28న షియోమి ఎంఐ4
న్యూఢిల్లీ : చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి కంపెనీ తన తాజా 4జీ మొబైల్ ఫోన్, ఎంఐ4ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది. వేగంగా వృద్ధి సాధిస్తోన్న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరింత వాటా పెంచుకోవటం లక్ష్యంగా షియోమి కంపెనీ ఈ ఎంఐ4 మొబైల్‌ను తెస్తోంది.
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఎంఐయూఐ ఓఎస్)పై పనిచేసే ఎంఐ4 మొబైల్ ఫోన్లో 5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 2.5 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సోనీ ఐఎంఎక్స్ 214 బీఎస్ఐ సెన్సర్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లున్నాయి.
గత ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించిన షియోమి ప్రస్తుతం రెడ్మి వన్ఎస్, రెడ్మి నోట్, ఎంఐ3 మొబైల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. కాగా ఇటీవలనే బీజింగ్‌లో షియోమి కంపెనీ ఎంఐ నోట్, ఎంఐ నోట్ ప్రొ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది.