కేసుల నమోదులో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

కేసుల నమోదులో జాప్యం వద్దు

Published Fri, Mar 14 2025 2:02 AM | Last Updated on Fri, Mar 14 2025 1:57 AM

కేసుల నమోదులో జాప్యం వద్దు

కేసుల నమోదులో జాప్యం వద్దు

బోథ్‌: కేసుల నమోదులో జాప్యం చేయొద్దని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. గురువారం బోథ్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాల ను పరిశీలించారు. కేసుల వివరాలు తెలుసుకుని ప లు సూచనలు చేశారు. సొనాల మండలంలోని ఘ న్‌పూర్‌ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు గమనించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పీఎస్సై రాజశేఖర్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.

బజార్‌హత్నూర్‌ ఠాణా తనిఖీ

బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పలు సూచనలు చేశారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ, ఎస్సై ఉన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement