
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎస్ ఎస్‌కే జోషి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై ఆయన సమీక్షించారు. దేవాలయ నిర్మాణం, కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి వద్ద గండిచెరువు సుందరీకరణ, అక్కడి ఆర్‌వోబీ నిర్మాణం, తదితర పనులను వేగవంతం చేయాలన్నారు.
వేద పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి కావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆలయ ఈవో గీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment