Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Naga Babu Face Jai Varma Slogans in Pithapuram Again1
నాగబాబు రాక.. పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత

కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్‌ ఇచ్చారు. జై వర్మ నినాదాలతో నాగబాబుకు ఝలక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్‌ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్‌ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Trump Reacts on Recession Fears says this2
ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్‌ ఏమన్నారంటే..

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. మార్కెట్‌ క్రాష్‌ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్‌ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్‌ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన.

 KSR Comments On Chandrababu Over Schemes In AP3
చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదేనేమో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్తపాట ఎత్తుకున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కిన బటన్లు అన్నీ తామిస్తున్న పెన్షన్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదే కావచ్చు. ఏం చెబుతున్నానన్న దానితో నిమిత్తం లేకుండా చెప్పుకుంటూ పోవడమే ఆయన నైజంగా కనిపిస్తోంది ఇలాంటివి చూస్తూంటే. చంద్రబాబు తాలూకూ గొప్పలు ఇంకొన్నింటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు రూ.నాలుగు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ల పంపిణీ చేయడానికి ఆయన లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంతేకాదు.. ఈ నెల మొదటి తేదీన చంద్రబాబు పర్యటనలో మరో విచిత్రమూ కనిపించింది. తన సభకు రావాలని ఆయన దారిలో కనిపించిన వారినల్లా కోరుకున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఇలాంటి రికార్డు ఉండదేమో. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడం తప్పు కాదు కానీ పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు చిన్న, పెద్ద కార్యక్రమాలన్నింటికీ హెలికాఫ్టర్ వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించడం మాత్రం అంత హర్షణీయమైన విషయం కాదు.వృద్ధాప్య ఫించన్లున్ల పంపిణీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దశాబ్దాలుగా సాగుతున్న విషయమే. గత ఎన్నికల్లో ఇచ్చిన అనేకానేక హామీలను ఎగ్గొట్టిన బాబుగారు ఫించన్‌ మొత్తాన్ని వెయ్యి రూపాయలైతే పెంచారు. అయితే, పెంచిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు నెల నెలా ముఖ్యమంత్రి వెళ్లడం ఏమిటో? హెలికాప్టర్‌ ఖర్చుతోపాటు సీఎం పర్యటన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టిన విషయాన్ని మరపించేందుకు ఇలా చేస్తున్నారేమో మరి!.వైఎస్‌ జగన్ హయాంలో వలంటీర్లు మాత్రమే ఫించన్లు పంపిణీ చేసేవారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రతినెల ఒకటవ తేదీన తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. జగన్‌కూ మంచి పేరు తెచ్చింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ముగిసేనాటికి ఫించన్ల మొత్తం రూ.రెండు వేలు ఉంటే, జగన్ ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.మూడు వేలకు తీసుకెళ్లారు. అది కూడా ఇంటివద్దే అందేది. అంతకుమునుపు మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ లేదా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన ఖర్మ వృద్ధులకు తప్పింది. ఇలాంటి సువ్యవస్థితమైన వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు చెడగొట్టాయి. జగన్‌కు మంచిపేరు రాకూడదన్న ఉక్రోశంతో వలంటరీ వ్యవస్థలపై అవాకులు చెవాకులు మాట్లాడారు.అయితే, జనం నుంచి వచ్చిన నిరసన చూసిన తరువాత మాటమార్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లయితే ఇస్తున్నారు కానీ.. కొన్నిచోట్ల ఇది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బాపట్ల జిల్లాలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని నివ్వరపోయేలా చేస్తుంది. జగన్ ను ఉద్దేశించి గతంలో బటన్లు నొక్కేవారని, ఆ బటన్లు అన్నీ కలిపి తామిచ్చే ఫించన్లకే సమానం అని కొత్త అసత్యాన్ని సృష్టించారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ఇవ్వడం లేదని తన గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ టైమ్‌లో ఫించన్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. ఇప్పుడు రెండు లక్షలు తగ్గింది.2019 వరకు చంద్రబాబు టైమ్‌లో అందిన ఫించన్లు సుమారు 44 లక్షల మందికే. ఇప్పుడు పెరిగిన పెన్షన్లు అన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారన్నమాట. అప్పట్లో బటన్‌లు నొక్కితే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత తాను అంతకన్నా ఎక్కువ బటన్లు నొక్కుతానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. అయినా జగన్ కన్నా సంక్షేమానికి తానే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. జగన్ టైమ్ కన్నా రూ.వెయ్యి ఎక్కువ ఇస్తే, ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం సుమారు 640 కోట్లే. మరి దీంతోనే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందించినట్లు ఎలా అవుతుంది?. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఏభై ఏళ్లకే ఫించన్‌ ఇస్తామని ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడరు.జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.ఏభై వేల కోట్ల స్కీములకు అమలు చేశారు. చంద్రబాబు యథాప్రకారం వీటిపై అసత్యాలను ప్రచారం చేసి వచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అట. గత ప్రభుత్వం నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కట్టాలట. ఇవి ఎంత నిజమో ఇప్పటికే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలియచేసింది. జగన్ టైమ్‌లో కరోనా రెండేళ్లు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినా, ఏ నెలా జీతాలు ఆపలేదు. ఇప్పుడేమో జీతాలకు డబ్బులు లేవంటున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయినప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. కానీ, 2024లో జగన్ ప్రభుత్వం తప్పుకునే నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలున్నాయి. పోనీ, చంద్రబాబు చెప్పినట్లు పది లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నా, దానిలో ఆయన 2014-19 మధ్య చేసిన అప్పు ఎంత? 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు ఎంత? విభజన ద్వారా వచ్చిన అప్పు వాటా ఎంత? అన్నది చెప్పకుండా మొత్తం జగన్ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది చంద్రబాబే, బడ్జెట్లో అది ఆరున్నర లక్షల కోట్లేనని తేల్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. అయినా పది లక్షల కోట్ల అప్పు అని అబద్దాలు చెబుతున్నది ఆయనే. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబే. 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూనే, తాను అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా సంపద సృష్టించి పేదలకు స్కీములు అమలు చేస్తానని బొంకింది కూటమి పెద్దలే కదా!. ఇప్పుడేమో ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నది వారే. అంతేకాక అమరావతి రాజధానిని నిర్మించడం ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తానని ఈ విడత చెప్పారు. అంటే ఏమిటి దీని అర్ధం. ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయనని అనడమా?. అదే టైమ్ లో మేలో కొన్ని స్కీములు అమలు చేస్తామని అంటారు.ఈ సభకు అంతా రావాలని దారిలో కనిపించిన వారినల్లా కోరుతూ ముఖ్యమంత్రిగా ఆయన మరో సంప్రదాయం నెలకొల్పారు. ప్రజలు తన సభకు రావడం లేదనో, లేక వచ్చినా వెళ్లిపోతున్నారనో ఇలా దండోరా వేసినట్లుగా చెప్పి ఉండాలి. అలా వచ్చిన వారిలో ఒక యువకుడు తన అర్జీని ఇవ్వబోతే మాత్రం అతనిని వేరే రాజకీయ పార్టీ వ్యక్తి అని, అతని సంగతి తమ వాళ్లు చూసుకుంటారని బెదిరించడం ఏమిటో అర్థం కాదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ కాలం పూర్తి అయ్యే సరికి ప్రజలు ఇంకెన్ని అసత్యాలను వినాలో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Nayanthara And Madhavan Test Movie Review And rating Telugu4
'టెస్ట్‌' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్‌ మెప్పించారా..?

చిత్రం: టెస్ట్‌నటీనటులు: ఆర్‌. మాధవన్‌, నయనతార, సిద్ధార్థ్‌, మీరా జాస్మిన్‌, కాళీ వెంకట్‌, నాజర్‌ తదితరులు దర్శకత్వం: ఎస్‌.శశికాంత్‌నిర్మాతలు: ఎస్‌.శశికాంత్‌, రామచంద్రసినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్సంగీతం: శక్తిశ్రీ గోపాలన్నిర్మాణ సంస్థలు: వైనాట్‌ స్టూడియోస్‌స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం.. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. టెస్ట్‌( Test) సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్‌ను ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్‌ తెరకెక్కించాడు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో(Nayanthara) పాటు మాధవన్, సిద్ధార్థ్‌ (Siddharth) లీడ్‌ రోల్స్‌ చేశారు. మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్‌ 4న ఈ‌ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తమిళ్‌,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.కథేంటంటే.. ‍చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కుముద (నయనతార ) ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుముద స్కూల్‌మేట్ అర్జున్‌ (సిద్ధార్థ్‌) స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు తమ కోరికలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్‌లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు చూపారు. చెన్నైలో ఇండియా, పాక్‌ మధ్య జరిగే టెస్ట్‌ మ్యాచ్‌తో వీరి ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉంటాయి. శరవణన్‌ సైంటిస్ట్‌గా తను కనుగొన్న ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ కోసం రూ. 50 లక్షలు అప్పు చేస్తాడు. కానీ, అది ముందుకు సాగదు. అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుమదతో శరవణ్‌కు గొడవలు వస్తాయి. గొప్ప చదవులు పూర్తి చేసినప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేని అసమర్థుడిగా మిగిలిపోతానేమో అనుకున్న శరవణన్.. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. శరవణన్‌కు బెట్టింగ్‌ మాఫియాతో ఎలా లింక్‌ ఏర్పడుతుంది..? తన స్నేహితుడి కుమారుడిని కిడ్నాప్‌ చేసినా కూడా అర్జున్‌కు కుముద ఎందుకు చెప్పదు..? కుమారుడిని కూడా పనంగా పెట్టి అర్జున్ ఎందుకు ఆడుతాడు..? ఈ తతంగం అంతా పోలీసులు ఎలా పసిగడుతారు..? చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగిసిపోతాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించే నయనతార, సిద్దార్థ్‌, మాధవన్‌ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, స్క్రీన్‌పై స్టోరీ చూపించడంలో డైరెక్టర్‌ శశికాంత్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పవచ్చు. మిడిల్‌క్లాస్‌ జీవితాలను చూపించే సమయంలో ఎమోషన్స్‌ లేకపోతే ఆ సీన్స్‌ పెద్దగా కనెక్ట్‌ కావు. ది టెస్ట్‌ సినిమాలో అదే ఫీల్‌ కలుగుతుంది. సినిమా టైటిల్‌, ట్రైలర్‌ను చూసిన వారందరూ కూడా ఈ మూవీ మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా, థ్రిల్లర్‌ సినిమానే అనుకుంటారు. కానీ, ఇందులో ఆ రెండూ బలంగా లేవు. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్‌ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్రల చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఇవి ఏమీ ఇందులో ఉండవు. అర్జున్ ఒక స్టార్ క్రికెటర్. అతనికి కుముద తండ్రి కోచ్‌గా ఉండేవాడని చెప్తారు. అయితే, కుముదతో ఉన్న బాండింగ్‌ను దర్శకుడు చూపిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క సీన్‌ కూడా ఆర్జున్‌కు సంబంధించి వుండదు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టి గ్రౌండ్‌లో అర్జున్‌ అడుగుపెడుతాడు. కానీ, తనకు క్రికెటే ముఖ్యం అనేలా దర్శకుడు చూపించలేకపోయాడు. దీంతో ఆర్జున్‌ ఆటకు ప్రేక్షకులు కనెక్ట్‌ కావడం చాలా కష్టం.ఎవరెలా చేశారంటే..టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏమైనా ఉందంటే శరణన్‌ (మాధవన్) అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతారు. ఒక సైంటిస్ట్‌గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్‌ అయ్యాడు. టెస్ట్‌ మ్యాచ్‌లా సాగుతున్న సినిమాను వన్డే ఆటలా మార్చేశాడు. విలన్‌, హీరో ఇలా రెండు షేడ్స్‌ ఆయనలో కనిపిస్తాయి. తన వరకు వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో శరవన్‌ పాత్రలో దర్శకుడు చూపాడు. ఈ కోణంలో చూస్తే చాలామందికి నచ్చుతుంది. టెస్ట్‌ సినిమాలో సిద్దార్ధ్‌ పాత్రను ఇంకాస్త హైలెట్‌ చేసి చూపింటే బాగుండేది. ది టెస్ట్‌లో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్ధం గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. కానీ, తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

MI vs LSG: Hardik Pandya Breaks Silence On Tilak Varma Retiring Out5
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరగడం క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో వచ్చిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానం నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో స్పెషలిస్టు బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపి.. ఆల్‌రౌండర్‌ను రప్పించిన ముంబై నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లక్నో చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఈ విషయంపై స్పందించాడు.హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం‘‘ఆఖర్లో మాకు హిట్టింగ్‌ ఆడే ఆటగాడు కావాలని అనుకున్నాం. క్రికెట్‌లో ఇలాంటివి సహజం. అయితే, ఒక్కోసారి మన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే, వ్యూహాలు పక్కాగా అమలు చేస్తామని అనుకోవడంలో తప్పులేదు.ఒక్కోసారి ఇంకాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో స్మార్ట్‌గా ఉండాలి. బ్యాటింగ్‌లో వివిధ ఆప్షన్లు ప్రయత్నించాలి. మనదైన శైలిలో ఆడుతూనే దూకుడు ప్రదర్శించగలగాలి’’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.ఓటమికి కారణం అదేఇక లక్నో చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్న హార్దిక్‌ పాండ్యా.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. అయితే, తనకు ఏకనా వికెట్‌ మీద ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఆప్షన్లు దొరకలేదని.. వికెట్లు తీయడం కంటే కూడా తాము డాట్‌ బాల్స్‌ వేసేందుకే ఎక్కువగా ప్రయత్నించామని తెలిపాడు. బ్యాటర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపిందని.. తమ పరాజయానికి అదే కారణమని పేర్కొన్నాడు.లక్నో ఓపెనర్లు ధనాధన్‌కాగా ఐపీఎల్‌-2025లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో లక్నో- ముంబై జట్లు తలపడ్డాయి. సొంత మైదానం ఏకనాలో టాస్‌ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (31 బంతుల్లో 60), ఐడెన్‌ మార్క్రమ్‌ (38 బంతుల్లో 53) అదరగొట్టగా.. నికోలస్‌ పూరన్‌ (12), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (2) పూర్తిగా నిరాశపరిచారు.ఈ క్రమంలో ఆయుశ్‌ బదోని (19 బంతుల్లో 30), డేవిడ్‌ మిల్లర్‌ (14 బంతుల్లో 27) మెరుపు బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. ఆఖర్లో శార్దూల్‌ ఠాకూర్‌ ఐదు, ఆవేశ్‌ ఖాన్‌ రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి లక్నో 203 పరుగులు స్కోరు చేసింది.ముంబై బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. విఘ్నేశ్‌ పుతూర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అశ్వనీ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లు విల్‌ జాక్స్‌ (5), రియాన్‌ రికెల్టన్‌ (10) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు.నమన్‌, సూర్య, హార్దిక్‌ పోరాటం వృథాఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధీర్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. నమన్‌ 24 బంతుల్లో 46 రన్స్‌ చేయగా.. సూర్య 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డ తిలక్‌ వర్మ 23 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసిన క్రమంలో.. మేనేజ్‌మెంట్‌ అతడిని వెనక్కి పిలిపించింది.అప్పటికి ముంబై విజయానికి 24 పరుగులు కావాల్సి ఉండగా.. మిగిలింది కేవలం ఏడు బంతులు మాత్రమే. ఆ సమయంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(16 బంతుల్లో 28 నాటౌట్‌) క్రీజులో ఉండగా.. తిలక్‌ స్థానంలో సాంట్నర్‌ వచ్చాడు. అయితే, ఆఖరి ఓవర్‌ను లక్నో పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ కట్టుదిట్టంగా వేసి.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. దీంతో ముంబై 191 పరుగుల వద్ద నిలిచిపోయి.. 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. పొదుపుగా బౌలింగ్‌ చేసి నమన్‌ వికెట్‌ తీసిన దిగ్వేశ్‌ సింగ్‌ రాఠి (1/21)కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా ముంబై ఇప్పటి వరకు ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఒక్కటి మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గాJust the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025

Gold Rates and Silver Price Today On April 5th 20256
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..

దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ దిగొచ్చాయి. వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు నిన్నటి రోజున భారీగా తగ్గి ఉపశమనం ఇచ్చాయి. నేడు (April 5) కూడా అదే తగ్గుదలను కొనసాగించాయి.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,660 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.90,810 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,250 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.980, రూ.900 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనాచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,660 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.900, రూ.980 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి భారీ పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.5000 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 94,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Microsoft Turns 50: Bill Gates Gives A Unfortunate Rewind Viral7
దురదృష్టవశాత్తు.. ‘50 వసంతాల మైక్రోసాఫ్ట్‌’పై బిల్‌గేట్స్‌ వీడియో

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం మైకోసాఫ్ట్‌ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్‌ ఉంచారాయన. 1975 ఏప్రిల్‌ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్‌ గేట్స్‌, పాల్‌ అలెన్‌లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్‌కు మార్చారు. ఆ తర్వాత గేట్స్‌, అలెన్‌తో పాటు స్టీవ్‌ బాల్మర్‌, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) మైక్రోసాఫ్ట్‌కు 2000 సంవత్సరం దాకా గేట్స్‌ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు. 1955 సియాటెల్‌లో జన్మించిన విలియమ్‌ హెన్సీ గేట్స్‌.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ రాసే స్థాయికి చేరాడు. అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్‌ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్‌-డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించి.. ఆపై దానిని విండోస్‌గా పేరు మార్చారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్‌ తన వెబ్‌సైట్‌లో కొత్త పేజీలను లాంచ్‌ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్‌ను అందులో పొందుపరిచింది.

van rams into parked truck in Karnataka Kalaburagi8
కర్ణాటకలో ఘోర ‍ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF— ANI (@ANI) April 5, 2025

Waqf Bill Effect five leaders resign To Nitish Kumar JDU9
సీఎం నితీశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌

పాట్నా: బీహార్‌లో ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బీహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. తాజాగా మరో కీలక నాయకుడు నదీమ్‌ అక్తర్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో, ఎన్నికలకు ముందు బీహార్‌లో జేడీయూకు ఎదురుదెబ్బ తగిలింది.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయసభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ‍క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంతో.. ఆ పార్టీలోని మైనార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత నదీమ్‌ అక్తర్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకంటే ముందు.. జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ, భోజ్‌పూర్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ, రాజు నయ్యర్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో వరుసగా నేతలు రాజీనామా చేస్తుండటంతో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.JDU muslim leaders are resigning in bulk Nitish Kumar Muradabad, Nitish Kumar hai hai 😡😡pic.twitter.com/1mbnpAQvei— Chandan Sinha (I Am Ambedkar) (@profAIPC) April 4, 2025మరోవైపు.. తబ్రేజ్ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత నితీష్ కుమార్‌కి పంపారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘మీరు మీ లౌకిక ఇమేజ్‌ను కొనసాగిస్తారని నేను ఆశించాను, కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే పనిచేసిన శక్తులతో నిలబడాలని మీరు ఎంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ , పౌరసత్వ సవరణ చట్టం వంటి చర్యల తర్వాత ఏన్డీయే ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. ఎన్డీయే మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ జయంత్ చౌదరి.. లౌకికవాదాన్ని విడిచిపెట్టారని, ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ముస్లింలు జయంత్ చౌదరికి మద్దతు ఇచ్చారని, కానీ ఈ సమయంలో మాతో నిలబడలేదని రిజ్వీ అన్నారు. దీంతో, వక్ఫ్‌ సవరణ బిల్లును ఎన్డీయే మిత్రపక్ష పార్టీల్లో అగ్గి రాజేసింది. అసంతృప్తి నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. BREAKING NEWS TODAY 🚨First JDU Senior leader Mohammad Kasim Ansari and Now JDU Minority Pradesh Secratary Shah Nawaz Malik resign on #WaqfBoard Slowly slowly Muslim leader resign from JDU JDU support #WaqfBillAmendment bills in Lok sabha pic.twitter.com/US5ckR7YBE— Ashish Singh (@AshishSinghKiJi) April 3, 2025

Prathibha Kunda chit chat with Actress ratna pathak shah10
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!

రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్‌ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్‌ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్‌ ఆర్ట్స్‌ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్‌ కాస్టింగ్‌ క్రాఫ్ట్‌ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్‌ కాస్టింగ్‌ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్‌ డే గిఫ్ట్‌ : కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement