ఏఐ పరిజ్ఞానంతో విద్యాబోధన
కైలాస్‌నగర్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆ ధారిత పరిజ్ఞానంతో విద్యాబోధన చేసేందుకు జి ల్లాలోని తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ అంశంపై గురువారం కలెక్టర్లు, వి ద్యాధికారులతో విద్యాశాఖ కార్యదర్శి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 3నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో చదువులో వెనుకబడినవారికి ఏఐ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న నాలుగు పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఎంఈవోలు మనోహర్, వెంకట్రావ్, క్వాలిటీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి, కార్మిక ఉపాఽధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment