‘అక్రమ అరెస్టులపై తిరుగుబాటు తప్పదు’
ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీల అక్రమ అరెస్టులపై తిరుగుబాటు తప్పదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ హెచ్చరిచారు. మావల మండలం బట్టిసావర్‌గాం శివారు లో గల కుమురంభీం గూడలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం రింగారిట్ గ్రామంలో వారం క్రితం గ్రామ పటేల్ కోవ జంగు, కోవ రాములను చెట్లు నరికారనే నేపంతో అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. అలాగే టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గ్రామాలను తరలించే కుట్రలను ఆపాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, ఉపాధ్యక్షురాలు ఇందిరా, డివిజన్ అధ్యక్షురాలు లలిత, నాయకులు నాగోరావ్, ఆనంద్‌రావ్, పార్వతిబాయి, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment