అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
బాసర: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని బుధవారం హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ కె. శ్రీనివాసరావు, సిద్దిపేట ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి కె.సాయి రమాదేవి, బైంసా జడ్జి దేవేంద్ర బాబు దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట నిర్మల్ జిల్లా కోర్టు సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
సౌత్‌జోన్ ఫుట్‌బాల్
టోర్నమెంట్‌కు ఎంపిక
ఉట్నూర్‌రూరల్: సౌత్‌జోన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్‌సింగ్, పీడీ అనిత బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల 29, 30న వరంగల్ జిల్లా కేంద్రంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగిందని, ఇందులో విద్యార్థి కోట్నాక్ సచిత్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో సౌత్ జోన్ ఇంటర్ కాలేజీ ఏట్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కి ఎంపికయ్యాడన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్స్‌పాల్ సాయిప్రసాద్, నర్సింగ్‌రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దస్నాపూర్‌లో నివాసం ఉంటున్న వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. నిర్మల్‌కు చెందిన వివాహిత ఆదిలాబాద్ పట్టణంలో శిక్షణ తీసుకుంటుంది. అయితే మంగళవారం నుంచి ఆమె ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment