ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి
● కలెక్టర్ రాజర్షి షా
తాంసి: వేసవిలో సాగునీటి ఎద్దడిని నివారించేందుకు రైతులు వ్యవసాయ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలంలో భూ గర్భజలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పలు పంటలు నీరందక ఎండిపోతున్నట్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. తొలుత మండల కేంద్రంలోని సబ్‌స్టేష న్‌కు వెళ్లి విద్యుత్ సరఫరా వివరాలను ఎస్‌ఈ, డీఈలను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సరఫరాలో సమస్య తలెత్తకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. అనంతరం హస్నాపూర్ శివారు మత్తడివాగు సమీపంలో ఎండిపోతున్న జొన్న పంటను పరిశీలించారు. రైతు రవి కిరణ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. మత్తడివాగు కుడికాలువ పూర్తయినా తమ పంటలకు మా త్రం సాగునీరు అందడం లేదని రైతులు పేర్కొన్నారు. వెంటనే ఈఈ విఠల్‌తో ఫోన్‌లో మా ట్లాడి సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ రైతు బోరుబావి వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్, డీఈ హరికృష్ణ, ఏడీ శ్రావణ్, ఎంపీడీవో మో హన్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్, ఏఈవోలు శివ, నిఖిత, రైతులు ఉన్నారు.
గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): గ్రామాల్లో నీటి ఎద్ద డి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సాత్నాల మండలంలో ని అడ్డగుట్ట గ్రామ పరిధిలోని మిషన్ భగీరథ పంప్‌హౌస్‌ను బుధవారం పరిశీలించారు. గిరి గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం మండలపంచాయ తీ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఇందులో డివిజనల్ పంచాయతీ అధికారి ఫ ణిందర్‌రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment