Yanamadala
-
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యక్షునిగా దర్శకుడు– రచయిత – నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 14న (ఆదివారం) జరిగిన ఎన్నికల్లో కాశీ విశ్వనాథ్ ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. సముద్ర, చంద్రమహేశ్ ప్యానల్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అధ్యక్షునిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వీఎన్ ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్.రావు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లాభ„Š , పీవీ రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్ రాజ్, నీలం సాయిరాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు. మహిళల రిజర్వేషన్ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..
సాక్షి, యనమదల (ప్రత్తిపాడు): సర్వే అంటూ ఇంటి తలుపుతట్టాడు.. బీమా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ముఖంపై పౌడర్ చల్లి బంగారు నగలతో ఉడాయించాడు.. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళితే.. యనమదల గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్వరికి ముగ్గురు సంతా నం. అందరికీ వివాహాలు చేసింది, నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో యనమదలలో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం ఉదయం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిలిచాడు. మీకు పింఛన్ వస్తుందా? రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? పొలం ఎంత ఉంది? ఆదాయమెంత? అంటూ మాటలు కలిపాడు. మీకు భర్త లేడు కదా..మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ.16 లక్షలు వస్తాయి, ముందస్తుగా డిపాజిట్‌గా రూ.లక్షా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పాడు. ఇప్పటికప్పుడు డబ్బులు కట్టలేని పక్షంలో మీ దగ్గర బంగారం ఉంటే ష్యూరిటీ కింద ఇవ్వండి, ఫొటో తీసుకుని మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాలో నాలుగు సవర్ల చంద్రహారం, గొలుసు తెచ్చి ఆగంతకుడికి ఇచ్చింది. ఫొటోలకని మరో రూ.వెయ్యి కూడా ఇచ్చింది. అంతే ఆగంతకుడు మల్లేశ్వరి ముఖంపై పౌడర్ చల్లాడు. దీంతో ఆమె మగతకు గురైంది. తేరుకుని చూసేలోపలే ఆగంతకుడు బైక్‌పై పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనవాళ్లను బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇనుపరాడ్లతో బీహార్ విద్యార్థులపై దాడి
గుంటూరు: ఆంధ్రా-బీహార్ విద్యార్థుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు రేపింది. సెల్‌ఫోన్ చోరీ విషయంలో తలెత్తిన వివాదం విద్యార్థులకు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నలుగురు బీహార్ విద్యార్థులపై శనివారం రాత్రి దాడి జరిగింది. గుంటూరు సమీపంలోని యనమదలలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ దాడి జరిగింది. ముసుగులు ధరించిన దుండగులు హాస్టల్లోకి చొరబడి బీహార్ విద్యార్థులపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని కాటూరి మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఒక విద్యార్థికి తీవ్రగాయాలయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆంధ్రా విద్యార్థులు తమపై దాడి చేశారని బీహార్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించపోవడాన్ని వారు తప్పుబట్టారు.