yuriya
-
పాపాల గుట్టు రట్టు
♦ సాక్ష్యాలతో పట్టుకున్న పోలీసులు ♦ సామగ్రి స్వాధీనం... అదుపులో నిందితుడు అశ్వారావుపేట : పాలు.. తాగడమంటే ఎవరికైనా ఇష్టమే. విటమిన్లు ఉంటాయని.. అందరూ తాగొచ్చని వైద్యులు సలహాలు సూచనలు చేస్తారు.. కానీ.. ఇక్కడి పాలు తాగిన వారు డబ్బులిచ్చి చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లే.. యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏళ్ల తరబడి కుటీర పరిశ్రమలా నడుస్తున్న నకిలీ పాల గుట్టు రట్టు కావడంతో ఊరి జనమంతా ఇదెక్కడి దందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాల సేకరణ వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి గుట్టుగా నిర్వహిస్తున్న నకిలీ పాల తయారీ యంత్రాన్ని అశ్వారాపుపేట, దమ్మపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. నిర్వాహకుడు పాలను సృష్టిస్తుండగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. అచ్యుతాపురం, నారంవారిగూడెం గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువ. ఇక్కడి నుంచి చాలా మంది పాలను సేకరించి.. ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఇదే వ్యాపారం చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన వేజల మురళి ఇంటి ముందు దమ్మపేట ఎస్సై నాగరాజు, అశ్వారావుపేట పీఎస్సై వెంకన్న, ఏఎస్సై కోటేశ్వరరావు, రెండు పోలీస్స్టేషన్ల సిబ్బంది తెల్లవారేసరికి ఉన్నారు. దీంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. తీరా అతగాడే నకిలీ పాలు తయారు చేస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయారు. క్షణాల్లో పాల తయారీ.. విష పదార్థాలేమీ లేకుండా యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేస్తున్నాడు. లీటరు నూనె, కిలో యూరియా, లీటరు నీళ్లు, పావుకిలో పంచదార, పావుకిలో పాలపిండి కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నింటినీ ఒకే మిశ్రమంగా పాల సేకరణ డ్రమ్ములో కలుపుతున్నాడు. తర్వాత విద్యుత్ మోటార్‌కు అమర్చిన కవ్వంతో చిలుకుతున్నాడు. డ్రమ్ముపై మూత గట్టిగా ఉండటంతో చుక్క కూడా బయట పడకుండా మిశ్రమం అంతా మదించబడి పాలవంటి పదార్థం పైకి తేలుతుంది. దీనిని సేకరించిన పాలలో కలిపి పాల సేకరణ కేంద్రాలకు విక్రయిస్తున్నాడు. పాలలోని వెన్న శాతాన్నిబట్టి ప్రైవేటు కంపెనీలు లీటరుకు రూ.70 వరకు చెల్లిస్తుండటంతో.. రూ.100 పెట్టుబడితోనే రూ.వెయ్యి విలువైన పాలవ ంటి మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు. సేకరణ కేంద్రాల నుంచి పసిపిల్లల దాకా.. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, కుడితి, పశువు, పొదుగు లేకుండా ఎరువు, వంటనూనెతో తయారు చేసిన నకిలీ పాలను అశ్వారావుపేట, దమ్మపేటలోని హెరిటేట్, మోడల్ డెయిరీలకు విక్రయిస్తుంటాడు. ఇతడితోపాటు ఇటువంటి పాల తయారీదారులు అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు విక్రయించిన నకిలీ పాలు పాల శీతలీకరణ కేంద్రాల గుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి పలు పరిమాణాల్లో ప్యాకెట్ల రూపంలో ఐఎస్ఓ స్టాండర్డ్లతో విక్రయిస్తుంటారు. కొనే పాల ప్యాకెట్లో విషం పసిపాపల నుంచి వృద్ధుల వరకు ప్రభావాన్ని చూపుతోందని నిర్వాహకుడు చెప్పేదాన్నిబట్టి తెలుస్తోంది. శాస్త్రం తెలిసిన వ్యక్తే ఆద్యుడు.. అశ్వారావుపేటలోని మోడల్ డెయిరీలో గతంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ టెక్నాలజీని పరిచయం చేసినట్లు చెబుతున్నాడు మురళి. పాల లో వెన్న శాతం అధికంగా రావాలంటే.. పాలు అధికంగా ఉండాలంటే ఇలా నూనె, ఎరువులు కలిపితే లాభాలు వస్తాయని చెప్పినట్లు చెబుతున్నాడు. ఆఫ్ హెచ్‌పీ మోటార్, ప్లాస్టిక్ కవ్వం, కలిపే విధానం, టెక్నాలజీని నేర్పినందుకు రూ.35వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. పాల తయారీకి వాడిన నూనె ప్యాకెట్లను ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలోనే తగుల బెడుతున్నాడు. అంతేకాక గ్రామంలో ఎవరితోనూ వివాదం లేకుండా అమాయకుడిలా కనిపించే మురళి ఇలా చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోంది. పాలు కొనేందుకు ఎవరయినా వచ్చినా.. ఇంటిలో నుంచి తడికదాకా వచ్చి పాలు పోసే వాడని.. తీరా పోలీసులు వచ్చాక మోసం బయటపడిందని గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ైరె తుల నుంచి రోజుకు 40 లీటర్ల పాలు సేకరించి.. తర్వాత 450 లీటర్ల పాలు విక్రయించడంపై గ్రామస్తులకు వచ్చిన అనుమానంతో గుట్టు పాల తయారీకి వాడిన 80 నూనె ప్యాకెట్లు, 8 డ్రమ్ములు, 20 కిలోల యూరియా, పాలపిండి, పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
బోలెడంత యూరియూ
•కొరత ఉన్నప్పుడు రైతుల్ని దోపిడీ చేసిన వ్యాపారులు •ఇప్పుడు అవసరం లేకపోరుునా కొనండయ్యూ అంటూ కంపెనీల ఒత్తిడి తాడేపల్లిగూడెం : ‘ఆకలితో అలమటిస్తున్నాం.. గంజి నీళ్లరుునా పోయండయ్యూ’ అని వేడుకున్నప్పుడు స్పందించని వారు ‘అరె.. నీ కడుపు నిండిపోరుుందా. అరుునా ఫర్వాలేదు. పొగలు కక్కే వేడివేడి బిర్యానీ తెచ్చా తిను’ అంటూ నోటిదగ్గర పెట్టినట్టుగా ఉంది ప్రస్తుతం జిల్లాలో యూరియా పరిస్థితి. ఊడ్పులు పూర్తయ్యాయి. ఒక్క బస్తా యూరియా అయినా ఇచ్చి పుణ్యం కట్టుకోండని రైతులు బతిమాలినా మొన్నటి వరకూ సరఫరా చేయలేదు. దీంతో జిల్లాలో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను పీల్చి పిప్పిచేశారు. అన్నదాతల అవస్థలను పత్రికలు వెలుగులోకి తీసుకురావడంతో మత్తు వదిలిన అధికారులు ప్రజాప్రతినిధులపై వత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు జనవరి కోటాగా జిల్లాకు సుమారు 5 వేల 200 మెట్రిక్ టన్నుల యూరియా ఇఫ్కో, నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి వచ్చింది. ఫిబ్రవరి కోటాగా ఎంత యూరియా కేటాయించారనే విషయంపై కేటారుుంపు ధ్రువీకరణ పత్రం (ఎలకేషన్ సర్టిఫికెట్) ఇంకా రాలేదు. దీంతో సంబంధం లేకుండానే అదనంగా ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియూ కావాలన్నా వెంటనే సరఫరా చేస్తామంటూ కంపెనీల ప్రతినిధులు డీలర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నాట్లు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో యూరియా కావాలంటే కనీసం స్పందించని కంపెనీలు ఇప్పుడు మాత్రం యూరియా కావాలా అని బతిమాలుతున్నారుు. దక్షిణాది కంపెనీలకు ప్రేమ పుట్టుకొచ్చింది ఇఫ్కో, క్రిభ్కో, నంగల్, చంబల్ , నేషనల్ ఫెర్టిలైజర్, రాష్ట్రీయ కెమికల్స్ కంపెనీల నుంచి మొన్నటివరకూ ఒక్క బస్తా యూరియూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు రాలేదు. హర్యానా, మధ్యప్రదే శ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల అవసరాలకు మాత్రమే సరఫరా చేయాలనే ఆదేశాల నేపథ్యంలో ఇక్కడకు యూరియా రాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖకు దక్షిణ భారత రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా కేటారుుంచాలం టూ ఎన్ని విజ్ఞప్తులు వెళ్లినా స్పందన రాలేదు. ప్రస్తుతం ఉత్తరాదిన నాట్లు పూర్తవడంతో అక్కడ యూరియూ అమ్మకాలు నిలిచిపోయూరుు. దీంతో ఆ కంపెనీలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టారుు. భారీ ఎత్తున యూరియాను ఇక్కడకు పంపించేం దుకు సన్నాహాలు మొదలుపెట్టారుు. ఈ పరిస్థితుల్లో వద్దన్నా జిల్లాను యూరియా ముంచెత్తే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ, అనంతపురం ప్రాం తాల్లో వరినాట్లు పూర్తి కావచ్చాయి. ఇకనుంచి యూరియా అవసరం పెద్దగా ఉండదు. అరుునప్పటికీ పెద్దఎత్తున యూరియాను ఇక్కడకు దిగుమతి చేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నారుు. విదేశీ కంపెనీలు సైతం యూరియూ నిల్వల్ని ఇక్కడకు డంప్ చేసేందుకు ముందుకొస్తున్నాయని భోగట్టా. -
ఏపీలో యూరియా సమస్య లేదు
-
లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తాం..
లింగంపేట, న్యూస్‌లైన్ : రబీ సీజన్‌కుగాను జిల్లాలోని రైతులకు లక్ష టన్నుల యూరియాను సరఫరా చేస్తామని డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ అన్నారు. శుక్రవారం ఆయన లింగంపేటలో *30 లక్షలతో నిర్మిస్తున్న సింగి ల్విండో గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో యూరియాను అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 33 వేల టన్నుల యూ రియా నిల్వ ఉందన్నారు. వారం రోజుల్లో యూరి యాను కొనుగోలు చేస్తే, మరో 67 వేల టన్నుల యూరియా జిల్లాకు చేరుకుంటుందన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో లక్షా 15వేల టన్నుల మొక్క జొన్నలను కొనుగోలు చేశామన్నారు. చైర్మన్‌కు సన్మానం డీసీసీబీ చైర్మన్‌ను స్థానిక సింగిల్‌విండో చైర్మన్,డీసీసీబీ డెరైక్టర్ ఎదురుగట్ల సంపత్‌గౌడ్, స్థానిక ఎన్డీసీసీ బ్యాంకు మేనేజర్గోపాల్రెడ్డి శాలువాకప్పి సన్మానించారు. రబీలో పంటరుణాలుగా *220కోట్లు నాగిరెడ్డిపేట : ఈ యేడు రబీసీజన్‌లో జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు *220కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఈ యేడు జిల్లాలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 10లక్షల క్వింటాళ్ల ధాన్యం, లక్షా15వేల క్వింటాళ్ల మక్కలను సేకరించామన్నారు. వారంరోజుల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలుకేంద్రాల్లో ధాన్యాన్ని తూకంవేసిన కూలీలకు రెండేళ్లుగా హమాలీడబ్బులు బకాయిపడ్డాయన్నారు. ధా న్యం సేకరణ పూర్తయిన వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలకేంద్రంలో సహకార బ్యాంకు భవన నిర్మాణానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం బ్యాంకుభవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్ధన్గౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు.