నాయేగానీ, పాత, ఫార్ములా తరహా పరిష్కారాల ద్వారా సౌభా గ్యాన్ని సృష్టించగలమని అది ఇకనెంత మాత్రమూ విశ్వసించడం లేదు. క్యూబాకు చెందిన రావుల్ క్యాస్ట్రో దేదీప్యమానమైన మతం వెలుగును చూడటం ప్రారంభించారు. పోప్ ఫ్రాన్సిస్‌ను ఆయన తమ దేశానికి ఆహ్వానించి, తాను కూడా తిరిగి మత విశ్వాసిగా మారగలననే సంకేతాన్ని చ్చారు. మార్క్సిజం మూలస్తంభాలు కుప్పకూలిపోగా, సదుద్దేశాలు మాత్రం మిగిలాయి.
బెంగాల్ మార్క్సిస్టుల దీర్ఘాయుర్దాయం రహస్యం సిద్ధాంతంలో కాదు, పార్టీ యంత్రాంగంలో ఉంది. వారి పాలిటి శని దేవత మమతా బెనర్జీ దీన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఆ పార్టీ యంత్రాంగంలోని తగినన్ని భాగాల ను లాక్కుని, తమ సొంత యంత్రాంగానికి తగిన విధంగా మలచి వాటిలో ఇముడ్చుకున్నారు. అదేసమయంలో, వామపక్షాలతో ఎలాంటి సంబంధ మూలేని రాజకీయ పార్టీలు పేదరికం సవాలును ఎదుర్కొన్నాయి. అవి దాన్ని ఏదో అంతర్జాతీయ విప్లవ పథకంలో భాగంగా గాక జాతీయ కార్య క్రమంగా చూశాయి. బెంగాల్లో పేదల మద్దతు ఉన్నది కాబట్టే మమతా బెనర్జీ గెలిచారు.
కూలిన కోట
మూడున్నర దశాబ్దాలుగా మార్క్సిస్టులు బెంగాల్‌ను తమ కోటగా చూశారు. అది చాలా పటిష్టమైన కోటే. అయినా, కోట తలుపులు బయటకు తెరుచుకుంటాయి కూడానని వామపక్షవాదులు ఒక్కసారైనా అనుకోకపో వడమే విచిత్రం. సురక్షితమైన ఆ స్థావరం నుంచి తమ రాజ్యం లేదా భావ జాలం విస్తరించగలదని మాత్రమే అనుకున్నారు. అందుకుబదులుగా వారు తమకు తామే తలుపులు మూసేసుకుని, తలపొగరుతో కూడిన స్వీయ సంతృప్తితో ఏకాంతవాసాన్ని గడిపారు.
వ్యక్తులలాగే పార్టీలు కూడా చాలా కారణాలతో మంచాన పడతాయి. సమంజసత్వాన్ని కోల్పోవడం వల్ల పలు పార్టీలు అకాల మరణం పాల య్యాయి కూడా. భారత వామపక్షం మరణ వార్తను లిఖించేటప్పుడు అది సంతృప్తితో నిర్లక్షంగా ఉండటం వల్ల చనిపోయిందని రాయాల్సి ఉం టుంది. అది హత్య కాదు, ఆత్మహత్య నిజం. కోలుకోవడానికి దానికి సమ యం మించి పోయిందా? లేదు. కానీ దానికి డాక్టర్ అవసరం లేదు. కావా ల్సిందల్లా అద్భుతం. కానీ అద్భుతాలు జరగాలంటే భగవంతుడు అవస రం. వామపక్షం భగవంతుడ్ని అంగీకరించకపోతే పోనీ, అది కనీసం భగ వంతునికి భిన్నమైన దైవదత్తమైన తండ్రినైనా(గాడ్ ఫాదర్) ఆశ్రయించి అందుకు ప్రయత్నించాలి.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
(వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)