ఎక్స్‌రే మిషన్ అందజేత
ఆదిలాబాద్‌టౌన్: క్షయ నియంత్రణ కేంద్రానికి అవసరమైన హ్యాండిల్ ఎక్స్‌రే మిషన్‌ను సుశోధన స్వచ్ఛంద సంస్థ సభ్యులు గురువారం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌కు అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో వంద రోజుల క్షయ గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితుల నమూనాల సేకరించి, ఎక్స్‌రే తీసి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రెండు ఎక్స్‌రే మిషన్లు మాత్రమే ఉన్న విషయాన్ని సుశోధన స్వచ్ఛంద సంస్థ ఎండీకి తెలుపగా ఆయన నెలపాటు వినియోగించుకునేందుకు హ్యాండిల్ ఎక్స్‌రే మిషన్ ఇచ్చారని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లినపుడు అనుమానితులకు అప్పటికప్పుడే ఎక్స్‌రే తీసి వ్యాధి నిర్ధారించే అవకాశముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీబీ అధికారిణి సుమలత, సమియొద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment