గుంటూరు: ఆంధ్రా-బీహార్ విద్యార్థుల మధ్య సెల్ఫోన్ చిచ్చు రేపింది. సెల్ఫోన్ చోరీ విషయంలో తలెత్తిన వివాదం విద్యార్థులకు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నలుగురు బీహార్ విద్యార్థులపై శనివారం రాత్రి దాడి జరిగింది. గుంటూరు సమీపంలోని యనమదలలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ దాడి జరిగింది.
ముసుగులు ధరించిన దుండగులు హాస్టల్లోకి చొరబడి బీహార్ విద్యార్థులపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని కాటూరి మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఒక విద్యార్థికి తీవ్రగాయాలయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆంధ్రా విద్యార్థులు తమపై దాడి చేశారని బీహార్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించపోవడాన్ని వారు తప్పుబట్టారు.
ఇనుపరాడ్లతో బీహార్ విద్యార్థులపై దాడి
Published Sun, Dec 29 2013 8:20 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement