yadav reddy
-
బ్రేకింగ్: ఫిరాయింపు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అనర్హతకు గురైన యాదవ్ రెడ్డి ఎమ్యెల్యేల కోటాలో మండలికి ఎన్నికైయ్యారు. మరోసభ్యుడు భూపతిరెడ్డి నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్ కూడా అనర్హతకు గురైయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకున్నట్లు మండలి ఛైర్మన్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
'త్వరలో డీఎస్సీ ప్రకటన'
మోమిన్‌పేట (రంగారెడ్డి): ప్రస్తుతం 8 వేల విద్యావాలీంటర్లను నియమించి తర్వాత డీఎస్సీ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరగలేదని వాపోయారు. త్వరలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్ అంతా తెలంగాణదే అన్నారు. -
టీ కాంగ్రెస్‌లో 'స్థానిక' పదవుల లొల్లి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి అప్పుడే మొదలైపోయింది. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి లేఖ రాశారు. జడ్పీ ఛైర్మన్ పదవి తనకు ఇస్తామని ముందునుంచి హామీ ఇవ్వడం వల్లే తాను జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలిచానని చెప్పారు. తీరా ఇప్పుడు తనకు కాకుండా మరో అభ్యర్థికి అక్కడి జడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూడటం సరికాదని ఆయన మండిపడ్డారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని తనకు తగిన న్యాయం చయాలని యాదవ్రెడ్డి కోరారు. -
'అసెంబ్లీ ప్రొరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదు'
హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ప్రోరోగ్ చేయవద్దని గవర్నర్‌ను కలవడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రోరోగ్ వివాదం చేయవద్దని తెలంగాణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి బదులు కేబినెట్ సమావేశం పెట్టాలని సీఎం కిరణ్ ను డిమాండ్ చేసి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్ లు ఏమీ లేవని ఆయన అన్నారు.