
అడుగులో అడుగేస్తూ..
నాగోబా.. ఆదివాసీల ఆరాధ్య దైవం. ఏటా పుష్యమాస అమావాస్య పురస్కరించుకుని జాతరకు శ్రీకారం చుడుతారు. ఇప్పటికే ప్రచార రథయాత్ర చేపట్టిన మెస్రం వంశీయులు శుక్రవారం ప్రధాన ఘట్టమైన గంగాజల సేకరణ పాదయాత్ర షురూ చేశారు. కేస్లాపూర్ నుంచి హస్తిన మడుగు బాట పట్టారు. తెల్లని వస్త్రాలు ధరించి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ అడుగులో అడుగేస్తూ ముందుకు సాగారు. – ఇంద్రవెల్లి
● మెస్రం వంశీయుల పాదయాత్ర ప్రారంభం
● పవిత్ర గంగాజల సేకరణకు శ్రీకారం
● ఈ నెల 17న హస్తిన మడుగుకు చేరిక
● 28న నాగోబా జాతర
నాగోబా జాతరలో భాగంగా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీ యులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఏడు రోజుల పాటు వంశీయులు ఉన్న ప్రాంతాల్లో ప్రచార రథయాత్ర చేపట్టిన వీరు శుక్రవారం తిరిగి కేస్లాపూర్‌కు చేరుకున్నారు. మురాడి వద్ద సమావేశమై గంగాజల పాదయాత్ర, మహాపూజ ని ర్వహణపై చర్చించారు. ఝరి(కలశ) దేవతకు పూ జలు చేశారు. మెస్రం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా.. వంశపెద్దలు కానుకలు వేశారు. అనంతరం 130 మందితో గంగాజల సేకరణ పాదయా త్ర ప్రారంభించారు. తొలిరోజు మండలంలోని బ ట్టగూడ గ్రామంలో బస చేశారు. ఈ నెల 11న మండలంలోని వడగామ్, 12న ఉట్నూర్ మండలంలో ని సాలేవాడ, 13న ధర్ముగూడ, 14న కొత్తగూడ, 15 న కడెం మండలంలోని ఉడుంపూర్, 16న దస్తూరా బాద్ మండలంలోని మల్లాపూర్ గ్రామాల్లో బస చే యనున్నారు. ఈ నెల 17న మంచిర్యాల జిల్లా జ న్నారం మండలం గోదావరి హస్తిన మడుగుకు చే రుకుని ప్రత్యేక పూజల మధ్య పవిత్ర గంగాజలం సేకరించనున్నారు. అదేరోజు తిరుగు పయనమవుతారు. 18న ఉట్నూర్‌కు చేరుకుని అక్కడే బస చేస్తా రు. 19న ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్, 20న ఇంద్రవెల్లి మండలంలోని దొడందకు చేరుకుంటా రు. అక్కడి పొలిమేరలో తీసుకొచ్చిన పవిత్ర గంగా జలాన్ని భద్రపరిచి తమ గ్రామాలకు వెళ్తారు. తిరిగి ఈ నెల 24న అక్కడి నుంచి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కేస్లాపూర్ సమీపంలోని మర్రి చెట్టు(వడమర) వద్దకు చేరుకుని అక్కడే బస చేస్తా రు. 25 నుంచి మూడు రోజుల పాటు సంప్రదాయ, తూమ్(కర్మఖాండ)పూజలు నిర్వహిస్తారు. పుష్యమాస అమావాస్య పురస్కరించుకొని 28న రాత్రి 10.30 గంటల సమయంలో తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంలో నాగోబాను అభిషేకించి జాతర ప్రా రంభించనున్నట్లు వంశపెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెస్రం పెద్దలు చిన్ను, బాదిరావ్, కోసే రావ్, ఆనంద్‌రావ్, ప్రధాన్ పెద్దలు దాదారావ్, వంశ ఉద్యోగులు సోనేరావ్, శేఖర్‌బాబు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వెళ్లాలి.. విద్యార్థులు వద్దు
గంగాజల సేకరణ యాత్రలో పాల్గొన్న వారు నియ మ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఉండాలని, ఈసారి వి ద్యార్థులను పంపొద్దని, సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడద ని మురాడి వద్ద సమావేశమైన మెస్రం వంశీయులు తీర్మానించారు. పాదయాత్రలో పాల్గొనే వారికి వంశ పెద్దలు సలహాలు, సూచనలిచ్చారు. మార్గమధ్యలో బంధువుల ఇళ్లకు, ఇతర ప్రాంతలకు వెళ్లొద్దన్నా రు. వీటికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటూ పూజా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment