YTDA
-
యాదగిరిగుట్టలో శిల్ప కళాశాల ప్రారంభం
యాదగిరిగుట్ట: వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశా లను ఆదివారం ఆలయ ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలో ముందుగా గీతారెడ్డి, ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శిల్ప కళాకారులను ప్రోత్సహించేలా యాదగిరిగుట్టలో సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను వైటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పాత హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 15 మంది విద్యార్థులకు సంప్రదాయ శిల్ప, ఆలయ వాస్తు కోర్సులో మొత్తం నాలుగు పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందన్నారు. కళాశాలలో విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కవిత ప్రత్యేక ప్రోత్సాహంతో పాఠ్య పుస్తకాలు రూపొందించారని వెల్లడించారు. కళాశాల ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం సమయంలో వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మోతీలాల్, శిక్షకులు హేమాద్రీ, మొగిలి, అధికారులు భాస్కర్ శర్మ, కృష్ణస్వామి పాల్గొన్నారు. -
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
వేగంగా యాదాద్రి ప్రధానాలయం పనులు
సాక్షి, యాదగిరిగుట్ట / యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వైటీడీఏ అధికారులు మరింత వేగం పెంచారు. ఈ నెల చివరలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనకు రానున్నారనే సమాచారంలో ప్రధానాలయంతోపాటు ఇతర పనులను ముమ్మరంగా చేస్తున్నారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, స్తపతి వేలు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం ముందు భాగంలో గ్రేడ్ స్లాబ్ పనులు జరుగుతున్నాయి. స్టీల్, కాంక్రీట్‌తో 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవుతో 10 ఇంచుల ఎత్తులో ఈ పను లను చేస్తున్నారు. ఈ గ్రేడ్ స్లాబ్‌పై రాళ్లను బిగించి భక్తులు నడిచేలా పనులు చేయనున్నారు. మరో పక్క 50కి పైగా కలశాలకు బంగారు తాపడం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయంలో పనులు ఇవే.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయం భూగా వెలసిన గర్భాలయం వెలుపల ప్రహ్లాద చరిత్రకు సంబంధించిన 10 ఘట్టాలను పంచలోహ విగ్రహాలతో తయారు చేస్తున్నారు. వీటిని ఇటీవల అధికారులు, స్తపతులు, కలెక్టర్ పరిశీ లించారు. గర్భాలయం వెలుపల పైభాగంలో వీటిని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం సూచనలతో శిల్పులు గర్భాలయం ముందు భాగంలో పంచ నారసింహ శిల్పాలను చెక్కారు. ప్రధానాలయం ద్వారాల పైభాగం లో శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని త్వరలో ప్రతి ష్టించేందుకు సిద్ధం చేసి వేంచేపు మండపం వద్ద పెట్టారు. అలాగే ప్రధానాలయ ద్వారాలకు ఇరువైపులా ద్వారపాలకులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామి ముందు భాగంలోని అరుగులో ఏనుగుల వరుస, పెద్దసైజులో పద్మాన్నిచెక్కే పనులు జరుగుతున్నాయి. ఈశాన్యం నుంచి కిందికి దిగినప్పుడు ఆంజనేయస్వామి ఆలయం నుంచి మండపానికి వెళ్లే వరకు శిలతో తయారు చేసిన రెయిలింగ్ పనులు చేస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో బలిపీఠం, ధ్వజస్తంభానికి రాగి రేకులను బిగించారు. వీటికి బంగారు తాప డం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లనున్నారు. ప్రధాన మండపంలోని ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్లు, రామానుజుల ఆలయ నిర్మాణాలు పూర్తి కాగా, సేన మండపం పనులు చేస్తున్నారు. ప్రధానాలయంలోని ఆళ్వార్ మండపంలో పైకప్పునకు రాజస్తాన్ నుంచి తీసుకువచ్చిన పద్మాలను ఏర్పాటు చేశారు. పూర్తయిన రెయిలింగ్ పనులు భక్తులు స్వామిని దర్శనం చేసుకొని బయటకు వెళ్లేటప్పుడు పడమర వైపు, పంచతల రాజగోపురం వైపు, లోపల వైపు రాతి రెయిలింగ్ పనులు పూర్తి చేశారు. ప్రథమ ప్రాకారం, ద్వితీయ ప్రాకారం వెలుపల సైతం రాతి ఫ్లోరింగ్ వేస్తున్నారు. ఇప్పటికే వేంచేపు మండపం పనులు పూర్తి కాగా, బ్రహ్మోత్సవ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్ చివరికల్లా ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో శిల్పులు రాత్రి, పగలు శ్రమిస్తున్నారు. -
వేగం పుంజుకున్న ‘యాదాద్రి’ పనులు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు శివాలయం, కొండ కింద చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. సీఎం కేసీఆర్ గతనెల 17న యాదాద్రిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన ఆదేశాలతో పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మహాయాగాన్ని చేపట్టి ప్రధానాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. సీఎం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ప్రధానాలయం పనులను వేగవంతం కోసం అధికారులు, శిల్పులు శ్రమిస్తున్నారు. గర్భాలయం, ముఖమండపం, ఆలయంలో పంచనారసింహుల రాతి విగ్రహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయంలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేయగా మరికొన్నింటిని ప్రతిష్టించే పనిలో ఉన్నారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం పక్కన మెట్ల పనులు జరుగుతుండగా, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటు, ఆలయ నవీకరణ, ఫ్లోరింగ్, ప్రాకార మండపాలు, తిరుమాఢవీధుల్లో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. అష్టభుజి మండపాలపై శిల్పాలకు మెరుగుదిద్దడం, పంచతల రాజగోపురాలపై మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన సత్యనారాయణ వ్రతమండపం, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, అష్టభుజి ప్రాకారాల తుది మెరుగులతోపాటు ఆలయంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. శివాలయం పనుల్లో కూడా వేగం పెంచారు. కొండపైన ఆలయం శిల్పాల పనులతో సమాంతరంగా సివిల్ పనులు చేస్తున్నారు. అలాగే కొండపైన వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. రహదారుల విస్తరణ పనులు.. యాదాద్రి ప్రధానాలయానికి నలుదిక్కులా రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు చేరుకునే రోడ్డు పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం పాతగుట్ట క్రాస్ రోడ్డు వద్ద నిలిచిపోయిన పనులను ప్రధానాలయం వరకు చేసే కార్యక్రమంలో అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. రోడ్డు వెడల్పు చేయడంతోపాటు సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా మొక్కలు నాటడం, రోడ్డును తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు. రోడ్డు విస్తరణ విషయంలో బాధితులతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ వారికి ఆశిం చిన మేరకు లబ్ధి చేకూరడం లేదన్న ఆందోళనలో ఉన్నారు. నిర్వాసితులు తగిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కొత్త విద్యుత్ టవర్ల ఏర్పాటు రోడ్డు వెడల్పు సమయంలో విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయడానికి ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి విస్తరణతో సమాంతరంగా టవర్లు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు భూసేకరణ చేసే సమయంలోనే టవర్ల కోసం స్థల సేకరణ చేయనున్నారు. దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను మంగళవారం ఉదయం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. గర్భాలయం, రాజగోపురాలు, ఆలయ తిరుమాడ వీధులు, ఇటీవల వచ్చిన జయ, విజయుల ద్వార పాలకుల విగ్రహాలను పరిశీలించారు. అక్కడి నుంచి శివాలయానికి వెళ్లి పనులను పరిశీలించారు. ముఖ, నవగ్రహ మండపాల పనులను సరిగ్గా నడుస్తున్నాయా ? లేదా అని ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నంచి నూతనంగా నిర్మాణం జరుగుతున్న ప్రసాద విక్రయశాల నిర్మాణ భవనాలను సందర్శించారు. ప్రసాదాల తయారీకి సంబంధించి మరిని మషనరీలరావడంతో వాటి ఉపయోగం గురించి ఆయనకు తెలియజేశారు. ప్రసాదాల తయారీకి సంబంధించిన 4అంతస్థుల భవనంలో ఏయే అంతస్థులో ఏమేమి వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థపతి ఆనందాచారి వేలు, ఆలయ ఈఓ గీతారెడ్డి, శిల్పులు మొగిలి, ఆదిత్య చిరంజీవి, పలువురు అధికారులు ఉన్నారు. -
యాదాద్రి ఆలయానికి మూడు వాకిళ్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి మూడు వాకిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గర్భాలయానికి అమర్చిన మూడో వాకిలిని బంగారంతో తాపడం చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరు మల తరహాలోనే బంగారు వాకిలిని రూపొందించడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏడంతస్తుల ప్రధాన రాజగోపురానికి అమర్చనున్న మొదటి వాకిలికి 27 అడుగుల ఎత్తులో టేకు చెక్కతో భారీ ద్వా రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండవ వాకిలి ద్వా రాన్ని టేకుతో తయారు చేసి, దానిపై వెండి తాపడం చేయనున్నారు. దీన్ని 18 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. అలాగే గర్భాలయం లోపల భాగంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయాన్ని అన్ని హంగులతో శోభాయమానంగా రూపుదిద్దడానికి మరో మూడు నెలలు పట్టనుందని వారు పేర్కొన్నారు. 5 నుంచి వరుణయాగం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఈ నెల 5 నుంచి 7 వరకు వరుణ యాగం తలపెట్టారు. ఈ యాగానికి 16 మంది రుత్వికులకు ఆహ్వానాలు పంపాలని తీర్మానించారు. భక్తులు సైతం పాల్గొని వరుణ యాగాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. ఇలా మూడు రోజుల పాటు యాగం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
‘డిసెంబర్లో పూర్తి.. మార్చిలో దర్శనాలు’
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణం పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయని వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. దర్శనాలు మాత్రం మార్చిలోనే ప్రారంభమవుతాయన్నారు. యాదా ద్రి ఆలయ పనులను అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, స్వయం భూ మూర్తులున్న గర్భాలయ నిర్మాణాలన్నీ చిన్న జీయర్‌స్వామి ఆదేశాల మేరకు స్థపతి సుందర్రాజన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్నారు. 54 వ్యాలీ పిల్లర్లు నిర్మాణమయ్యాయన్నారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ఆంజనేయ స్వామి, గండ భేరుండ నారసింహులకు ప్రదక్షిణలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ ప్రారంభం నాటికి భద్రత, సీసీ కెమెరాలు, క్యూలైన్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆల యానికి 3 ప్రాకారాలు రానున్నాయని ఆర్కి టెక్టు ఆనందసాయి తెలిపారు. ధ్వజస్తంభం ఎత్తు ముఖ మండపాని కంటే, గర్భాలయం పై కప్పు కంటే తక్కువగా రానుందని స్థపతి సుందరరాజన్ పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం ఈఓ గీతారెడ్డి, స్థపతి వేలు, ఆర్కిటెక్టు మధు, ఈఈ వసంత నాయక్ పాల్గొన్నారు. -
యాదాద్రి పనులు వేగంగా పూర్తి చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై ఆయన సమీక్షించారు. దేవాలయ నిర్మాణం, కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి వద్ద గండిచెరువు సుందరీకరణ, అక్కడి ఆర్వోబీ నిర్మాణం, తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి కావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆలయ ఈవో గీత తదితరులు పాల్గొన్నారు. -
విష్ణు పుష్కరిణి.. విస్తరణ
యాదగిరికొండ : తిరుమల తరహాలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరికొండపై ఉన్న విష్ణు పుష్కరిణిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పుష్కరిణి విస్తరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.20కోట్లు కేటాయించారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం విష్ణు పుష్కరిణిని వెడల్పు చేయడంతో పాటు లోతు కూడా పెంచనున్నారు. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ సత్యనారాయణ వ్రత మండపం, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుష్కరిణిలో స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విష్ణు పుష్కరిణి ప్రాశస్త్యం స్వామి సన్నిధికి వచ్చే భక్తుల్లో యాబై శాతం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుష్కరిణిలోని ఓ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుంట ఉంది. అందులోనుం చి నిత్యం ఎడతెరిపి లేకుండా నీటిధార వస్తుంది. గతంలో చాలా పెద్ద దార వస్తుండేది. కాల క్రమేణా మరమ్మతుల నిమిత్తం పుష్కరిణిలో కాంక్రీటు వేయడం, కరువు పరిస్థితుల కారణంగా నీటి గుంట మూసుకుపోవడంతో పాటు జల దార కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే గ్ర హ, గృహ, ఈతి, రోగ బాధలు పోతాయ ని భక్తుల విశ్వాసం.అంతేకాకుండా ఈ కోనేరు నుంచి స్వామి వారికి అభిషేకానికి బందేతీర్థం తీసుకెళ్తుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు. తిరుమలను తలపించేలా పుష్కరిణి విస్తరణ యాదగిరికొండపై ప్రస్తుతం ఉన్న పుష్కరిణి 36 మీటర్లు వెడల్పు, 18 మీటర్ల పొడవు ఉంది. ఇందులో భక్తుల కోసం నాలుగు స్నానపు గదులు, నాలుగు కుళాయిలు మాత్రమే ఉన్నాయి. ఇవి భక్తుల అవసరాలకు సరిపోవడం లేదు. కొత్తగా రానున్న పుష్కరిణి 55మీటర్ల వెడల్పు, 31మీటర్ల పొడవుతో రానుంది. అంతేకాకుండా భక్తులు స్నానమాచరించేందుకు విడివిడిగా సుమారు 20 స్నానపు గదులు నిర్మించనున్నారు. అలాగే పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరుగా గదులు, ప్రత్యేకంగా నీటి షవర్లు, విడిగా వేడినీటి షవర్లు ఏర్పాటు చేయనున్నారు. వికలాంగులు, చిన్న పిల్లలకు సైతం ప్రత్యేక గదులు రానున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. పుష్కరిణి మధ్యలో కల్యాణ మండపం, అందులో ప్రత్యేకంగా స్వామివారి పాదాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాదాలపై ప్రతి భక్తుడు నీటిని పోసే విధంగా ప్రత్యేక క్యూలైన్లు రానున్నాయి. ఈ కల్యాణ మండపం చుట్టూ ప్రత్యేక గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.వీటితో పాటు పుష్కరిణికిలోనికి వెళ్లే ముందు 11అడుగుల ఎత్తులో అందమైన కమాను, దీనిపై ఐదు అడుగుల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం రానుందని అదికారులు తెలిపారు. చిన్నజీయర్ స్వామి సూచనల ప్రకారం పుష్కరిణి చుట్టూ గోడకు అందమైన శిల్పాలు రానున్నాయి. పది వేల మంది స్నానమాచరించేలా.. ప్రస్తుతం ఉన్న పుష్కరిణిలో రోజూ రెండు వేల మంది మాత్రమే స్నానమారచిండానికి వీలుగా ఉంది. దీన్ని పది వేల మంది సాన్నమాచరించేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నారు. ప్రధానాలయ నిర్మాణం పూర్తయ్యేలోగా పుష్కరిణి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
31వ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్‌ప్లాన్ పరి« దిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజంటేషన్ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ఆర్.హరిప్రసాద్, టౌన్‌ప్లాన్ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు. -
యాదాద్రి పనుల పరిశీలన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూల్చివేతలు, రాజగోపురాల నిర్మాణ పనులను వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు ఆనంద్‌సాయి, బడే రవిలు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూల్చివేసిన ప్రధానాలయాన్ని, నిర్మాణంలో ఉన్న రాజగోపురాలను పరిశీలించారు. అనంతరం వైటీడీఏ వైస్‌చైర్మెన్ కిషన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రార్ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ దసరా రోజున రాజగోపురాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని సూచించారు. యాదాద్రి కోసం హైదరాబాద్‌లోని కోహెడ, గుంటూరు, గురిజాలపాలెం, మార్టూరులో శిల్పాలు తయారవుతున్నాయని తెలిపారు. దసరా రోజున ఉదయం 8.19 గంటలకు ఓ శిల్పాన్ని స్థాపించనున్నట్లు తెలిపారు. ప్రధానాలయంలో సుమారు 60 ఫీట్ల ఎత్తులో ధ్వజస్తంభం, 20 ఫీట్ల ఎత్తులో బలిపీఠం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ గీతారెడ్డి, దేవస్థాన అధికారులు దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సెప్టెంబర్ చివరిలోగా కూల్చివేతలు పూర్తి చేయాలి
యాదగిరిగుట్ట: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై కొనసాగుతున్న కూల్చివేతల పనులను సెప్టెంబర్ చివరిలోగా పూర్తి చేయాలని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఇంజినీరింగ్ చీఫ్ రవీందర్రావులు సన్‌షైన్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం వారు ప్రధానాలయంలో రాజగోపురాలు కూల్చివేత, రిటెయినిగ్ వాల్, పెద్దగుట్టపై అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా యాదాద్రి పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న బ్లాస్టింగ్ల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోలర్, ఆర్డినరి రెండు రకాలుగా జరుగుతున్న బ్లాసింగ్లను ఇంజనీర్ల పర్యవేక్షణలో జరగాలని సూచించారు. రాజగోపురాల పనుల్లో వేగం పెంచాలన్నారు. 2017 దసరా నాటికి ప్రధానాలయం పూర్తి చేసి భక్తులకు గర్భాలయ దర్శనం కల్పిస్తామన్నారు. యాదాద్రి అభివృద్ధి పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పరిశీలనకు త్వరలోనే సీఎం కేసీఆర్ వస్తారని తెలిపారు. అంతకు ముందు ఆలయ అభివృద్ధికి సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. వారి వెంట స్థపతులు సుందర్రాజన్, వేలు, ఆర్కిటెక్ట్‌లు ఆనంద్‌సాయి, బడే రవి, బాబురావు, అధికారులు దోర్భల భాస్కర్‌శర్మ, చంద్రశేఖర్, సురేందర్‌రెడ్డి, ఆర్అంyŠ బీ అధికారులు ఉన్నారు. -
చినజీయర్ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం విస్తరణపై వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామిని మంగళవారం విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పనుల గురించి చినజీయర్ స్వామి ఈఓను అడిగి తెలుసుకున్నారు. ఆలయ విస్తరణ పనుల విషయంలో స్వామీజీ కొన్ని సూచనలు చేశారు. అధికారులు అక్కడి నుంచి గుంటూరు జిల్లా గురిజాపల్లికి వెళ్లి ఆలయ విస్తరణకు కావాల్సిన రాయిని పరిశీలించారు. జీయర్‌స్వామిని కలిసిన వారిలో ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, బడే రవి, స్థపతి సుందర్రాజన్, దేవస్థాన అధికారి దోర్భల భాస్కరశర్మ, అర్చకులు సురేంద్రాచారి ఉన్నారు. -
‘యాదాద్రి’భూములకు నో స్టాంపు డ్యూటీ
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) కొనుగోలు చేసిన 133.31 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీని మినహాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించి.. ప్రతులను రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్‌కు, ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రింటింగ్ విభాగం కమిషనర్ ను సర్కారు ఆదేశించింది. -
ధరలకు రెక్కలు
రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు భూములకు భలే డిమాండ్ రోడ్డు వెంట రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు చేరిన ఎకరం ధర యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటే కారణం భువనగిరి : జాతీయ రహదారి 163 విస్తరణ భూసేకరణ పనులు వేగవంతం కావడంతో రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు రోడ్డు వెంట గల భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. హెచ్ఎండీఏ, వైటీడీఏ (యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి) పరిధిలో గల భువనగిరి మండలం రాయగిరి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలాలకు అనుసంధానంగా జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల రూ.384 కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణ పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గుట్టకు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రూ.పది లక్షల లోపు ఉన్న భూముల ధరలు అమాంతం ఆయా ప్రాంతాన్ని బట్టి నాలుగింతలు పెరిగాయి. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సీఎం కేసీఆర్ పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఒక్కసారి పరిశ్రమల యజమానులు, రియల్టర్లు రోడ్డు వెంట గల భూములతోపాటు ఆయా ప్రాంతాల్లోని 15 కిలోమీటర్ల వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ రియల్టర్లతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన వ్యాపారం బీబీనగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, జనగాం వరకు ప్రధాన రహదారి వెంట ఎకరం ధర రూ.20 నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ప్రాంతంలో అధికమైనప్పటికీ గతంలో రాజీవ్ రహదారి, బెంగుళూరు రోడ్డు, శ్రీశైలం, ముంబాయి రహదారి వెంట ఎకరం ధర కోట్లలో పలుకుతుండడంతో సహజంగానే కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక కారిడార్లోకి రాష్ట్రరాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక జోన్లోకి చేరింది. నగరంలోని పరిశ్రమలు 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా భువనగిరి డివిజన్లో భూములపై కన్నెయడంతో అమాంతం ధరలు పెరిగాయి. డివిజన్ పరిధిలోకి వచ్చే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరిగాయి. మారుమూల మండలాల్లో రూ.వేలల్లో పలికే ఎకరం భూమి ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరింది. జాతీయ రహదారి పరిధి విస్తరించడం, రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి ప్రాంతం వరకు రాజధాని నుంచి రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉండడం భూముల కొనుగోలు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ - ఖాజీపేట, బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాలు భువనగిరి డివిజన్ మీదుగా వెళ్తుండడం, పలు రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుకావడం అనుకూలాంశం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భువనగిరికి 70 కిలోమీటర్ల లోపు ఉండడం, అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. ఎన్ఆర్ఐల ఆసక్తి విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ గల వారి తల్లిదండ్రులు భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి వాటిలో ఫామ్‌హౌస్‌లు, పండ్ల తోటలు, డెయిరీలను స్థాపిస్తున్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. మరికొందరు అధికారులు, బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి భూముల కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యు ప్రకారం వేలల్లో ఉంటున్న ధర వాస్తవ రేటు లక్షలు పలుకుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది ఎకరాల భూములు కొంటున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ధర ఉండడమే ఇందుకు కారణం. దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్‌మనీ చేతులు మారుతోంది. సామాన్యుల చేజారుతున్న భూములు హైవే వెంట ఎకరం ధర లక్షల్లో పలుకుతుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పేదలు తమ అవసరాల కోసం అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో పేద రైతులు భూములను కోల్పోతున్నారు. తిరిగి కొనుగోలు చేయాలన్నా వారికి భూ ముల ధరలు అందనంతదూరంలోకి వెళ్తున్నాయి.