విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జైనథ్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో వచ్చే గ్రామాలు, మహారాష్ట్ర సరి హద్దుతో ఉన్న స్టేషన్ల వివరాలు, నమోదవుతున్న కేసుల వివరాలపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మాట్లాడారు. సరిహద్దులో మహారాష్ట్ర ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలా పాలకు తావివ్వకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నా రు. అనంతరం జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా పిప్పర్‌వాడ టోల్ ప్లాజా, పెన్‌గంగ సరిహద్దుతో పాటు భోరజ్ చెక్ పోస్ట్‌లను ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment