వాటర్ సప్లయ్ సిబ్బందితో సమీక్షా సమావేశం
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో పైపులైన్ లీకేజీల ద్వారా నిత్యం ఎనిమిది ఎంఎల్‌డీల నీరు వృథాగా పోతున్న వైనాన్ని ‘వృథా అరికట్టకుంటే వ్యథే’ శీర్షికన ఈ నెల 12న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజు స్పందించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో వాటర్‌సప్లయ్ విభాగం వర్క్ ఇన్‌స్పెక్టర్లు, పంపు ఆపరేటర్లు, లీకేజీ నియంత్రణ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలు, నీటి సమస్య ఎదుర్కొంటున్న కాలనీల గురించి ఆరా తీశారు. పైపులైన్ లీకేజీల వివరాలు తెలుసుకున్నారు. లీకేజీలను నియంత్రించి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ము గ్గురితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాలనీల్లోని చేతిపంపులు, బోరుబావుల విద్యుత్ మో టర్లు పనిచేయకుంటే సత్వరమే సమాచా రం ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా లీకే జీ ఏర్పడితే యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టి నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఇందుకు రూ.కోటి అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డీఈలు తిరుపతి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment