బోలెడంత యూరియూ
•కొరత ఉన్నప్పుడు రైతుల్ని దోపిడీ చేసిన వ్యాపారులు
•ఇప్పుడు అవసరం లేకపోరుునా కొనండయ్యూ అంటూ కంపెనీల ఒత్తిడి
తాడేపల్లిగూడెం : ‘ఆకలితో అలమటిస్తున్నాం.. గంజి నీళ్లరుునా పోయండయ్యూ’ అని వేడుకున్నప్పుడు స్పందించని వారు ‘అరె.. నీ కడుపు నిండిపోరుుందా. అరుునా ఫర్వాలేదు. పొగలు కక్కే వేడివేడి బిర్యానీ తెచ్చా తిను’ అంటూ నోటిదగ్గర పెట్టినట్టుగా ఉంది ప్రస్తుతం జిల్లాలో యూరియా పరిస్థితి. ఊడ్పులు పూర్తయ్యాయి. ఒక్క బస్తా యూరియా అయినా ఇచ్చి పుణ్యం కట్టుకోండని రైతులు బతిమాలినా మొన్నటి వరకూ సరఫరా చేయలేదు. దీంతో జిల్లాలో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను పీల్చి పిప్పిచేశారు. అన్నదాతల అవస్థలను పత్రికలు వెలుగులోకి తీసుకురావడంతో మత్తు వదిలిన అధికారులు ప్రజాప్రతినిధులపై వత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు జనవరి కోటాగా జిల్లాకు సుమారు 5 వేల 200 మెట్రిక్ టన్నుల యూరియా ఇఫ్కో, నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి వచ్చింది.
ఫిబ్రవరి కోటాగా ఎంత యూరియా కేటాయించారనే విషయంపై కేటారుుంపు ధ్రువీకరణ పత్రం (ఎలకేషన్ సర్టిఫికెట్) ఇంకా రాలేదు. దీంతో సంబంధం లేకుండానే అదనంగా ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియూ కావాలన్నా వెంటనే సరఫరా చేస్తామంటూ కంపెనీల ప్రతినిధులు డీలర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నాట్లు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో యూరియా కావాలంటే కనీసం స్పందించని కంపెనీలు ఇప్పుడు మాత్రం యూరియా కావాలా అని బతిమాలుతున్నారుు.
దక్షిణాది కంపెనీలకు ప్రేమ పుట్టుకొచ్చింది
ఇఫ్కో, క్రిభ్‌కో, నంగల్, చంబల్ , నేషనల్ ఫెర్టిలైజర్, రాష్ట్రీయ కెమికల్స్ కంపెనీల నుంచి మొన్నటివరకూ ఒక్క బస్తా యూరియూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు రాలేదు. హర్యానా, మధ్యప్రదే శ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల అవసరాలకు మాత్రమే సరఫరా చేయాలనే ఆదేశాల నేపథ్యంలో ఇక్కడకు యూరియా రాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖకు దక్షిణ భారత రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా కేటారుుంచాలం టూ ఎన్ని విజ్ఞప్తులు వెళ్లినా స్పందన రాలేదు.
ప్రస్తుతం ఉత్తరాదిన నాట్లు పూర్తవడంతో అక్కడ యూరియూ అమ్మకాలు నిలిచిపోయూరుు. దీంతో ఆ కంపెనీలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టారుు. భారీ ఎత్తున యూరియాను ఇక్కడకు పంపించేం దుకు సన్నాహాలు మొదలుపెట్టారుు. ఈ పరిస్థితుల్లో వద్దన్నా జిల్లాను యూరియా ముంచెత్తే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ, అనంతపురం ప్రాం తాల్లో వరినాట్లు పూర్తి కావచ్చాయి. ఇకనుంచి యూరియా అవసరం పెద్దగా ఉండదు. అరుునప్పటికీ పెద్దఎత్తున యూరియాను ఇక్కడకు దిగుమతి చేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నారుు. విదేశీ కంపెనీలు సైతం యూరియూ నిల్వల్ని ఇక్కడకు డంప్ చేసేందుకు ముందుకొస్తున్నాయని భోగట్టా.