![తాత్క](/styles/webp/s3/article_images/2024/11/22/20adi177-340152_mr-1732220713-0.jpg.webp?itok=rw1D-nqC)
తాత్కాలిక లేఅవుట్‌లకు ఝలక్
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ వెంచర్‌లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలివి. డీటీసీపీ ఫైనల్ అప్రూవుడ్ లేకుండానే వెంచర్ ఏర్పాటు చేసిన వ్యాపారులు ప్లాట్లు విక్రయించగా కొనుగోలు చేసినవారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న వాగును కూడా ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి నిర్మించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇది ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోకి వచ్చే మావల మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన భారీ వెంచర్. దీనికీ డీటీసీపీ ఫైనల్ అప్రూవుడ్ లేకున్నా పెద్ద మొత్తంలో ప్లాట్లు విక్రయించారు. బల్దియా అనుమతులతో బహుల అంతస్తుల భవనాలు నిర్మించారు. ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని మున్సిపల్ అధికారులు తాజాగా ఇంటి అనుమతులు నిలిపివేశారు. కొన్నింటిని రద్దు చేశారు. ఈ సమస్య ఈ రెండు లేఅవుట్లదే కాదు.. మరో 14 లేఅవుట్లలోని పరిస్థితి ఇదే.
● భవన నిర్మాణ పర్మిషన్లకు బ్రేక్
● రిజిస్ట్రేషన్ల నిలుపుదలకు ఆదేశం
● ఇప్పటికే వందలాదినిర్మాణాలు
● ప్లాట్లు కొన్నవారిలో ఆందోళన
![తాత్కాలిక లేఅవుట్‌లకు ఝలక్1](/gallery_images/2024/11/22/20adi176-340152_mr-1732220713-1.jpg)
తాత్కాలిక లేఅవుట్‌లకు ఝలక్
Comments
Please login to add a commentAdd a comment